కళా వైభవాన్ని చాటే నృత్య రూపకాలు

కళా వైభవాన్ని చాటే నృత్య రూపకాలు

June 18, 2020

ప్రముఖ చిత్రకారులు, దర్శకులు, కూచిపూడి నృత్య – రూపక రచయిత ‘బ్నిం ‘ బ్యాలేలు’ పేరుతో ఓ నృత్య రూపక సంకలనాన్ని వెలువరించి తమ కళాత్మక ప్రతిభను ప్రదర్శించారు. రెండు వందల యాభై పైనే – నృత్య రూపకాలు రచించిన ‘బ్నిం’ ఎక్కువశాతం పౌరాణిక కథలకే పెద్దపీట వేసినప్పటికీ.. సామాజిక అంశాలపై కూడా రాసి అందరి మన్ననలు పొందారు….

నా గొంతే తూపాకి తూట : మల్లు స్వరాజ్యం ఆత్మకథ

నా గొంతే తూపాకి తూట : మల్లు స్వరాజ్యం ఆత్మకథ

June 3, 2020

స్వాతంత్య్రోద్యమం యువతను ఉర్రూతూగిస్తున్న కాలానికి చెందిన మల్లు స్వరాజ్యం గొప్ప సాహస యోధురాలు. ఒక లెజెండ్‌, ఒక హీరో. ఆ కాంలో గుర్రం మీద ప్రయాణం చేసే ఆమెను చూసి జనం అభిమానంతో ఝాన్సీ రాణి అని పిలుచుకునేవారు. స్వరాజ్యం ఒక సంపన్న భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. పరదాల చాటున పెరిగారు. పరదాల చాటున్నే చదువు సంధ్యలు నేర్చుకున్నారు….

అనేకులుగా… మాకినీడి!

అనేకులుగా… మాకినీడి!

May 16, 2020

మస్తిష్క మూలాన్నుంచి మెరిసిన సన్న మెరుపు మహనీయుల నోటి చిన్న పలుకు బీజమై ఉద్గ్రంథాన్ని వ్రాయించదా!! … అటువంటిది ఆర్తిగా చదివించుకున్న ఓ ఉత్తమ కావ్యం చిన్న పుస్తకం వ్రాయించలేదా? కచ్చితంగా …! దీనికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ ‘అనేకులుగా… మాకినీడి!’ ‘అనేకులుగా…!’ అన్న శ్రీ మాకినీడి సూర్యభాస్కర్ గారి 53 కవితలను పొదుగుకున్న 17వ కవితాసంపుటిని (71వ…

ఆంధ్ర శిల్ప, చిత్రకళా శిఖరాలు

ఆంధ్ర శిల్ప, చిత్రకళా శిఖరాలు

May 9, 2020

తెలుగు చిత్రకళ హృదయావిష్కరణం తెలుగు చిత్రకళ అనగానే దామర్ల రామారావు గారి పేరు తొలుతగా స్పురణకు వస్తుంది. ఆధునికాంధ్ర చిత్రకళకు పితామహుడాయన. ఆయన శిష్యప్రశిష్యులైన యువచిత్రకారులు ఆయనలా చిత్రించాలని ఉవ్విళ్లూరే వారంటారు. అదొక కళా చైతన్యం. ఆధునిక తెలుగు సాహిత్యం, ఆధునిక తెలుగు చిత్రకళ ఇంచుమించు ఒకే సమయంలో మొదలయ్యాయి. రెండింటి పైన అధివాస్తవిక ధోరణుల ప్రభావం సమానంగానే…

గోఖలే గారితో చిత్రానుబంధం- కళాధర్

గోఖలే గారితో చిత్రానుబంధం- కళాధర్

May 6, 2020

పాతాళ భైరవి, గుండమ్మకథ లాంటి సినీమాలకు కళాదర్శకుడిగా పనిచేసిన కళాధర్ గారు వారి అనుభవాలను గ్రంథస్తం చేసారు. తెలుగు సినీమా కళాదర్శకత్వానికి సంభంధించిన వివరాలతో వచ్చిన మొదటి పుస్తకం ‘సినిమా కళలో కళాధర్ ‘ . ఇందులో వారు కళా దర్శకులు మాధవపెద్ది గోఖలే గారితో వారి ఆనుభవాలను రాసుకున్నారు… మీ కోసం… గోఖలేగా పాపులర్ అయిన వారి…

