సినీ సాహిత్య నాదాన్ని ఝుమ్మనిపించిన వేటూరి

సినీ సాహిత్య నాదాన్ని ఝుమ్మనిపించిన వేటూరి

May 22, 2022

పింగళి నాగేంద్రరావు, మల్లాది రామకృష్ణ శాస్త్రి వంటి ఉద్దండులైన సినీ గేయకవుల సరసన చేర్చాల్సిన మరోపేరు వేటూరి సుందరరామమూర్తి. తెలుగు సినీకవులలో అత్యంత వేగంగా పాటలు రాసిన వారిలో ప్రధమ స్థానం వేటూరిగారిదే. ప్రౌఢ సమాసాలతో, శబ్దసౌందర్యానికి పెద్దపీటవేసి, పదలాలిత్యంతో పల్లవులల్లిన అభినవ శ్రీనాథుడు వేటూరి. వారిని గురించి చెప్పుకునేముందు సంగీత దర్శకుడు ఇళయరాజాతో వేటూరి గారి తొలి…

వైకే నాగేశ్వరరావు స్మారక పురస్కారాల ప్రధానం

వైకే నాగేశ్వరరావు స్మారక పురస్కారాల ప్రధానం

May 17, 2022

గుంటూరు బృందావన్ గార్డెన్ లోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళా వేదికగా సాంస్కృతిక బందు సారిపల్లి కొండలరావు సారధ్యంలో యువకళావాహిని ఆధ్వర్యంలో స్వర్గీయ వై.కే. నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆదివారం(15-05-22) సాయంత్రం వైకె నాగేశ్వరరావు స్మారక పురస్కార ప్రధానం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమానికి అధ్యక్షులుగా యువకళావాహిని అధ్యక్షులు లంక లక్ష్మీనారాయణ, ముఖ్య అతిధిగా…

నాగేశ్వరరావు పంతులు అందరికీ ఆదర్శం

నాగేశ్వరరావు పంతులు అందరికీ ఆదర్శం

May 15, 2022

దేశోద్దారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు దాతృత్వం త్యాగం దేశభక్తి నేటితరానికి ఆదర్శమని కృష్ణా యూనివర్సిటి ఉపకులపతి ఆచార్యా కె.బి చంద్రశేఖర్ అన్నారు. పామర్రు మండలం ఎలకుర్రు గ్రామంలో శుక్రవారం రాత్రి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రముఖులకి విశ్వదాత అవార్డులు అందచేసారు. విశ్వదాత కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవంలో స్వతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులు ప్రముఖ విశ్లేషకులు…

కోటి రూపాయల శ్రీశ్రీ సాహిత్యం

కోటి రూపాయల శ్రీశ్రీ సాహిత్యం

April 29, 2022

అతని పేరు కొంచెం ! అతని ఊరు ప్రపంచం ! అతడే శ్రీశ్రీ !! ‘కష్టజీవికి ఇరువైపులా నిలబడ్డవాడే కవి’ అన్న వాడు, తన జీవితాంతం అలా నిలబడి ఉన్నవాడు. అతడి కసీ కృషీ-అతడి కన్నూ, పెన్నూ, గన్నూ-అతడి గేయం, ధ్యేయం, న్యాయం, శ్రమవాదం, సామ్యవాదం, మానవతావాదం. సమానవతావాదం ! సామ్రాజ్యవాదాన్ని పాతరవేసే శ్రమరాజ్యవాదం ఎజెండా అతడు. గ్లోబల్…

శంకర్-జైకిషన్ జోడీలో అగ్రజుడు

శంకర్-జైకిషన్ జోడీలో అగ్రజుడు

April 27, 2022

బాలీవుడ్ చిత్రసీమలోని సంగీత విభాగంలో అద్వితీయమైన సంస్కరణలతో అజరామరమైన పాటలకు ఊపిరులూది, హిందీ సినీ సంగీతాన్ని కీర్తిశిఖరాలకు చేర్చిన అద్భుత జంటగా శంకర్-జైకిషన్ ల పేరును ముందుగా చెప్పుకోవాలి. 1949 నుంచి 1971 వరకు ఈ జంట అందించిన సంగీతం కొత్తబాటలను పరచింది. ముఖ్యంగా 1950-60 దశకంలో ఈ జంట అందించిన సంగీతానికి ఎల్లలు లేవనడంలో సందేహం లేదు….

