కథల పోటీ విజేతలకు ‘సోమేపల్లి పురస్కారాల’ ప్రదానం

కథల పోటీ విజేతలకు ‘సోమేపల్లి పురస్కారాల’ ప్రదానం

July 26, 2023

గుంటూరులో జాతీయస్థాయి చిన్న కథల పోటీ విజేతలకు ‘సోమేపల్లి పురస్కారాల’ ప్రదానం “సమాజంలో జరిగే వివిధ సంఘటనలకు అక్షర ప్రతిబింబమే కథ” అని అభ్యుదయ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి, కేంద్రసాహిత్య అకాడమీ తెలుగు విభాగం సభ్యులు వల్లూరు శివప్రసాద్‌ అన్నారు. ‘రమ్యభారతి’ ఆధ్వర్యంలో జూలై 23, ఆదివారం గుంటూరు, బృందావన్‌ గార్డున్స్‌లో గల పద్మావతి కళ్యాణ మండపం…

చమత్కార చక్రవర్తి ‘శ్రీరమణ’ కన్నుమూత

చమత్కార చక్రవర్తి ‘శ్రీరమణ’ కన్నుమూత

July 19, 2023

‘శ్రీరమణ'(కామరాజ రామారావు) ఈ ఉదయం (19 జులై, బుధవారం) నాడు హైదరాబాద్ లో కన్నుమూశారు. ప్రసిద్ధి ప్రముఖ కథకుడు, వ్యంగ్య వ్యాస రచయిత, సుప్రసిద్ధమై, సినిమాగా కూడా మలచబడిన మిథునం కథా రచయిత, పత్రికల్లో వ్యంగ్య హాస్య భరితమైన కాలమ్స్ నడిపిన కాలమిస్టుగా, కథకుడిగా, సినిమా నిర్మాణంలో నిర్వహణ పరంగా, పలు విధాలుగా సాహిత్య, కళా రంగాల్లో ప్రసిద్ధి…

“కలిమిశ్రీ”కి కుసుమ ధర్మన్న సాహిత్యసేవాపురస్కారం

“కలిమిశ్రీ”కి కుసుమ ధర్మన్న సాహిత్యసేవాపురస్కారం

July 16, 2023

గతేడాది జాతీయసాంస్కృతిక సంబరాలు నిర్వహించి నవ మల్లెతీగలా విజయవాడను అల్లుకున్న సాహిత్యపరిమళాలు ఎల్లడలా తెలుగుప్రజల హృదయాలను తాకి.. కనకదుర్గమ్మ తల్లి సంకల్ప బలంతో నేడు దళిత ఉద్యమ వైతాళికుడు కుసుమ ధర్మన్న పేరిట తొట్టతొలి సాహిత్యసేవా పురస్కారాన్ని కలిమిశ్రీ అందుకుని ఆయన అందరికీ చెలిమిశ్రీగా నిలిచారని సాహితీ ప్రముఖులు పలువురు అభినందనల ప్రశంసలజల్లు కురిపించారు. స్వాతంత్య్రపారాటానికి సంబంధించి గరిమెళ్ళ…

సుస్వర మాంత్రికుడు ‘యమ్మెస్వి’

సుస్వర మాంత్రికుడు ‘యమ్మెస్వి’

July 15, 2023

(జూలై 14, ఎం.ఎస్. విశ్వనాథన్ వర్ధంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం…) సంగీతమనేది మానవుడికి భగవంతుడు ప్రసాదించిన వరం. అది ఒక అద్భుతం! సృష్టిలో దాని స్థానం అద్వితీయం. ఆనందం, బాధ, కోపం, ప్రేమ, విరహం వంటి యెలాంటి భావాలకైనా అద్దంపట్టేది సంగీతమే. వేదాలు కూడా సంగీత స్వరాలే. రాళ్ళనుకూడా కరిగించే గాంధర్వం సంగీతం. సంగీతం సాధించలేనిది యేదీ…

సాహితీ వేత్తలకు నేడే పురస్కార ప్రదానం

సాహితీ వేత్తలకు నేడే పురస్కార ప్రదానం

July 8, 2023

ముగ్గురూ ముగ్గురే… ఎవరి రంగంలో వారు నిష్ణాతులే.. సాహితీ దిగ్గజాలే..ఒకరు సైన్స్ రచయిత, ఇంకొకరు కవి, అనువాద బ్రహ్మ, మరొకరు ఆచార్యులు.ఈరోజు(8-7-23) శనివారం 10.30 గంటలకు హైదరాబాద్, రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాలులో…మల్లవరపు జాన్ స్మారక సాహితీ పురస్కారాల ప్రదానం జరుగుతుంది.‌ 2021, 2022, 2023సంవత్సరాలకు గాను డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, ముకుందరామారావు, ఆచార్య శిఖామణి గారికి పురస్కారాలను అందజేస్తారు….

