ఎనభైయ్యవ పడిలో  బుర్రిపాలెం బుల్లోడు

ఎనభైయ్యవ పడిలో బుర్రిపాలెం బుల్లోడు

May 31, 2022

అతడొక అసాధ్యుడు. అసాధ్యుడే కాదు అఖండుడు కూడా. ఉంగరాలజుట్టుతో, ఊరించే కన్నులతో నూటొక్క జిల్లాలకి అందగాడు. హేమాహేమీలుగా వున్న ఎన్టీఆర్, ఏయన్నార్ లు తెలుగు చలనచిత్ర రంగాన్ని అప్రతిహతంగా ఏలుతున్న సమయంలో అడుగుపెట్టి, సాహసమే ఊపిరిగా, పట్టుదలే సోపానంగా, ఓటమే విజయానికి పునాదిగా నమ్మి అంచలంచలుగా సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన సుకుమారుడు, నటశేఖరుడు, పద్మవిభూషణుడు ఘట్టమనేని కృష్ణ….

తెలుగుసంస్కృతి తలఎత్తి నిలబడింది..

తెలుగుసంస్కృతి తలఎత్తి నిలబడింది..

May 30, 2022

అభిమానులకు.. తెలుగునేలకు.. విశ్వవ్యాప్తంగా వెలుగులీనుతున్న తెలుగుజాతికి..నందమూరి బాలకృష్ణ నమస్సుమాంజలి…. మా నాన్నగారు సినీరంగంలో అడుగుపెట్టారు.భారతీయ సినిమా తెలుగు సినిమాని తలఎత్తి చూసింది..తెలుగుదేశంపార్టీని స్థాపించారు.. తెలుగుసంస్కృతి తలఎత్తి నిలబడింది..ఆ నందమూరి తారక రామునికి ఈ నెల 28వ తేదీతో నూరవ ఏడు మొదలవుతుంది..ఆ రోజు నుంచి, 2023 మే 28 వరకు, 365 రోజులపాటు శతపురుషుని శత జయంతి వేడుకలు…

ఎన్టీఆర్ క్యారికేచర్ పోటీలో విజేతలు

ఎన్టీఆర్ క్యారికేచర్ పోటీలో విజేతలు

May 29, 2022

బాలకృష్ణ చేతుల మీదుగా విజేతల లిస్ట్ విడుదల స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శత జయంతిని పురస్కరించుకుని “నందమూరి తారక రామారావు – ఆయన వ్యక్తిత్వం” అనే అంశం పై కలయిక ఫౌండేషన్ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన క్యారికేచర్ మరియు కవితల పోటీ ఫలితాలను యువరత్న నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. క్యారికేచర్ విభాగంలో బెంగుళూర్(ఇండియా)కు చెందిన కె….

తెలుగుజాతి మనది… నిండుగ వెలుగు జాతి మనది

తెలుగుజాతి మనది… నిండుగ వెలుగు జాతి మనది

May 27, 2022

(ఎన్.టి. రామారావు శత జయంతి సందర్భంగా) ఈరోజు, అంటే మే నెల 28 న తెలుగుజాతి యుగపురుషుడు… తెలుగు వెండితెరకు తారకరాముడైన నందమూరి వంశోద్ధారకుని 99 వ జయంతి. నందమూరి తారక రామారావు జీవన ప్రస్థానం సంచలనమయం. ఆ ప్రస్థానానికి రెండు పార్స్వాలు. మొదటిది నటజీవితం కాగా రెండవది రాజకీయ ప్రస్థానం. రామారావు సినీరంగ ప్రవేశమే ఓ సంచలనం….

ఎన్టీఆర్ – భారతరత్న

ఎన్టీఆర్ – భారతరత్న

May 27, 2022

మే 28 ఎన్టీఆర్ పుట్టినరోజు. మహానటుడు, మహానేత ఉదయించిన గొప్ప రోజు. ఇది శత జయంతిలోకి అడుగుపెట్టిన సంవత్సరం. వచ్చే సంవత్సరం ఇదే సమయానికి ఆ మహనీయుడు పుట్టి వందేళ్లు పూర్తయ్యే గొప్ప సందర్భం.ఊరూవాడా ఉత్సవాలు చేసుకోవాల్సిన సమయం.ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు ‘మహానాడు’ నిర్వహించడం దాదాపుగా 40 ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీ పెట్టుకున్న ఆనవాయితీ. అది మాత్రం…

