అరుదైనపుస్తకాలకు అతడొక చిరునామా!

అరుదైనపుస్తకాలకు అతడొక చిరునామా!

ప్రతి ఒక్కరి జీవితంలో పుస్తక నేస్తాలుండాలని గట్టిగా చెబుతాడాయన. దాదాపు అరవై ఏళ్ల నుంచి పుస్తకాలతోనే ఆయన సహవాసం. విజయవాడలోని లెనిన్‌ సెంటర్‌ అనగానే సాహిత్యాభిమానులకు గుర్తుకొచ్చే షాపు ‘ప్రాచీన గ్రంథమాల’. అందులోనే ఉంటారు అందరూ నాగేశ్వరరావు అని పిలిచే నర్రా జగన్మోహనరావు(67). ఆయన పుస్తకాలకు స్నేహితుడైతే, పుస్తకాలు ఆయనకు ప్రియమైన నేస్తాలు. జగన్మోహనరావు స్వగ్రామం గన్నవరం దగ్గర…

విలక్షణ చిత్రకారుడు డా. సాగర్ గిన్నె

విలక్షణ చిత్రకారుడు డా. సాగర్ గిన్నె

‘సాగర్ గిన్నె’ గా కళారంగానికి సుపరిచితులైన వీరి అసలు పేరు గిన్నె వెంకటేశ్వర్లు. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట గ్రామంలో 1965 అక్టోబర్ 2వ తేదిన గిన్నె రాములు, భీసమ్మ దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు సాగర్ గారు. వీరి బాల్యం పాఠశాల విద్య వారి స్వగ్రామం మూసాపేటలోనే జరిగింది. ఇంటర్ జిల్లా కేంద్రం మహబూబ్ నగర్ లో,…

ఇంటర్నెట్లో డబ్బు సంపాదించడం ఎలా?

ఇంటర్నెట్లో డబ్బు సంపాదించడం ఎలా?

ఇంటర్నెట్ ఆవిష్కరణతో అన్ని రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ప్రకటనా రంగం (అడ్వర్టైజింగ్)లో పెనుమార్పులు సంభవించాయి. తొంభయ్యవ దశకం వరకూ ప్రచారం కోసం ప్రింట్ మీడియా పై ఆధారపడేవారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా పవేశించింది. ప్రస్తుతం ఆ రెండు మీడియాలను అధిగమించింది సోషల్ మీడియా. స్మార్ట్ఫోన్ల వినియోగం పెరగడంతో 2006 సంవత్సరం నుండి ప్రచారానికి సోషల్…

నృసింహ పురాణం

నృసింహ పురాణం

కవిత్రయంలో చివరివాడైన ఎర్రన మహాకవి రచించిన నృసింహపురాణం ఓ అద్భుతమైన ప్రబంధం. బ్రహ్మాండ, విష్ణు పురాణాల్లో ఉన్న ప్రహ్లాదకథను తీసుకుని తనదైన రచనానైపుణ్యంతో విస్తరించి అందమైన ప్రబంధంగా తీర్చిదిద్దాడు ఎర్రన. ఈ ప్రబంధంలో కథ హిరణ్యకశిపుడి జననంతో ప్రారంభమై హిరణ్యకశిపుడి రాక్షస ప్రవర్తన, ప్రహ్లాదుడి జననం, విద్యాభ్యాసం, అతడి హరిభక్తి, నరసింహావతార ఆవిర్భావం, హిరణ్యకశిపుని వధ ప్రధానాంశాలుగా సాగుతూ…

‘నవోదయ రామ్మోహన్ రావు ‘ జ్ఞాపకాల దొంతరలు …

‘నవోదయ రామ్మోహన్ రావు ‘ జ్ఞాపకాల దొంతరలు …

పుస్తక ప్రేమికునికి అక్షర నైవేద్యం  … “పుస్తకం లేని ప్రపంచం రాబోతుందనేది వాస్తవం కాదు. పుస్తకం మరణం లేనిది, పుస్తకానికి ప్రత్యామ్నాయం లేదు ఉండబోదు.” ఇది ‘నవోదయ రామ్మోహన్ రావు ‘ గారు చెప్పిన మాటలు కాదు, నమ్మిన మాటలు. పుస్తకం అంటే ఆయనకు పిచ్చి ప్రేమ. పుస్తక ప్రచురణ అంటే ఆయనకు ఆరో ప్రాణం. పుస్తకం చదివే…