కవిత్వ పరిభాష తెలిసిన కవి

కవిత్వ పరిభాష తెలిసిన కవి

July 4, 2023

“కవులేం చేస్తారుగోడలకు నోరిస్తారుచెట్లకు కళ్ళిస్తారు, గాలికి గొంతిస్తారు.ప్రభుత్వాల్ని ధిక్కరిస్తారుప్రజలకు చేతులిస్తారుతెల్ల కాయితానికి అనంత శక్తినిస్తారు” అని ప్రఖ్యాత కవి శివారెడ్డి గారు అంటారు. నిరంతర పఠనం, లేఖనం ఆయన స్వభావం. ఆయన కవులకు కవి. అంతకు మించిన మానవుడు. కవులను ఎంతగా ప్రేమిస్తారో మామూలు మనుషులను అంతగా ప్రేమిస్తారు. ఆయన ఒక కవిత్వం చెట్టు. ఎక్కడెక్కడి కవి ఖుక…

బహుముఖ ప్రజ్ఞాశాలి – సంజీవదేవ్

బహుముఖ ప్రజ్ఞాశాలి – సంజీవదేవ్

తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి. బహుముఖ ప్రజ్ఞాశాలిగా, బహుభాషాభిజ్ఞునిగా, లలితకళా విమర్శకునిగా ప్రఖ్యాతి పొందిన దార్శనికుడు, సమాచార సంబంధాలు అంత అంత మాత్రమే ఉన్న పురాతన కాలంలో కేవలం తన లేఖల ద్వారా దేశ , అంతర్జాతీయ చిత్రాకారులతో, సుప్రసిద్ద మేధావులతో కలం స్నేహం జరిపి ఎంతో జ్ఞానాన్ని, అనుభవాలను సంతరించుకున్న అరుదైన వ్యక్తిత్వం గల సూర్యదేవర సంజీవదేవ్…

‘చందమామ’పై అందుకున్న డాక్టరేట్

‘చందమామ’పై అందుకున్న డాక్టరేట్

July 1, 2023

‘చందమామ’పై పరిశోధించి పి.హెచ్డీ. సాధించడం నా కల! ఎందుకంటే నన్ను చందమామ రచయితను చేసింది. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు అందుకునేలా తీర్చిదిద్దింది. ఇన్నాళ్ళకు ఇన్నేళ్ళకు నా కల నెరవేరింది. 1975లో పదేళ్ళ వయసులో మొదటిసారి ‘చందమామ’ పుస్తకం చూశాను. అట్ట చినిగిపోయి, జీర్ణావస్థలో ఉన్న ఆ పుస్తకం రంగుల బొమ్మలతో మంచి మంచి కథలతో నన్ను చాలా…

రచయితలకు ఆహ్వానం- తెలుగు కథానిక

రచయితలకు ఆహ్వానం- తెలుగు కథానిక

July 1, 2023

ఉత్తర అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, సింగపూర్, దక్షిణ ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలు, ఐరోపా విదేశీ ప్రాంతాలలో స్థిరపడిన భారతీయ కథకుల రచనలని గుర్తిస్తూ గత ఏడాది వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వెలువరించిన “డయాస్పోరా తెలుగు కథానిక-16 వ సంకలనం” ప్రపంచవ్యాప్తంగా పాఠకుల, సాహితీవేత్తల, విశ్లేషకుల ఆదరణ పొందిన విషయం విదితమే.ఆ పరంపరను కొనసాగిస్తూ ఈ సంవత్సరం…

‘తానా’ కావ్య పోటీల్లో ‘లక్ష’ గెలుచుకున్న బులుసు

‘తానా’ కావ్య పోటీల్లో ‘లక్ష’ గెలుచుకున్న బులుసు

June 30, 2023

సిరివెన్నెల స్మృతిలో తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వహించిన లక్ష రూపాయల బహుమతితో కూడిన కావ్య పోటీలలో 91 మంది రచయితలు పాల్గొనడం విశేషం. లక్ష రూపాయల బహుమతి విజేత బులుసు వెంకటేశ్వర్లుకు, తానా ఈ పుస్తకంలో ప్రచురించడానికి అర్హత పొందిన 50 మంది కావ్య రచయితల వివరాలు ప్రకటించారు. ప్రముఖ సినీ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి…