మహాచిత్రకారుడు నేర్పిన ‘జీవిత’పాఠం

మహాచిత్రకారుడు నేర్పిన ‘జీవిత’పాఠం

చందమామ చిత్రకారుడు శంకర్ గారితో బాలల పత్రికారంగ చిత్రకారుడు దేవీప్రసాద్ గారి జ్ఞాపకాలు ….అది 1976వ సంవత్సరం… చెన్నై మహానగరంలో చిత్రకారుడిగా బ్రతికేందుకు వెళ్ళి, బాలల పత్రిక బుజ్జాయిలో ఆరంభించిన ప్రయాణం, వసంతబాల, బాలమిత్ర, బాలభారతి వంటి ఆనాటి ప్రముఖ బాలల పత్రికలలో కథాచిత్రకారుడిగా జీవితం సాగుతున్న సమయం. చిత్రకారుడిగా జీవితం మలుచుకోవాలనే అభిప్రాయానికి చిన్ననాటనే బీజం వేసిన…

‘చందమామ’ బొమ్మల తాతయ్య కన్నుమూత

‘చందమామ’ బొమ్మల తాతయ్య కన్నుమూత

చందమామ…..ఈ పేరు వినగానే ఎవరికైనా ఎంతో చల్లగా హాయిగా అనిపిస్తుంది. ఒకప్పటి మన బాల్యం గుర్తుకొచ్చి….ఆపైన ‘చందమామ’ కథల పుస్తకం గుర్తొచ్చి….మనసునల్లరల్లరి చేస్తుంది. అందులో రంగురంగుల బొమ్మలు మైమరపిస్తూ ఊహాలోకాల్లో విహరింప చేస్తుంది…చందమామ పత్రిక ద్వారా ఆబాలగోపాలాన్ని అలరించిన చిత్రకారులు శంకర్ గారు మంగళవారం(29-9-20) మధ్యాహ్నం ఒంటి గంట వేళ కన్నుమూశారు. వారి వయసు 97 ఏళ్లు. చెన్నైలోని…

సురపతి సన్నిధానానికేగిన శ్రీపతి…

సురపతి సన్నిధానానికేగిన శ్రీపతి…

వేల పాటలతో కోట్లాది మంది సంగీత ప్రియుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయిన ఎస్పీ బాలసుబ్రమణ్యం గత 40 రోజులుగా మృత్యువుతో పోరాడుతూ నేటి (25-9-20) మధ్యాన్నం 1.04 ని.లకు కన్నుమూసారు. ఆయన మరణంతో కోట్లాదిమంది బాలు ఫాన్స్ ముఖంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంగీత ప్రపంచం ఒక్కసారిగా మూగబోయింది. తెలుగు సినిమా చరిత్రలో మరిచిపోలేని పేరు ఎస్పీ (శ్రీపతి…

నిబద్ధత లో నిలువెత్తు తాడి చెట్టు…

నిబద్ధత లో నిలువెత్తు తాడి చెట్టు…

సెప్టెంబర్ 21 మోహన్ తృతీయ వర్థంతి సందర్భంగా….. A TRIBUTE TO ARTIST MOHAN హృదయంలో ప్యూరిటీ – ఆలోచనల్లో క్లారిటీ – ఈ రెండూ కలిస్తే ఆర్టిస్ట్ మోహన్ అవుతారు. తనలో మైనస్ పాయింట్ ఏమిటంటే ఎవరైనా సరే చదువుకోవాల్సిందే అంటాడు. డబ్బు సంపాదించమని, మేడలు కట్టుకోమనీ, విజయానికి కేవలం 555 మెట్లేననీ చెబితే బాగుంటుందిగానీ… దరిద్రంగా…

బహుముఖ నటన – ‘సురభి ‘ జమున

బహుముఖ నటన – ‘సురభి ‘ జమున

ప్రముఖ రంగస్థల సీనియర్‌ నటి సురభి జమునా రాయలు (60) కరోనాతో బుధవారం (12-8-20) రాత్రి కన్నుమూశారు. హైదరాబాద్ ,శేరిలింగంపల్లి, సురభి కాలనీలో ఆమె నివాసం. పది రోజుల క్రితం కరోనా సోకడంతో గచ్చిబౌలి టిమ్స్‌లో చేర్చారు. అక్కడ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. జననం: జమునా రాయలు 1960, జనవరి 22న వనారస…

