నా జీవితం కార్టూన్ కళ తో నిండిపోయింది – బి.యస్. రాజు

నా జీవితం కార్టూన్ కళ తో నిండిపోయింది – బి.యస్. రాజు

నేనూ…పుట్టిందీ.. పెరిగిందీ…రోడ్లరిగిపోయేలా బలాదూరుగా తిరిగిందీ కాకినాడలోనే. నా విద్యాభ్యాసం కాకినాడ పి.ఆర్.జే.సి.లో. మాస్కూలుకి దగ్గర్లోనే ఓ పెద్ద లైబ్రరీ వుండేది. అందులో అనేక పుస్తకాలతో బాటు ఎప్పట్నుంచో సేకరించిన వార, మాస పత్రికలు వుండేవి. వాటిలో బాపు, శంకు, బాబు, సేకరించిన సత్యమూర్తి గార్ల లాంటి ఉద్దండుల కార్టూన్లు పడుతుండేవి. వాటినన్నింటినీ క్రమం తప్పకుండా చదువుతుండేవాడిని. వారు వేసిన…

“రమణీ ”య ప్రకృతి – సిరాజ్ చిత్ర ఆకృతి

“రమణీ ”య ప్రకృతి – సిరాజ్ చిత్ర ఆకృతి

  “కళ” అన్న  పదాన్ని ఎవరు ఎన్ని రకాలుగా నిర్వచించినా  వ్యక్తి తనలో కలిగిన సృజనాత్మక శక్తితో   ఎదుటవారిని రంజింప జేయాడానికి చేసే ఒక ప్రయత్నం” కళ “ అని చెప్పవచ్చు .ఆ కళ ద్వారా సమాజాన్ని ఆనందింప జేయడం మాత్రమే గాక వ్యక్తి తాను తన కుటుంభం  కుడా అన్నివిధాలా ఆనందం పొందినప్పుడు ఆ కళ కు మరింత  సార్ధకత ఏర్పడుతుంది. దురద్రుష్టవశాత్తు ఆ అదృష్టం అందరిని వరించదు. కొందరికే…

అత‌డొక‌.. నిత్య చైత‌న్య స‌మ్మో‌హ‌నం

అత‌డొక‌.. నిత్య చైత‌న్య స‌మ్మో‌హ‌నం

ఆర్టిస్ట్, కార్టూనిస్ట్, రైటర్ మోహన్ గారి స్మృతిలో….!! అనగనగనగా.. అవి తెలుగునాట 336 ఛానళ్లు లేని రోజులవి. దినపత్రికలు, వారపత్రికలే.. ప్రజలకు నిత్య సమాచార, వినోద సాధనాలుగా ప్రచండభానులై ప్రజ్వలిస్తూ.. మంచో, చెడో, యమ గడ్డుగానో సాగిపోతున్న రోజులవి. సరిగ్గా ఆ రోజుల్లో.. భారతదేశంలోని తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది వ్యంగ్య చిత్రకళా సామ్రాజ్యాన్ని ఎడాపెడా ఏలూతూ.. ఆ రాజ్యంలోని…

ఉప్పల లక్ష్మణరావు

ఉప్పల లక్ష్మణరావు

బతుకు ఉద్యమ సాహిత్య యాత్ర “సామాజిక సంబంధాలలోనూ,ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాల గురించీ నాలో తీవ్రమైన భావాలు స్పష్టమైన రూపంలో స్థిరపడ్డాయి. ఈ నా సామాజిక భావాలకీ, సోషలిస్టు విప్లవ సామాజికభావాలకీ నా ద్రుష్టిలో అవినాభావ సంబంధం ఉంది. అంతే కాకుండా, కమ్యూనిస్టు సమాజస్థాపన విజయవంతంగా స్థిరపడాలంటే, సామాన్య ప్రజలలోనైతేనేమి, మధ్యతరగతి ప్రజలలో ఐతేనేమి, మేధావులలో అయితే యేమి,…

కవి దేవిప్రియ ప్రేమకథ ….

కవి దేవిప్రియ ప్రేమకథ ….

కొందరి గురించి చెప్పుకునేటప్పుడు.. మనసుని, శరీరాన్ని కొత్తగా , వైవిధ్యంగా మలచుకోవాలి. ఈ మాటేదో కొత్తగా ఉందే.. అనుకోవచ్చు. కానీ, కొందరితో కరచాలనాలు చేయడానికి సిద్ధపడాలంటే.. మనలో మనంగా, మన మనసులోనూ కొత్తదనాన్ని నింపుకోవాలి. అది ఎంతగా అంటే.. వొళ్ళంతా పూలపరిమళాలను అద్దుకోవాలి. అంతకీ చాలకపోతే.. కాసిన్ని నక్షత్రాలను అప్పుతెచ్చుకుని.. కాసేపైనా వాటిని జేబులో ఉంచుకోవాలి. ఇంకా నీలినింగిలో…

విలక్షణ చిత్రకారుడు – సత్యవోలు రాంబాబు

విలక్షణ చిత్రకారుడు – సత్యవోలు రాంబాబు

విలక్షణ చిత్రకారుడు – సత్యవోలు రాంబాబు కొంతమంది పల్లెటూరి పోరగాళ్ళకు.. చాలాచాలా డ్రీమ్స్ ఉంటాయి. ఊళ్ళో చదువు పూర్తయ్యాక.. వెంటనే పట్నం వెళ్ళిపోవాలి. ఆనక డాక్టరో, యాక్టర్, సాఫ్ట్ వేరు ఇంజనీరో అవ్వాలి.. ఇలా రకరకాల రంగుల కలలు కనడం కామన్. ఈ కుర్రాడు కూడా అందరిలాగానే.. తను కూడా టెన్త్, ఇంటర్ అయ్యాక పట్నం వెళ్ళాలనుకున్నాడు. ఇంజనీరో,…