దోసిట చినుకులు …

దోసిట చినుకులు …

April 24, 2020

నాకు సినిమాలంటే విపరీతమయిన ఇష్టం. సండూరు, బళ్లారి, దౌండ్, పునే, బెంగుళూరు- ఇలా నేను తిరిగిన, బ్రతికిన ఊళ్లలోని సినిమా థియేటర్లు కరుణించిన వివేకం , జ్ఞానాన్ని నేను నేటికీ స్మరిస్తాను. నిజం చెప్పాలంటే నేను బలవంతంగా చదివిన టెక్స్ట్ పుస్తకాల కంటే ఎక్కువ నన్ను రూపుదిద్దింది గొప్ప ప్రపంచ సినిమాలే. దేశం గర్వించదగ్గ గొప్ప నటుడు ప్రకాష్…

నగర దిష్టి (కథా సంపుటి)

నగర దిష్టి (కథా సంపుటి)

April 19, 2020

ప్రముఖ బాలల కథా రచయిత, ఉత్తమ ఉపాధ్యాయుడు అయిన మద్దిరాల శ్రీనివాసులు గారి కలం నుండి వెలువడిన బాలల కథా సంపుటి “నగర దిష్టి. ఇందులో బాలలలో విద్యపట్ల ఆసక్తి,ఉన్నత విలువలు, సాంకేతక దృక్పధం ఏర్పడేలా రచించిన 12 కథలు వున్నాయి, తెలివైన వాడైనప్పటికీ బద్దకంతో క్లాసునందలి మార్కులు పోగొట్టుకుంటున్న విజయ్ అనే విద్యార్థిలో దేవుడి మీద వాడికి…

మనిషి నాభాష

మనిషి నాభాష

April 5, 2020

ఒక ఐ.పి.ఎస్. ఆఫీసర్ అంతరంగం … తాను చూసింది, తాననుభవించింది, తానుకలగన్నదీ, కవికి మాత్రుకయితే ఆ మాత్రుక నుండి పుట్టిందే కవిత్వం. గతంలో చూచి, వర్తమానంలో అనుభవించి, భవిష్యత్తును ఆశించడం కవికే సొంతం. నేను, నువ్వు రెండుగా వున్నాయి. నేనూ, నువ్వూ ఒక్కటైతే అది బ్రహ్మ పదార్థం. ఒకటి లౌకికం, రెండోది అలౌకికం. రెండూ ఒకటే అయితే అహం…

శ్యామంతికలు యీ గజళ్లు

శ్యామంతికలు యీ గజళ్లు

April 3, 2020

ఉర్దూ కవితా సాహిత్యంలో అత్యంత ప్రముఖ సాహితీ ప్రక్రియ గజల్. 10 వ శతాబ్దంలో ఇరాన్ లో ఆవిర్భవించి భారతదేశానికి దిగుమతి అయిందని చెబుతారు. సాధారణంగా స్త్రీ సౌందర్యాన్ని వర్ణించడానికి, ప్రణయ, భగ్నప్రణయ భావాలను ఆవిష్కరించటానికి గజల్ ను వాడేవారు. మన సినారె, దాశరథి గారు తెలుగులోకి ఇంచుమించు గజల్ సంప్రదాయాన్ని వాళ్ల కవితా రూపాల్లో పరిచయం చేశారు….

వెంటాడే స్మృతులు… సోల్ సర్కస్

వెంటాడే స్మృతులు… సోల్ సర్కస్

March 29, 2020

యువ కథకులలో ఇటీవల గుర్తింపు పొందిన కథకుడు వెంకట్ సిద్దారెడ్డి. రాయడం నా దైనందిన చర్యలో ఒక భాగం అంటూ …  సినిమా రంగంలో కథకుడిగా, దర్శకుడిగా తన స్థానాన్ని వెతుక్కునే పనిలో వున్నారు. వెంకట్ సిద్దారెడ్డి కలం నుండి వెలువడిన సరి కొత్త రచన ఈ ‘సోల్ సర్కస్ ‘ పుస్తకం. మనుషుల మధ్య అడ్డుగీతలు ఇంకా…