ప్రాచీన ఆధునికతలకు మేలి మేళవింపు: గిరిధర్ గౌడ్

ప్రాచీన ఆధునికతలకు మేలి మేళవింపు: గిరిధర్ గౌడ్

January 3, 2019

(జనవరి 4 న అఖో, విభో సంస్థ ‘సరి లేరు నీ కెవ్వరు ‘ విశిష్ట చిత్రరచనా పురస్కారం తో రాయన గిరిధర్ గౌడ్ ను తెనాలి లో సత్కరిస్తున్న సందర్భంగా..) ప్రాచీన భారతీయ చిత్రకళకు ఆధునికతను అద్దుతూ, దేశ విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన గ్రామీణ చిత్రకారుడు రాయన గిరిధర్ గౌడ్, శివుని వాహనం నంది పై…

జీవిత కాలం సరిపోదేమో – ఎం. ఎం. మురళీ

జీవిత కాలం సరిపోదేమో – ఎం. ఎం. మురళీ

ఎం. ఎం. మురళీ గత రెండు దశాబ్దాలుగా అభిరుచి తో కార్టూన్లు గీస్తూ, కార్టూన్-కవిత్వం-కథారచన వంటి విభిన్న రంగాలలో రాణిస్తున్నారు. మన కార్టూనిస్టులు శీర్షికలో ఈ నెల పరిచయం వారి మాటల్లో చదవండి… ఎం. ఎం. మురళీ పేరుతో కార్టూన్లు గీస్తున్న నా పూర్తి పేరు మల్లారెడ్డి మురళీ మోహన్. మా సొంత ఊరు శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట…

వడ్డాది పాపయ్య కు స్నేహితులు లేరా!

వడ్డాది పాపయ్య కు స్నేహితులు లేరా!

డిశంబరు 30 న వడ్డాదిపాపయ్య గారి 26 వ వర్ధంతి సందర్భంగా వారి స్నేహితులలో ముఖ్యులు సుంకర చలపతిరావుగారు తెలిపిన కొన్ని ముఖ్య విషయాలు మీకోసం… వ.పా., పావనం, వడ్డాదిపాపయ్య అనేపేరు తెలుగు చిత్రకళారంగంతో పరిచయం వున్న వారికీ, పత్రికా పాఠకులకీ సుపరిచితం. 1940-90ల మధ్య కాలంలో పిల్లల పత్రిక ‘చందమామ’, పెద్దల పత్రిక ‘యువ’ తర్వాత స్వాతి…

బహుముఖీన సాహిత్య సృజన-ఇనాక్

బహుముఖీన సాహిత్య సృజన-ఇనాక్

(కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు – 2018కు కొలకలూరి ఇనాక్ ఎంపికైన సందర్భంగా ప్రత్యేక వ్యాసం) స్వాతంత్య్రానంతర సాహిత్యపు తొలితరం కలంయోధుడు ఆచార్య కొలకలూరి ఇనాక్, కలంతో ఆరుదశాబ్దాలకు పైగా అలుపెరుగని సాహితీ సేద్యం చేస్తున్న కృషీవలుడు. ఇనాక్ కంటే ముందు సంఘసంస్కరణ దృక్పధంతో సాగిన సామాజిక ప్రయత్నాలు, వెలువడిన సాహిత్యం ఈ దేశపు ఆంటరానివాడల వరకు వ్యాపించలేకపోయాయి….

2018 ఎక్ష్-రే పురస్కార విజేతలు

2018 ఎక్ష్-రే పురస్కార విజేతలు

2018 ఎక్ష్ రే విజేతలు “ప్రపంచమొక పద్మవ్యూహం, కవిత్వమొక తీరని దాహం” అన్న మహాకవి శ్రీశ్రీ భావాలతో మమేకమై గత 38 సం.లుగా నిరంతరంగా నిర్వహిస్తున్న ‘ఎక్ష్ రే’ అవార్డులకు కవుల స్పందన మరింత ప్రోత్సాహాన్ని ఇస్తున్నది. సమాజ ముఖచిత్రం నుండి రగులుతున్న భారతం వరకు, శ్రమజీవికి వందనం నుండి మట్టిబంధం వరకూ. కాదేదీ కవితకు అనర్హం అన్న…

