‘సోమేపల్లి’ చిన్న కథల పోటీ విజేతలు

‘సోమేపల్లి’ చిన్న కథల పోటీ విజేతలు

November 23, 2021

13వ జాతీయస్థాయి ‘సోమేపల్లి’ చిన్న కథల పోటీ విజేతలు‘రమ్యభారతి’ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన తెలుగు చిన్న కథల పోటీలలో 13వ జాతీయస్థాయి ‘సోమేపల్లి సాహితీ పురస్కారాల’ కోసం దేశం నలుమూలల నుండి 150 కథలు పరిశీలనార్థం వచ్చాయి. వాటిలో ఉత్తమంగా ఉన్న ఈ క్రింది కథలను న్యాయనిర్ణేత ఎన్నిక చెయ్యడం జరిగింది. విజేతలు: హైదరాబాద్ కు చెందిన పాండ్రంకి…

ఆదర్శ వీరనారి “ఝాన్సీ లక్ష్మీబాయి”

ఆదర్శ వీరనారి “ఝాన్సీ లక్ష్మీబాయి”

November 19, 2021

ఝాన్సీ లక్ష్మీబాయి ఈ పేరు వింటేనే యావత్ ప్రజల మనసులు ఆనందంతో సముద్రంలా ఉప్పొంగుతాయి. ఆమె గురించిన భావాలు సముద్ర కెరటాల్లా ఎగిసి పడుతుంటాయి. ఆమె పేరు వినబడితే చాలు వీర వనిత అని కోయిలలు కుహూ రాగంలో చెప్తాయి. చిలకలు కూడా భారతమాత ముద్దుబిడ్డ అని తమ చిలకపలుకులతో చెప్తాయి. ప్రకృతిమాత సైతం పిల్లగాలుల్ని ప్రసరింపజేస్తుంది. అందుకే…

బెజవాడలో ‘చిన్ని చిన్ని సంగతులు’

బెజవాడలో ‘చిన్ని చిన్ని సంగతులు’

November 17, 2021

గ్రంధాలయ వారోత్సవాల సందర్బంగా నవ్యాంధ్ర రచయితల సంఘం ఆధ్వర్యంలో..‘చిన్ని చిన్ని సంగతులు’ కవితాసంపుటి ఆవిష్కరణ కృష్ణానదీతీరంలో మంగళవారం సాయంత్రం సాహిత్య చిరుజల్లుల నడుమ కవులు, రచయితలు సేదదీరారు. అదెలా అంటే… ప్రముఖ కవి, రచయిత పి.శ్రీనివాస్ గౌడ్ ‘చిన్ని చిన్ని సంగతులు’ కవితాసంపుటి ఆవిష్కరణకు ఠాగూర్ స్మారక గ్రంథాలయం వేదిక అయింది. ఆ వేదికను ఏపీ సాహిత్య అకాడమీ…

‘ఆంధ్రభారతి’ రూపకర్త శేషతల్పశాయి

‘ఆంధ్రభారతి’ రూపకర్త శేషతల్పశాయి

November 3, 2021

(గుప్తా ఫౌండేషన్ వారి మడువల్లి కృష్ణమూర్తి పురస్కారం-2021 వాడపల్లి శేషతల్పశాయిగారు అందుకున్న సందర్భంగా…) చాలామందికి అభిరుచులనేవి జీవితానికి అనుబంధంగానే ఉంటాయి. కొందరికి మాత్రం అవే ఆయువుపట్టవుతాయి. ఇక ‘ఏంటి దీని వల్ల లాభం’ లాంటి ప్రశ్నలకు వారి వద్ద జవాబు దొరకదు. అది సమాజానికి, జాతికి ఉపకరించేదైతే చెప్పేదేముంది! ఈ కోవకు చెందినవారే శేషతల్పశాయి, నాగభూషణరావులనే ఇద్దరు మిత్రులు….