బుద్ధప్రసాద్ కు జీవన సాఫల్య పురస్కారం

బుద్ధప్రసాద్ కు జీవన సాఫల్య పురస్కారం

April 25, 2022

సాంస్కృతిక శిఖరం వై.కె.నాగేశ్వరరావు గారిని అందరూ స్మరించుకుంటున్నారు. నాగేశ్వరరావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా జంట నగరాల్లోని పలు సాంస్కృతిక సంస్థలు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. శృతిలయ ఆర్ట్స్ అకాడమి వారు శుక్రవారం (22-4-22) హైదరాబాద్, త్యాగరాయ గానసభ లో వైవిధ్య కార్యక్రమం నిర్వహించి వై.కె.గారికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ప్రత్యేకంగా వై.కె.స్మారక జీవన సాఫల్య…

తెలంగాణలో నాటకరంగ సాహిత్యం- శ్రీనివాస్

తెలంగాణలో నాటకరంగ సాహిత్యం- శ్రీనివాస్

April 22, 2022

“తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ” మరియు “తెలంగాణ రంగస్థల సమాఖ్య (తెర)” సంయుక్తంగా నిర్వహిస్తున్న నాలుగు రోజుల “తెలంగాణ యువ నాటకోత్సవం-6” 21వ తేది సాయంత్రం రవీంద్రభారతిలో ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్ గారు, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు, సినీ దర్శకులు దశరథ్ గారు,…

ఆత్రేయ సాహితికి నిండు నూరేళ్ళు

ఆత్రేయ సాహితికి నిండు నూరేళ్ళు

April 22, 2022

ఆచార్య ఆత్రేయ అనగానే మనకు వెంటనే స్పురించేది ‘మనసు కవి’ అనే మాట. కేవలం మనసు అనే పదాన్ని తన సాహిత్య రచనల్లో వాడినంత మాత్రాన ఆత్రేయ మనసుకవి అయిపోలేదు. సగటు మానవుని మనస్తత్వాన్ని సంపూర్ణంగా అర్ధం చేసుకొని మనసులోని మమతను గ్రహించి మన‘సు’క గా గుర్తింపు పొందారు. అందుకే ఆత్రేయ పాటల్లో మనసులోని మమతానురాగాలు, మనస్తత్వాలు అంతర్లీనంగా…

జర్నలిస్టులు సమాజానికి టార్చ్  లైట్లు

జర్నలిస్టులు సమాజానికి టార్చ్ లైట్లు

April 22, 2022

శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్ సంయుక్త అధ్వర్యంలో ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాలు సమాజంలో నాలుగో స్తంభం లాంటి జర్నలిస్టులు ఒక దిక్సూచిలా శ్రమిస్తుంటారని, త్యాగాలు మినహా ఆర్ధిక సంపాదన ఉండదని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య అన్నారు. జర్నలిజం వృత్తి అంటే కత్తి మీద సాము చేయడమేనని ఆయన అభివర్ణించారు.బుధవారం(20-04-22న)…

‘పి.వి. రమణ’ కు రావి కొండలరావు స్మారక పురస్కారం

‘పి.వి. రమణ’ కు రావి కొండలరావు స్మారక పురస్కారం

April 7, 2022

ఏప్రిల్ 2, 2022 శనివారం హైదరాబాద్ లో శ్రీ శుభకృత్ నామ తెలుగు నూతన సంవత్సర ఉగాది పర్వదినాన 2022 సంవత్సరానికి శ్రీ రావి కొండలరావు స్మారక నగదు పురస్కారం ఘంటసాల గాయకులు శ్రీ పి.వి. రమణ, కాకినాడ గారికి ప్రదానం చేశారు. ముఖ్య అతిథులుగా నరహరి మాస్టర్ గారు, చెన్నై (వెయ్యి సినిమాలకు పైగా మ్యూజిక్ కండక్టర్…