తెలుగింటి పిడుగు… ‘బుడుగు’ వెంకటరమణ

తెలుగింటి పిడుగు… ‘బుడుగు’ వెంకటరమణ

February 23, 2022

ఋణానుబంధ రూపేణా అంటారు పెద్దలు. సూర్యుడు ఉదయించే గోదావరికి తూర్పున వుండే రాజమహేంద్రవరం శివారు ధవళేశ్వరంలో జూన్ నెల 28, 1931 న ఆదిలక్ష్మి కడుపున తొలి మగ సంతానంగా పుట్టాడు ‘బుడుగు’. బుడుగు పుట్టిన రెండేళ్లకు గోదావరికి పశ్చిమాన వున్న నరసాపురంలో ఉదయించాడు బుడుగు కి బొమ్మలేసే బాపు. బుడుగు-బాపులు చెట్టపట్టలేసుకుని డెబ్బై ఏళ్ళకు పైగా నడిచారు……

సంస్కృతిని బతికించేది చిత్రకారులే…

సంస్కృతిని బతికించేది చిత్రకారులే…

February 22, 2022

మన సంస్కృతీ, సంప్రదాయాలను తమ చిత్రాలలో రేపటి తరాలకు అందించే ప్రముఖ చిత్రకారులను నిత్యం స్మరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వ్యవహారాల శాఖ డైరెక్టర్ వి. మల్లికార్జునరావు ఆకాంక్షించారు. మంగళవారం (22-02-2022) మధ్యాహ్నం ఆయన రాజమండ్రి, దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ రెండవ బ్లాక్ లో ఏర్పాటు చేసే చిత్రకారుల ప్రత్యేక విభాగాల ఏర్పాటును పరిశీలించారు. చిత్రాలను భధ్రపరిచేందుకు తీసుకుంటున్న…

అంకాల ఆర్ట్ అకాడెమీ- ఆర్ట్ గ్యాలరీ ఆవిష్కరణ

అంకాల ఆర్ట్ అకాడెమీ- ఆర్ట్ గ్యాలరీ ఆవిష్కరణ

February 22, 2022

(ఫిబ్రవరి 23న భీమవరంలో అంకాల ఆర్ట్ అకాడెమీ-నూతన భవనం ఆవిష్కరణ)తన నీటి రంగుల వర్ణ చిత్రాల ద్వారా దేశ-విదేశాలలో ప్రఖ్యాతి చెందిన చిత్రకారుడు అంకాల వెంకట సుబ్బారావు గారు వ్యవస్థాపక అధ్యక్షుడిగా 1964 సం.లో ఆవిర్భవించిన సంస్థ అంకాల ఆర్ట్ అకాడెమీ. అప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా, ప్రతీ సంవత్సరం చిత్రకళా పోటీలు నిర్వహిస్తూ ఎందరో ఔత్సాహిక…

మాధవపెద్ది సురేశ్ “హృదయాంజలి”

మాధవపెద్ది సురేశ్ “హృదయాంజలి”

February 22, 2022

మన విశిష్ట సభ్యులు, ప్రముఖ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేశ్ చంద్ర గారు ఫిబ్రవరి 26వ తేదీ (శనివారం) హృదయాంజలి పేరుతో హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీ, సత్యసాయి నిగమాగమం వేదికమీద ప్రముఖ గాయనీ గాయకులతో సంగీతకార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. మద్యాహ్నం 3.45 గంటలకు ఆరంభమయ్యే ఈ సంగీత కార్యక్రమం సాయంత్రం 7.00 గంటలకు ముగుస్తుంది. మల్లీశ్వరి, దేవదాసు, సువర్ణసుందరి,…

ఆకాశవాణి సేవలో కొండలరావు

ఆకాశవాణి సేవలో కొండలరావు

February 21, 2022

(ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా…) శ్రవణేంద్రియం ద్వారా మానవాళికి మానసికానందంతో పాటు విజ్ఞానంతో కూడిన సమాచారాన్నిఅందించడంలో ఆకాశవాణి సంస్థ ద్వారా అశరీరవాణిగా పిలువబడే ఉత్తమ ప్రసార సాధనమైన రేడియో పాత్ర అద్వితీయం పరోపకారం కోసమే అన్నట్లుగా, రేడియో, రేడియోలో నిరంతరం ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలతో పాటు వ్యవసాయ, వాణిజ్య, పశు సంబంధిత విద్య, వైద్య సాంస్కృతిక రంగ, దేశభక్తి…