మూగబోయిన పాంచజన్య

మూగబోయిన పాంచజన్య

శ్రీకృష్ణభగవానుడు పూరించే శంఖం పాంచజన్య. ఆ శంఖం శబ్దం వింటేనే శత్రువుల గుండెల్లో భయాందోళనలు మొదలయ్యేవి. తమకు మరణం తప్పదని వణికిపోయేవారు. రాక్షసత్వం పై విజయానికి సంకేతంగా చెప్పే పాంచజన్యాన్ని తన కలం పేరుగా నాలుగుదశాబ్దాల క్రితం – ఒక జర్నలిస్ట్ అవతరించాడు. అతడే పాంచజన్య. ముఖ దినపత్రికకు, కంటి బ్యూటర్గా జర్నలిస్ట్ జీవితం ఆరంభించి, ‘పాంచజన్య’గా పాప్యు…

‘పద్మశ్రీ’ పొందిన తొలికళాదర్శకుడు తోటతరణి

‘పద్మశ్రీ’ పొందిన తొలికళాదర్శకుడు తోటతరణి

ఆయన మండుటెండల్లో మంచుపర్వతాలను సృష్టిస్తాడు. స్వర్గలోకాన్ని దివినుంచి భువికి దింపుతాడు. ముంబాయ్ వీధులను చెన్నై స్టూడియోలోకి తీసుకొస్తాడు పగలే వెన్నెలను కురిపిస్తాడు. సృష్టికి ప్రతి సృష్టి చేయడంలో ‘రీల్‘ విశ్వామిత్రుడిగా పేరొందిన ఆయనే సుప్రసిద్ద కళాదర్శకుడు ‘పద్మశ్రీ తోటతరణి. సినిమా అంటే హీరోహీరోయిన్లు, దర్శకుడి గురించి మాత్రమే మాట్లాడుకునే సగటు ప్రేక్షకుడు సైతం తోటతరణి పేరు చూసి సినిమాకు వెళ్లే…

కన్నుమూసిన నఖచిత్రకారుడు శిష్ట్లా రామకృష్ణారావు

కన్నుమూసిన నఖచిత్రకారుడు శిష్ట్లా రామకృష్ణారావు

‘ ఆస్కా ‘ గౌరవ అద్యక్షులుగా పనిచేసిన రామకృష్ణారావు నఖ చిత్రకళకు జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చారు. కేవలం నఖ చిత్రాలు గీయడమే కాకుండా వాటిని పుస్తకరూపం లో అందించారు. 2004 లో ఆంద్రకళాదర్శిని పుస్తక ఆవిష్కరణ సమయంలో తన నఖ చిత్రాల తో కూడిన సంపూర్ణ రామాయణం పుస్తకాన్ని సభకు వచ్చిన వారికి బహూకరించారు. వీరి రూపం…

దేవేంద్రాచారికి పెద్దిబొట్ల సుబ్బరామయ్య స్మారక పురస్కారం

దేవేంద్రాచారికి పెద్దిబొట్ల సుబ్బరామయ్య స్మారక పురస్కారం

ప్రసిద్ధ కథా నవలా రచయిత సుంకోజి దేవేంద్రాచారి కి పెద్దిభొట్ల సుబ్బరామయ్య సాహితీ పురస్కారాన్ని ప్రకటించారు . తెలుగు సాహిత్య రంగంలో విశేషంగా కృషి చేసిన సీనియర్ సాహితీవేత్త పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి పేరిట అందచేస్తున్న ఈ స్మారక పురస్కారానికి చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలానికి చెందిన సుంకోజి దేవేంద్రాచారి ఎంపికయ్యారు. డిసెంబర్ పదహైదు శనివారం సాయంత్రం ఆరు…

‘గోతెలుగు ‘ ను అందుకే ప్రారంభించా – బన్ను

‘గోతెలుగు ‘ ను అందుకే ప్రారంభించా – బన్ను

December 1, 2018

పాతికేళ్ళుగా పత్రికలలో కార్టూన్లు గీస్తున్న” బన్ను” గారి కార్టూన్ ప్రస్థానం ఈ నెల ‘ మన కార్టూనిస్టులు ‘ శీర్షిక లో తెలుసుకుందాం. బన్ను పేరుతో కార్టూన్స్ వేసే నా అసలు పేరు పాలచర్ల శ్రీనివాసు. పుట్టింది 29 జనవరి 1969, రాజమండ్రి లో. అమ్మ సత్యవతి, నాన్న లేటు నారయ్య. నాగపూర్లో ఇంజనీరింగ్ చదువుకొని, హైదరాబాదు లో…