అందమైన చేతిరాత – భవిష్యత్తుకు బంగారుబాట

అందమైన చేతిరాత – భవిష్యత్తుకు బంగారుబాట

ప్రముఖ చిత్రకారుడు, కవి ఆత్మకూరు రామకృష్ణ గారు తెలుగులో చేతిరాతపై ప్రచురించిన పుస్తకం “హస్తలేఖనం ఓ కళ “ పిల్లల చదువుల విషయంలో తల్లిదండ్రులు మునుపటి కంటే ఇప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నారు. పోటీ అవనీయండి, పెరుగుతున్న సిలబస్‌ అవనీయండి పిల్లలతోపాటు తల్లిదండ్రులకూ పరీక్ష పెడుతున్నాయి. అందుకే పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రుల పాత్ర ఎలా వుండాలి? ఎంతవరకు…

కళా వైభవాన్ని చాటే నృత్య రూపకాలు

కళా వైభవాన్ని చాటే నృత్య రూపకాలు

ప్రముఖ చిత్రకారులు, దర్శకులు, కూచిపూడి నృత్య – రూపక రచయిత ‘బ్నిం ‘ బ్యాలేలు’ పేరుతో ఓ నృత్య రూపక సంకలనాన్ని వెలువరించి తమ కళాత్మక ప్రతిభను ప్రదర్శించారు. రెండు వందల యాభై పైనే – నృత్య రూపకాలు రచించిన ‘బ్నిం’ ఎక్కువశాతం పౌరాణిక కథలకే పెద్దపీట వేసినప్పటికీ.. సామాజిక అంశాలపై కూడా రాసి అందరి మన్ననలు పొందారు….

నా గొంతే తూపాకి తూట : మల్లు స్వరాజ్యం ఆత్మకథ

నా గొంతే తూపాకి తూట : మల్లు స్వరాజ్యం ఆత్మకథ

స్వాతంత్య్రోద్యమం యువతను ఉర్రూతూగిస్తున్న కాలానికి చెందిన మల్లు స్వరాజ్యం గొప్ప సాహస యోధురాలు. ఒక లెజెండ్‌, ఒక హీరో. ఆ కాంలో గుర్రం మీద ప్రయాణం చేసే ఆమెను చూసి జనం అభిమానంతో ఝాన్సీ రాణి అని పిలుచుకునేవారు. స్వరాజ్యం ఒక సంపన్న భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. పరదాల చాటున పెరిగారు. పరదాల చాటున్నే చదువు సంధ్యలు నేర్చుకున్నారు….

అనేకులుగా… మాకినీడి!

అనేకులుగా… మాకినీడి!

మస్తిష్క మూలాన్నుంచి మెరిసిన సన్న మెరుపు మహనీయుల నోటి చిన్న పలుకు బీజమై ఉద్గ్రంథాన్ని వ్రాయించదా!! … అటువంటిది ఆర్తిగా చదివించుకున్న ఓ ఉత్తమ కావ్యం చిన్న పుస్తకం వ్రాయించలేదా? కచ్చితంగా …! దీనికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ ‘అనేకులుగా… మాకినీడి!’ ‘అనేకులుగా…!’ అన్న శ్రీ మాకినీడి సూర్యభాస్కర్ గారి 53 కవితలను పొదుగుకున్న 17వ కవితాసంపుటిని (71వ…

ఆంధ్ర శిల్ప, చిత్రకళా శిఖరాలు

ఆంధ్ర శిల్ప, చిత్రకళా శిఖరాలు

తెలుగు చిత్రకళ హృదయావిష్కరణం తెలుగు చిత్రకళ అనగానే దామర్ల రామారావు గారి పేరు తొలుతగా స్పురణకు వస్తుంది. ఆధునికాంధ్ర చిత్రకళకు పితామహుడాయన. ఆయన శిష్యప్రశిష్యులైన యువచిత్రకారులు ఆయనలా చిత్రించాలని ఉవ్విళ్లూరే వారంటారు. అదొక కళా చైతన్యం. ఆధునిక తెలుగు సాహిత్యం, ఆధునిక తెలుగు చిత్రకళ ఇంచుమించు ఒకే సమయంలో మొదలయ్యాయి. రెండింటి పైన అధివాస్తవిక ధోరణుల ప్రభావం సమానంగానే…