టివి సీరియల్స్ కే ప్రజాదరణ – మురళీమోహన్

టివి సీరియల్స్ కే ప్రజాదరణ – మురళీమోహన్

November 3, 2023

(కనుల పండువగా అక్కినేని ఎక్స్ లెన్స్ టివి స్టార్ అవార్డ్స్) సినిమాలు ఆడినా ఆడకున్నా సీరియల్స్ కు మాత్రం ఆదరణ కొనసాగుతున్నదని, సంవత్సరాల తరబడి సీరియల్స్ కొనసాగుతున్నా మహిళలు ఆసక్తిగా తిలకిస్తున్నారని సినీ నటుడు, పూర్వ పార్లమెంట్ సభ్యులు మురళీమెహన్ అన్నారు. తెలుగు చిత్రసీమలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఎవర్ గ్రీన్ హీరో అని అభివర్ణించారు. సోమవారం(30-10-23) హైదరాబాద్…

అజో-విభొ-కందాళం సంస్థ-2024 పురస్కారాలు

అజో-విభొ-కందాళం సంస్థ-2024 పురస్కారాలు

November 2, 2023

ప్రతిభామూర్తి జీవితకాల సాధన, విశిష్ట సాహితీమూర్తి జీవితకాల సాధన, సరిలేరు నీకెవ్వరు పురస్కారం, 2024 సం. పురస్కారాలు అజో-విభొ-కందాళం సంస్థ ప్రకటించింది.అజో-విభొ-కందాళం సంస్థ 1994లో ఏర్పడింది. గత 30 సంవత్సరాలుగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వివిధ పట్టణాలలో సాహిత్య-సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. “ప్రతిభామూర్తి జీవితకాల సాధన” పురస్కారం – యల్లపు ముకుంద రామారావు“విశిష్ట సాహితీమూర్తి జీవితకాల సాధన” పురస్కారం…

‘విశ్వవిఖ్యాత’ చిత్రకారుడు – ఎస్వీ రామారావు

‘విశ్వవిఖ్యాత’ చిత్రకారుడు – ఎస్వీ రామారావు

November 1, 2023

(ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ జీవితసాఫల్య పురస్కారం-2023 అందుకున్న సందర్భంగా…) ఆధునిక చిత్రకళలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన మన తెలుగువాడు డాక్టర్ ఎస్వీ రామారావు. నైరూప్య చిత్రకళలో సంపూర్ణత్వాన్ని సాధించి ప్రపంచ ఖ్యాతి గడించారు. నవ్యచిత్రకారుడే కాకుండా, కళా విమర్శకుడు, వ్యాస రచయిత, కవిత్వంలో కూడా చేయితిరిగిన దిట్ట ఎస్వీ. తైలవర్ణంలో ఆయన గీసిన అద్వితీయమైన చిత్రాలు ఓ సంచలనం….

‘తానా’ ఆధ్వర్యంలో కొసరాజు సమగ్ర సాహిత్యం

‘తానా’ ఆధ్వర్యంలో కొసరాజు సమగ్ర సాహిత్యం

November 1, 2023

(‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో కొసరాజు రాఘవయ్య గారి సమగ్ర సాహిత్యం పుస్తక రూపం దాల్చనుంది.)ఉత్తర అమెరికా తెలుగు సంఘం సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆద్వర్యంలో ప్రముఖ సినీ కవి, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్యాన్ని సిరివెన్నెల కుటుంబసభ్యుల సహకారంతో మొత్తం ఆరు సంపుటాలలో ముద్రించి సిరివెన్నెల అభిమానులకు, సాహితీ ప్రియులకు ఇటీవలే కానుకగా…

జ్ఞాపకాల నెమలీకలు-‘నీలిమేఘాలు’

జ్ఞాపకాల నెమలీకలు-‘నీలిమేఘాలు’

October 25, 2023

(‘నీలిమేఘాలు’ నాల్గవ ముద్రణ పుస్తకావిష్కరణ విశేషాలు) అక్టోబరు 3, 2023 తెలుగు కవిత్వంలో ఒక గుర్తుంచుకోదగిన రోజు. 30 ఏళ్ళ కిందట తెలుగు కవిత్వాన్ని ఒక కుదుపు కుదిపిన ‘నీలిమేఘాలు’ నాల్గవ ముద్రణ హైదరాబాదులో ఆవిష్కరణ జరిగిన రోజు. మళ్ళీ 3 దశాబ్దాల తర్వాత అదే నగరంలో ఆవిష్కరణకు అందరూ కలిసిన రోజు.తెలుగు కవిత్వంలో భావ కవిత్వం, అభ్యుదయ…