సినీ మర్యాదరామన్న… పద్మనాభం

సినీ మర్యాదరామన్న… పద్మనాభం

February 21, 2022

ప్రతి మనిషి జీవితంలోను సుఖదుఃఖాలుంటాయి, మిట్టపల్లాలూ వుంటాయి. వెండితెరమీద నవ్వులు పంచిన వారందరి జీవితాలూ పువ్వుల బాటలు కానేరవు. అందుకు అతని జీవితం మినహాయింపు కాదు. అతడు ఓ అద్భుత హాస్యనటుడు, రంగస్థల నటుడు, గాయకుడు, సంగీత ప్రియుడు, రంగస్థల గాయకుడు, రచయిత, సినీ నిర్మాత, దర్శకుడు. ప్రముఖ సంగీత కళానిధి శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ను తెలుగు…

‘తానా’ నెల నెలా తెలుగు వెలుగు

‘తానా’ నెల నెలా తెలుగు వెలుగు

February 17, 2022

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నెల నెలా తెలుగు వెలుగు కార్యక్రమం ఫిబ్రవరి సోమవరం 21, 2022 న జరుగనుంది.ఈ అంతర్జాతీయ దృశ్య సమావేశానికి మిజోరాం రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు ముఖ్య అతిథిగా పాల్గొనననున్నారు.

ఇదీలోకం-హరి కార్టూన్లు

ఇదీలోకం-హరి కార్టూన్లు

February 17, 2022

తొమ్మిది దశాబ్దాల చరిత్ర గల తెలుగు కార్టూన్ రంగంలో పుస్తకరూపంలో వచ్చిన కార్టూన్ సంపుటాలు బహు తక్కువ. ఇప్పటి వరకు కార్టూన్లపై మూడు పుస్తకాలు ప్రచురించిన హరి నాలుగో పుస్తకం “ఇదీలోకం- హరి కార్టూన్లు”. సునిశిత పరిశీలనాశక్తితో సమకాలీన రాజకీయ, సామాజిక సమష్యలపై హరి గీసిన కార్టూన్లతో ప్రచురించిన పుస్తకం ఇది. సాహిత్యం ద్వారా, ఉద్యమాల ద్వారా ప్రభావితమై…

“జయహో భారతీయం” లోగో డిజైన్ పోటీ

“జయహో భారతీయం” లోగో డిజైన్ పోటీ

February 16, 2022

“జయహో భారతీయం” ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాహిత్య,క్రీడా, విద్యా,వైద్య, ఆరోగ్య, వ్యవసాయ, పర్యాటక, సేవా తదితర అంశాలకు సంబందించిన రంగాలలో ఈవెంట్స్ నిర్వహిస్తున్న సామాజిక సేవా సంస్థ. 2018 లో రిజిస్టర్ అయినప్పటికీ గత 10 ఏళ్లుగా జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది. వివిధ రంగాలకు చెందిన దాదాపు 150 కార్యక్రమాలు పైగా నిర్వహించిన ఘనత. ఈసంస్థ రిజిస్ట్రేషన్…

ప్రపంచాన్ని కవిత్వంలోంచే చూసిన కవి

ప్రపంచాన్ని కవిత్వంలోంచే చూసిన కవి

February 16, 2022

అరసవిల్లి కృష్ణ ఆర్బమైన కవి. కవిత్వం పుట్టుగడి తెలిసిన కవి. ఆయన ఈ ప్రపంచాన్ని కవిత్వంలోంచే చూస్తారు. కవిత్వంతోనే అర్థం చేసుకుంటారు. కవిత్వాన్ని వెంటేసుకొని ఈ సంక్షుభిత సమాజమంతటా తిరుగుతుంటారు. కవిత్వపు కంఠస్వరంతోనే మాట్లాడుతుంటారు. స్వప్నాలను, విలువలను, ఆశయాలను, విప్లవాలను ఆయన కవిత్వీకరించి సొంతం చేసుకుంటారు. సకల దుర్మార్గాలను, ప్రజా వ్యతిరేకతలను, దాస్టీకాలను, రాజ్యపు దౌర్జన్యాలను, సాంస్కృతిక హింసలను…