‘రావణ మరణం తర్వాత’ నాటకం

‘రావణ మరణం తర్వాత’ నాటకం

May 25, 2022

ప్రచారంలో లేని కధకు రచయిత మిస్రో నాటకీకరణ… హైదరాబాద్, రవీంద్రభారతిలో 24-05-22 న టిక్కెట్ పై నాటక ప్రదర్శన అనే ఉద్యమంగా నడుస్తున్న రస రంజని నాటక సంస్థ నిర్వహణలో బహురూప నట సమాఖ్య విశాఖ వారిచే ప్రదర్శితమైన ఈ నాటకం ప్రేక్షకులకు కొత్త కథను అందించారు. సోదరుడు విభీషణుడు శత్రు పక్షం రాముని కూటమిలో చేరి అన్న…

ఘనంగా తెలుగు కార్టూనిస్ట్ దినోత్సవం

ఘనంగా తెలుగు కార్టూనిస్ట్ దినోత్సవం

May 22, 2022

వెయ్యి అక్షరాలు చెప్పాల్సిన విషయాన్నీ ఒక్క కార్టూన్ ద్వారా చెప్పొచ్చని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. కే.వీ. రమణాచారి అన్నారు. శుక్రవారం (20 మే 2022) హైదరాబాద్, రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో సత్కళాభారతి, హాస్వానందం పత్రిక సంయుక్తంగా 2022 తెలుగు కార్టూనిస్ట్ దినోత్సవ సభ నిర్వహించారు. హాస్యానందం నిర్వహించిన కార్టూన్…

ప్రతినాయక ‘రాజ’నాల

ప్రతినాయక ‘రాజ’నాల

May 21, 2022

(విలన్ రాజనాల వర్ధంతి సందర్భంగా షణ్ముఖాచారి గారి వ్యాసం) (నీరాజనం: రాజనాల కాళేశ్వరరావును కావలిలో అందరూ ‘కల్లయ్య’ అని పిలిచేవారు. కావలి తంబళ్లగుంట వద్దగల జిల్లా బోర్డు స్కూల్ (నేటి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల)లో రాజనాల మా పెద్ద అన్నయ్యకు సహవిద్యార్థి. కావలి విశ్వోదయ ఓపన్ ఎయిర్ థియేటర్ లో పులిగండ్ల రామకృష్ణయ్య రచించిన‘తుపాను’ నాటక ప్రదర్శనలు…

విశాఖలో కార్టూన్ ప్రదర్శన-శిక్షణా శిబిరం

విశాఖలో కార్టూన్ ప్రదర్శన-శిక్షణా శిబిరం

May 19, 2022

(మూడు రోజులపాటు విశాఖలో పిల్లలకు కార్టూన్ శిక్షణా శిబిరం) బుధవారం(18-5-2022) నాడు విశాఖపట్నంలో బాల వికాస ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 16-5-2022 నుండి గత మూడు రోజులుగా జరుగుతున్న కార్టూన్ శిక్షణ శిబిరం జయప్రదంగా ముగిసినది. విశాఖపట్నం ఏ యస్ రాజా మహిళా జూనియర్ కళాశాల ప్రాంగణంలో 16-5-2022 నుంచి జరుగుతున్న ఉచిత సమ్మర్ కేంపులో భాగంగా తొలి…

జన హృదయాల్లో స్థానం చాలు!- పి. సుశీల

జన హృదయాల్లో స్థానం చాలు!- పి. సుశీల

May 19, 2022

(హైదరాబాద్, రవీంద్రభారతిలో పి.సుశీల గారికి వెండి కిరీటం పౌర సన్మానం) భారతదేశం గర్వించదగిన మేటి గాయనీ మణులు ముగ్గురే ముగ్గురు అని, వారిలో ఎం.ఎస్.సుబ్బులక్ష్మిగారికి, దీదీ లతా మంగేష్కర్ గారికి కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘భారత రత్న’ పురస్కారాలు లభించాయని, సుశీలమ్మకు వస్తే సంపూర్ణత చేకూరుతుంది, జనం హర్షిస్తారని నేను ప్రకటించగానే… కిక్కిరిసిన రవీంద్రభారతి ప్రేక్షకులు ఆమోదం తెలియచేస్తూ…