సంప్రదాయ చిత్రకారులు వెల్లటూరి పూర్ణానంద శర్మ

సంప్రదాయ చిత్రకారులు వెల్లటూరి పూర్ణానంద శర్మ

కళ కోసం కాదు. కళ కాసు కోసం కాదు. కళ సమాజం కోసం అని కృషిచేసిన గ్రామీణ చిత్రకారులు శ్రీ వెల్లటూరి. తెలుగు చిత్రకళా రంగంలో నాలుగు దశాబ్దాలుగా నిర్విరామకృషి చేసిన వీరి కళాప్రతిభ ఆంధ్రులకు తెలియనిది కాదు. వీరు గుంటూరు జిల్లా వెల్లటూరులో 1934 నవంబరు 1 న జన్మించారు. చిన్నతనం నుండి చిత్రకళపై ఆశక్తి మెండుగా…

అమరుడైన సమర గాయకుడు – వంగపండు

అమరుడైన సమర గాయకుడు – వంగపండు

పాట కాదు ప్రజల గుండె చప్పడు ఆయన… ఆయన పాటే విప్లవం… జనాట్యమండలి వ్యవస్థాపకుడు… ఉత్తరాంధ్ర జానపదాలకు గజ్జెకట్టి ఆడిపాడిన వంగపండు ప్రసాదరావు (77) గళం మూగబోయింది. గత కొంతకాలంగా అనారోగ్యంతోబాధపడుతున్న ఆయన విజయనగరం జిల్లా పార్వతీపురంలోని పెదబొందపల్లిలో తన నివాసంలో గుండెపోటుతో  ఆగస్ట్ 4న తన నివాసంలో కన్నుమూశారు. వంగపండు ‘అర్ధరాత్రి స్వాతంత్ర్యం’ సినిమాతో సినీప్రస్థానం ప్రారంభించారు….

‘అస్తమించిన ‘ రంగస్థల ఉదయ భాస్కరుడు

‘అస్తమించిన ‘ రంగస్థల ఉదయ భాస్కరుడు

తెలుగు సాంఘిక నాటకరంగం లో నాలుగు దశాబ్దాలుగా విశేషమైన కృషిసల్పిన నటుడు బొట్టా ఉదయ్ భాస్కర్ జూలై 27 న సోమవారం, ఉదయం విజయవాడలో గుండెపోటుతో కన్నుమూసారు.   పౌరాణిక నాటక రంగంలో కృష్ణుడు పాత్రధారిగా పేరొంది, నటుడిగా రాణించిన కీ.శే. సుబ్రమణ్య యాదవ్ గారి కుమారుడు బొట్టా ఉదయ్ భాస్కర్ విజయవాడలో నవంబర్ 8, 1954లో జన్మించారు. చిన్నతనం…

“శంకర్ ” పెన్సిల్ కు విశ్రాంతి …

“శంకర్ ” పెన్సిల్ కు విశ్రాంతి …

బాపు గారి సోదరులుగానే కాక, పెన్సిల్ పొర్ట్రైట్స్ చిత్రకారునిగా విఖ్యాతి చెందిన శంకర్ (సత్తిరాజు శంకర నారాయణ) గారు నుమోనియాతో వ్యాధితో ఈ రోజు (09-07-2020) కన్నుమూసారు. వారు ప్రచురించబోయే కొత్త పుస్తకానికి సంబంధించిన సమాచారం కోసం గత మే నెల 26 తేదీన నాతో చివరి సారిగా మాట్లాడారు. ఎవ్వరినీ నొప్పించక, చిరుదరహాసంతో కూడిన పలకరింపు ఇక…

చిత్రకళా విభూషణుడు!

చిత్రకళా విభూషణుడు!

రంగుల ప్రపంచంలో సతీశ్ గుజ్రాల్ కుంచెకు ప్రత్యేక స్థానం ఉంది. ఈయన వయోసంబంధ సమస్యలతో గురువారం (26-3-20) రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. సతీశ్‌ కు భార్య కిరణ్‌, కుమార్తెలు అల్పన, రసీల్‌, కుమారుడు మోహిత్‌ ఉన్నారు. భారత మాజీ ప్రధాని (ఐకే గుజ్రాల్) సోదరుడిగా కాకుండా, ఒక చిత్రకారుడిగా, శిల్పిగా, మ్యూరలిస్ట్ గా…