ఉద్యమ పాట మూగవోయింది

ఉద్యమ పాట మూగవోయింది

July 30, 2023

ఎప్పుడొచ్చినా ఆ నవ్వు చెదిరేది కాదు. విద్యార్థి నాయకుడిగా, కమ్యూనిస్ట్ నేతగా, ఉద్యమకారుడిగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా… ఇన్ని దశల్లో చూసిన వేద సాయిచంద్ (39) లో ఎప్పుడూ నవ్వు చెదరలేదు. నన్ను కలసిన రోజే ఇతనికి మంచి భవిష్యత్ ఉందని చెప్పాను. నేను కల్చరల్ కౌన్సిల్ లో పని చేస్తున్నప్పుడు కలిశాడు…

నేడు ‘చందమామ’ శంకర్ శత జయంతి

నేడు ‘చందమామ’ శంకర్ శత జయంతి

July 19, 2023

చందమామ…..ఈ పేరు వినగానే ఎవరికైనా ఎంతో చల్లగా హాయిగా అనిపిస్తుంది. ఒకప్పటి మన బాల్యం గుర్తుకొచ్చి….ఆపైన ‘చందమామ’ కథల పుస్తకం గుర్తొచ్చి….మనసునల్లరల్లరి చేస్తుంది. అందులో రంగురంగుల బొమ్మలు మైమరపిస్తూ ఊహాలోకాల్లో విహరింప చేస్తుంది… చందమామ బాలల మాసపత్రికలో కథలు ఎంత బాగుండేవో, బొమ్మలు కూడా అంతే బాగుండేవి. ఆ బొమ్మలను చూసే కథల్లోకి వెళ్లే వాళ్లంటే అతిశయోక్తి కాదు….

అంతర్జాతీయ శిల్పి అక్కల మంగయ్య

అంతర్జాతీయ శిల్పి అక్కల మంగయ్య

July 4, 2023

తెనాలికి చెందిన అంతర్జాతీయ శిల్పి అక్కల మంగయ్య (83) శుక్రవారం (02-07-2021) రాత్రి 9.30 గంటలకు తెనాలిలోని వారి స్వగృహంలో కన్నుమూసారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అక్కల మంగయ్య గారి అంత్యక్రియలు శనివారం ఉదయం 11 గంటలకు చినరావూరు శ్మశాన వాటికలో జరిగాయని కుటుంబసభ్యులు తెలియజేసారు. అక్కల మంగయ్య…

శరత్ బాబు జీవితంలో చివరకు మిగిలింది…?

శరత్ బాబు జీవితంలో చివరకు మిగిలింది…?

July 3, 2023

ఆ హాస్యనటికి శరత్ బాబు నచ్చాడు. 1974 నాటికి సహజీవనం అనే పదం ప్రచారంలో లేదు. కాని ఆ సమయంలోనే వారు జంటగా 14 ఏళ్ళు పెళ్ళిలేని కాపురం చేశారు. పిల్లలు కలిగితే వారి జీవితం ఎలా ఉండేదో. పిల్లలు వద్దనుకున్న ఆ జంట నిర్ణయం, ఇతర కారణాలు వారిని దూరం చేశాయి. కొందరి జీవితాలు చిత్రంగా సాగుతాయి….

మూగబోయిన తెలంగానం – సాయిచంద్

మూగబోయిన తెలంగానం – సాయిచంద్

June 30, 2023

ప్రజాయుద్ధ సంగీతం, నెత్తుటి చాళ్ళలో విత్తనమై మొలకెత్తిన పాటల వనం, అట్టడుగు ప్రజల కోసం గళమెత్తిన ప్రజా గాయకుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ వి. సాయిచంద్ జూన్ 29 న గుండెపోటుతో మరణించడం తెలంగాణ కళా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎంతో భవిష్యత్ ఉన్న ప్రజా నాయకుడు, పాట కవి ఇలా అకాల మృత్యువును పొందడం…