నశీర్ కు ‘జ్ఞానజ్యోతి’ పురస్కారం

నశీర్ కు ‘జ్ఞానజ్యోతి’ పురస్కారం

November 2, 2021

జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా, తెలుగు సాహిత్య రంగంలో ఇటీవల అత్యంత విశేష కృషి సల్పుతున్న రచయితకు ‘ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం‘ ఏటా ఇచ్చే ‘జ్ఞానజ్యోతి’ పురస్కారం 2021కి గాను ప్రముఖ రచయిత, చారిత్రక పరిశోధకుడు సయ్యద్ నశీర్ అహమ్మద్ కు ప్రకటించారు. భారత స్వాతంత్రోద్యమంలో ముస్లింల చరిత్రను వెలికితీసి అనేక పుస్తకాలు వెలువరించడంతోపాటు ఇతర భాషల్లోకి కూడా…

రేపే వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డులు

రేపే వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డులు

October 31, 2021

ఆగస్ట్ 14న జరగాల్సిన వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డుల కార్యక్రమం రేపు(01-11-21) విజయవాడలో జరుగనుంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాల్గొనే ఈ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా రానున్నారు. వైయస్సార్ పార్టీ అధికారం లోకి వచ్చక గత రెండేళ్ళుగా కోవిడ్ కారణంగా ఉగాది పురస్కారాలు రద్దుచేశారు. అయితే ఉగాది పురస్కారాలు స్థానే వైయస్సార్ అవార్డులు ప్రకటించారా ?…

‘సాహిత్యంతో నా సహవాసం’

‘సాహిత్యంతో నా సహవాసం’

October 28, 2021

మాడభూషి సాహిత్య కళాపరిషత్ చెన్నై వారు అంతర్జాలంలో నిర్వహించే ‘సాహిత్యంతో నా సహవాసం’ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 28-10-2021 గురువారం సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, కనకాభిశేకి కీ.శే. చిటిప్రోలు కృష్ణమూర్తిగారి వ్యక్తిత్వం, జీవనశైలి, రచనాశైలి, రచించిన రచనలు వారితో అనుబంధం అన్న అంశంతో అంతర్జాల జామ్ మీటింగ్ నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ సభలో…

బాల రసాల సాలూరు…

బాల రసాల సాలూరు…

October 26, 2021

(ర)సాలూరు రాజేశ్వరరావు అక్టోబరు 12, 1921 న విజయనగరం జిల్లా సాలూరుకు దగ్గరలో వుండే శివరామపురం లో జన్మించారు. మంగమ్మ, సన్యాసిరాజు ఆయన తల్లిదండ్రులు. తండ్రి మంచి కవి, మృదంగ విద్వాంసుడు. విజయనగరం రాజాస్థానంలో ఆయన పనిచేసేవారు. ప్రముఖ వాయులీన విద్వాంసులు ద్వారం వెంకటస్వామి నాయుడు కచేరీలకు సన్యాసిరాజు మృదంగం వాయించేవారు. రాజేశ్వరరావు కు చిన్నతనం నుంచే సంగీతం…

“రేపల్లె చరిత్ర”కు పురస్కారం

“రేపల్లె చరిత్ర”కు పురస్కారం

October 21, 2021

పాత రేపల్లె తాలుకా ప్రాంతపు చారిత్రాత్మక, ఆధ్యాత్మిక, సామాజిక రాజకీయాది రంగాల చరిత్రను క్రీ.పూ. నుంచి వర్తమానం వరకు వెలికితీస్తూ సుప్రసిద్ధ సాహితీవేత్త, చరిత్ర పరిశోధకులు మన్నె శ్రీనివాసరావు రచించిన “రేపల్లె చరిత్ర” కు ప్రతిష్టాత్మకమైన “రాజా వాసిరెడ్డి ఫౌండేషన్(హైదరాబాద్)” వారి ఉత్తమ చరిత్ర పరిశోధనా గ్రంథ పురస్కారం ప్రకటించారు. పాత రేపల్లె తాలూకాలో ఎర్పడిన రాజ్యాలు, జమిందారీ…

ప్రేమగంతల ‘దాగుడు మూతలు’

ప్రేమగంతల ‘దాగుడు మూతలు’

October 19, 2021

చైతన్యం, ఉత్సాహం, వేగం, ఆనందం సినీదర్శకుడికి ఉండాల్సిన ముఖ్య లక్షణాలు. ఆ లక్షణాలు మూర్తీభవించిన ఆదుర్తి సుబ్బారావు సినిమాలు గంటకు గంటన్నర వేగంతో పరుగెడతాయి. నీరసంగా కూర్చున్న ప్రేక్షకుణ్ణి భుజంతట్టి నిటారుగా కూర్చోబెడతాయి. విషాద సన్నివేశాలు కూడా విసుగెత్త కుండా నడుస్తాయి. సెంటిమెంటు పండించడంలో, హాస్యాన్ని విరజిమ్మడంలో ఆదుర్తి తనకుతానే సాటి. ఆర్క్ లైట్లకు దూరంగా నటీనటులను అవుట్…