సైన్సుకు సాహితీ పరిమళాన్ని అద్దిన డా. నాగసూరి

సైన్సుకు సాహితీ పరిమళాన్ని అద్దిన డా. నాగసూరి

October 24, 2023

(సాహిత్యం, సైన్స్, మీడియా రచనల గురించి ఆకాశవాణి పూర్వ సంచాలకులు, ప్రముఖ రచయిత, డా. నాగసూరి వేణుగోపాల్ తో ఇంటర్వూ)ఒకప్పుడు సుప్రభాత వేళ నుండి రాత్రి పడుకునే వరకు సంగీత, సాహిత్య, నాటకాది విభిన్న కార్యక్రమాలతో ఆకాశవాణి ఆబాల గోపాలాన్ని అలరించేది. నాలుగయిదు దశాబ్దాల క్రితం ఆకాశవాణి కి ప్రజలకు అవినాభావ సంబంధం వుండేది. అలాంటి ఆకాశవాణిలో వివిధ…

తొలి నవల “బటర్ ఫ్లై”తో సంచలనం

తొలి నవల “బటర్ ఫ్లై”తో సంచలనం

October 23, 2023

చిన్నారి సైరా ఖైషగి అదృష్టవంతురాలు. వయసు పదమూడేళ్లు. తెలివైన కవయిత్రి, రచయిత్రి. అందునా యూనివర్సల్ లాంగ్వేజ్ ఆంగ్లంలో రాస్తుంది. కథలు, కవితలు సరే సరి. నవల కూడా రాసేసింది. పదిన్నరేళ్ల వయసున్నప్పుడు కేవలం తొమ్మిది రోజుల్లో రాసిన నవల బటర్ ఫ్లై! అన్విక్షికి పబ్లికేషన్స్ వారు ప్రచురించారు. అక్టోబర్ 8న జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్ లో బటర్ ఫ్లై…

కవిత్వం సమాజాన్ని ఆలోచింపజేస్తుంది – గౌరునాయుడు

కవిత్వం సమాజాన్ని ఆలోచింపజేస్తుంది – గౌరునాయుడు

October 16, 2023

(విజయవాడలో ఎక్స్ రే 42 వ. కవిత్వ పురస్కార ప్రదానం) జీవితంలోని చీకటి, వెలుగులకు అక్షరరూపమే కవిత్వమని. ఉత్తమ కవిత్వం సజీవమైనదని ప్రముఖ కవి గంటేడ గౌరునాయుడు అన్నారు. శనివారం(14-10-23) సాయంత్రం ఎక్స్ రే సాహిత్య మాసపత్రిక నిర్వహణలో జాతీయస్థాయి కవితల పోటీ-2022 అవార్డుల బహుకరణ విజయవాడ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో కవితలపోటీ…

సినారె సినీ రంగ ప్రవేశ నేపథ్యం

సినారె సినీ రంగ ప్రవేశ నేపథ్యం

October 15, 2023

జ్ణానపీఠ పురస్కార కవివరేణ్యుడు ఆచార్య సింగిరెడ్డి నారాయణరెడ్డి సినీరంగ ప్రవేశానికి 1954-55 మధ్యకాలంలోనే బీజం పడింది. అప్పుడు విజయనగరంలో జరిగిన నాటకపోటీలకు న్యాయనిర్ణేతగా పాల్గొనడానికి వెళ్లినప్పుడు ముదిగొండ లింగమూర్తి, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గార్లతో సినారె గారికి పరిచయమైంది. తర్వాత 1955లో సినారె రచించిన కావ్యం ‘నాగార్జున సాగరం’ ను ప్రముఖ దర్శకనిర్మాత బి.ఎన్.రెడ్డి విని సినారె ను చిత్రసీమకు…

సృజనశీలి సుభద్రాదేవి

సృజనశీలి సుభద్రాదేవి

September 24, 2023

కొంత మంది రచయితలు ఒకటో రెండో పుస్తకాలు రాసి శిఖరం మీద కూర్చొని… కీర్తి పతాకాలనెగరేస్తుంటారు. కాని కొందరు కలం పట్టిన దగ్గరనుండి నిరంతరం రచనను కొనసాగిస్తూనే వుంటారు. సమకాలీన సమాజాన్ని వేయికళ్ళతో గమనిస్తూ.. ఎప్పటికప్పుడు స్పందిస్తూనే వుంటారు. నిరంతరం ప్రవహించే జీవనదిలా వారి రచన చిగురెత్తుతునే వుంటుంది. అలాంటి వారిలో శీలా సుభద్రాదేవి గారొకరు. ఈమె సుమారుగా…