బతుకుతో నాట్యమాడిన రాకేష్ మాస్టర్

బతుకుతో నాట్యమాడిన రాకేష్ మాస్టర్

June 25, 2023

సినిమా నృత్య దర్శకులు రాకేష్ మాస్టర్ ఆకస్మిక మరణం ఒక్కసారిగా ఆయన జీవన వైవిధ్యాల పై, వివాదాలపై తెర లేపింది. జూన్ 18న ఆరోగ్యం క్షీణించి హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. మధుమేహవ్యాధి తీవ్రమై శరీర అంతర్గత భాగాలు వైఫల్యం చెందడంతో చనిపోయారని వైద్యులు తెలిపారు. కుటుంబంలో పుట్టిన ఆయన బాల్యం నుండే డ్యాన్స్కు…

అక్షర చిత్రకళా ప్రేమికుడు – శీలావీ

అక్షర చిత్రకళా ప్రేమికుడు – శీలావీ

June 1, 2023

(జూన్ 1న శీలా వీర్రాజు గారి ప్రథమ వర్థంతి సందర్భంగా…) బహుముఖ ప్రజ్ఞాశాలురు అరుదుగా ఉంటారు. అటువంటివారిలో శీలా వీర్రాజు ఒకరు. ఆయన చిత్రకళ, సాహిత్యం రంగాలలో అద్భుతంగా రాణించారు. ఓ పత్రికలో సబ్- ఎడిటర్ కమ్ ఆర్టిస్ట్ గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన 1963 లో రాష్ట్రప్రభుత్వ సమాచార పౌర సంబంధాల శాఖలో అనువాదకుడుగా చేరారు….

‘నాగరాజు గంధం’ నాటకం నుండి సినిమా వరకూ

‘నాగరాజు గంధం’ నాటకం నుండి సినిమా వరకూ

May 31, 2023

నాగరాజు గంధం గారి జీవితం ఒక గొప్ప గ్రంథం. బతికింది తక్కువ కాలమే అయినా, సాహిత్యంలో శాశ్వత ముద్ర వేసి వెళ్ళిపోయాడు. గమ్యం, బాణం, గాయం – 2 లాంటి సినిమాలకు సంభాషణలు అందించిన రచయిత. చదువు, శేషార్ధం, ఓ క్రైం కథ లాంటి నాటికలు రాసిన గొప్ప రచయిత. నాగరాజు సాహిత్య విశిష్టతను గస్మరించుకుంటూ మిత్ర క్రియేషన్స్,…

తెలుగు కథకు పెద్దదిక్కు కేతు విశ్వనాథ రెడ్డి

తెలుగు కథకు పెద్దదిక్కు కేతు విశ్వనాథ రెడ్డి

May 31, 2023

కేతు విశ్వనాథ రెడ్డిగారు (22-05-23) భౌతికంగా మన నుంచి దూరమయ్యారు. ఒక ఆకు రాలినట్టు తన స్థానానికి సంబంధించిన స్పష్టమైన గుర్తును వదిలిపెడుతూ చప్పుడు చేయకుండా ప్రశాంతంగా వెళ్లిపోయాడు. ఎన్నో చిగురుటాకులకు మార్గదర్శకంగా నిలిచినవాడు, ఒక సంక్లిష్టమైన ప్రాంతీయతను సాహిత్యం చేసినవాడు నిశ్శబ్దంగా నిష్క్రమించాడు. కరువులు తాండవించే నేలల మీదుగా, కక్షల సుడిగాలులు చెలరేగే గ్రామాల వీధుల మీదుగా…

తెలుగింటి ‘బాలి’ బొమ్మ‌

తెలుగింటి ‘బాలి’ బొమ్మ‌

April 19, 2023

(బెందాళం క్రిష్ణారావు గారు 29-4-2018 న ప్రజాశక్తి దినపత్రికలో చేసిన ఇంటర్ వ్యూ) బాలి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దాదాపు ఐదు దశాబ్దాలుగా అవిశ్రాంత చిత్రకారుడాయన. దేశవిదేశాల్లోని తెలుగువాళ్లందరికీ, గీతల్ని, రాతల్ని ప్రేమించేవారందరికీ ఇష్టమైన పేరది. లక్షల చిత్రాలు గీసిన లక్షణమైన చిత్రకారునిగా, కార్టూనిస్టుగా, కథారచయితగా తన జీవితాన్నే చిత్రంగా మలచుకుని పయనం సాగిస్తున్న కళాకారుడు…