పత్రికారంగంలో ఇంద్రజాలికుడు

పత్రికారంగంలో ఇంద్రజాలికుడు

September 13, 2018

పుస్తకాలు, పత్రికలు లేని ప్రపంచాన్ని నేడు ఊహించుకోలేం. ఈ ప్రపంచంలో పుస్తకం ఓ అద్భుతం. ఎందరెందరో భాషాభిమానం, దేశాభిమానం, సమాజశ్రేయస్సు, ఉద్యమస్ఫూర్తితో పత్రికలు స్థాపించి పాఠకులకు అందుబాటులోకి తెస్తున్నారు. లెక్కకు మిక్కిలిగా వెలువడుతున్న పత్రికలలో చిరకాలం నడిచేవి-పాఠకాభిమానం పొందేవి కొన్నే. పత్రికలను పాఠకాభిమానం పొందేలా సారధ్యం వహించేవాడు సంపాదకుడు. అలాంటి పత్రికా సంపాదకులలో మేటి స్వాతి వీక్లీ సంపాదకులు…

 గురువే బ్రహ్మ

 గురువే బ్రహ్మ

 దాదాపు యాబై ఏళ్ళ క్రితం ఉపాధ్యాయుడి గొప్ప తనాన్ని గురించి వర్ణిస్తూ డాక్టర్ D.S. కొటారి అనే విద్యావేత్త పలికిన పలుకులివి .చదవడం ,రాయడం లేదా విని అర్ధం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ ఆమాటల్లో ఎంతటి అర్ధం,పరమార్ధాలు ఉన్నాయో అవగతమవుతుంది .             ఒక తరగతి గదిలో పిల్లాడికి ఓనమాలు తదితర పాటాలు చెప్పే ఒక సాధారణ ఉపాధ్యాయుడు…

స్వాతంత్రభారతికి చిత్రకళాహారతి

స్వాతంత్రభారతికి చిత్రకళాహారతి

September 12, 2018

హిమశైల శిఖరం ఎలుగెత్తి పిలిచింది సాగరం ఎదపొంగి స్వాగతం పలికింది ఓ భారతీయుడా స్వాతంత్ర పౌరుడా ఏ జన్మ పుణ్యమో ఈ తల్లి నీదిరా… స్వేచ్ఛాభారతిని కాంక్షించి, లక్షలాదిమంది ప్రాణాలర్పించిన మహోజ్వలమైన ఘట్టం భారత స్వాతంత్ర పోరాటం. ఆంగ్లేయుల పాశవికమైన పాలన నుండి, మన మాతృభూమిని విముక్తం చేయాలని, మనసారా విశ్వసించి తమ జీవితాలను తృణప్రాయంగా ధారపోసిన వీరులు ఎందరో…వీరనారీమణులు మరెందరో. వందేమాతరమంటూ చెరసాలల్లో చిత్రహింసలు అనుభవించిన దేశభక్తులు, జాతీయపతాకాన్ని చేతబూని మండుటెండల్లో బ్రిటీష్ పాలకుల కొరడా దెబ్బలకు శరీరమంతా రక్తం ధారలు కట్టిన త్యాగధనులు ఎందరో.. ఎందరెందరో.. చేతిలో భగవద్గీతతోఉరికంబాల పై ప్రాణాలనర్పినూ, ఏనాటికైనా ఈ భారతదేశం స్వతంత్రం కావాలని మనసారా వాంఛించిన మహితాత్ములు ఇంకెందరో… ఈ దేశభక్తుల, ఈ ధర్మమూర్తుల, ఈ కర్మవీరుల, ఈ త్యాగధనుల త్యాగాల ఫలమే, పోరాటాల ఫలితమే, ప్రపంచ చరిత్రలోనే తిరుగులేనిమహోజ్వలమైన అధ్యాయం భారత స్వరాజ్య సంగ్రామం. ఈ త్యాగధనులకు, ఈ కర్మధనులకు, ఈ పుణ్యపురుషులకు, ఈ సహృదయమూర్తులకు నివాళి సమర్పించడం మనందరి కర్తవ్యం. గురుతరమైన బాధ్యత, ఇది నిస్సందేహం.  ఈ 72వ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా,ఈ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించడానికి, ఓ వినూత్నమైన ఆలోచన చేశారు. డా. దీర్దాసి విజయభాస్కర్. ఆంధ్రప్రదేశ్భా షా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో, ఓ గొప్ప కార్యక్రమానికి సంకల్పించారు. స్వరాజ్యవీరులకు ఘననివాళి సమర్పించాలని నిశ్చయించారు. అదిగో… అలా.. డా.విజయభాస్కర్ సంకల్పం నుండి ఉ ద్భవించింది. “స్వాతంత్ర భారతికి చిత్రకళాహారతి” అనే విశిష్టమైన కార్యక్రమం. అజ్ఞాతులైన ఎందరో స్వాతంత్ర్య వీరుల, దివ్య రూపాలకు ప్రాణప్రతిష్ఠ…