అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి – అన్నపూర్ణ

అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి – అన్నపూర్ణ

On

శ్రీమతి ఏలూరిపాటి అన్నపూర్ణ గారు, నివాసం కళ్యాణ్ నగర్, వెంగళరావు నగర్ దగ్గర, హైదరాబాద్. చదువుపరంగా బి.యస్.సి., సి.ఎఫ్.యన్., డి.ఎఫ్.ఎ., చదివారు. గృహిణిగా వుంటూనే చిత్ర కళాకారిణిగా రాణిస్తూ, గుర్తింపు పొందారు. చిన్నప్పటి నుండి అంటే ఉహ తెలిసిన, పదేళ్ల వయసు నుండి బొమ్మలు గీస్తున్నారు. వాటర్ కలర్స్, ఆయిల్, ఎక్రిలిక్ వంటి అన్నిరకాల రంగులను ఉపయోగించి చిత్రాలు…

జాతీయ స్థాయిలో గుర్తింపు కావాలి – నివేదిత

జాతీయ స్థాయిలో గుర్తింపు కావాలి – నివేదిత

On

శ్రీమతి నివేదిత కిడాంబి  గారు, ఇక్రిశాట్ కాలనీ, చందానగర్, హైదరాబాద్. నివేదిత గారు నాల్గో తరగతి చదువుతున్న వయసు నుండి తెల్ల పేపర్ కనిపిస్తే చాలు పెన్సిల్ తోనో, పెన్నులతోనో బొమ్మలు వేయడం అలవాటుగా మారింది. ఈమె తండ్రి కూడా ఆర్టిస్టుగా చేస్తుంటారు. తండ్రిని ఆదర్శంగా తీసుకొని, చిత్రకళపై ఆసక్తిని పెంచుకుంది. ఇంటర్ లో చేరిన తర్వాత ఆర్ట్…

కళను ఒక తపస్సులా భావించాలి – కృష్ణ సుబ్బారావు

కళను ఒక తపస్సులా భావించాలి – కృష్ణ సుబ్బారావు

On

శ్రీ టి.వి.కృష్ణ సుబ్బారావు (53) గారు, నివాసం శ్రీరామ్ నగర్, నల్లపాడు రోడ్, గుంటూరు. వీరు ఉద్యోగరీత్యా మెడికల్ కాలేజ్ లో మోడలర్ గా చేస్తూ, వైద్య విద్యార్ధులకు నమూనా అవయవాలను చేసి అందిస్తారు. ప్రవృత్తి పరంగా చిత్ర, శిల్పకళను ఎంచుకున్నారు. సుబ్బారావు గారు ఆంధ్ర ప్రదేశ్ నుండి డ్రాయింగ్ లోయ్యర్, హైయ్యర్., తమిళనాడు ప్రభుత్వం నుండి కూడా…

మంచి చిత్రకారిణి కావాలన్నదే నా ఆశయం – రేష్మ

మంచి చిత్రకారిణి కావాలన్నదే నా ఆశయం – రేష్మ

On

శ్రీమతి రేష్మ జెల్లీ  గారు, భవానీపురం, విజయవాడ. గృహిణి, అయితేనేమి మంచి చిత్రకారిణి. చిన్నప్పటి నుండి నుండి బొమ్మలు అంటే ఇష్టం. సమాజానికి కళాకారిణిగానే పరిచయమవ్వాలి. కళాకారిణిగానే రాణించాలనే సంకల్పంతో మహిళలు అరుదుగా రాణించే చిత్రకళారంగంలో అడుగిడి కాన్వాస్ పై తన ఊహలకు చిత్ర రూపం కల్పిస్తున్నారు రేష్మ. బ్యాచలర్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్., మాస్టర్ ఆఫ్ బిజినెస్…

వ్యర్థాలకు జీవం పోస్తున్న శిల్పి   

వ్యర్థాలకు జీవం పోస్తున్న శిల్పి   

On

శ్రీ కాటూరి రవి చంద్ర (31) గారు, కోకావారి స్ట్రీట్, నాజర్ పేట, తెనాలి. కాటూరి వెంకటేశ్వరరావు గారి కుమారుడు. గత మూడు దశాబ్దాలుగా “సూర్య విగ్రహశాల” శిల్పకళలో ఏడో తరానికి చెందినవారు. తొలిగా బుద్ధుని జీవితచరిత్రపై ఎనిమిది పేయింటింగ్స్ వేసి, వాటిని కాలచక్ర-2006 లో ప్రదర్శించారు. దీనితో మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ‘పద్మభూషణ్’ కే.ఎల్. రావ్ వంటి ప్రముఖుల…

కళలు మానసిక వికాసం కలిగిస్తాయి-జయశేఖర్

కళలు మానసిక వికాసం కలిగిస్తాయి-జయశేఖర్

On

శ్రీ నక్కల జయశేఖర్ రాజు (42) గారు, పిల్లిజాన్ వీధి, ఐతానగర్, తెనాలి. వీరు వృత్తి, ప్రవృత్తి చిత్రలేఖనం. చిన్నతనం నుండి డ్రాయింగ్-పేయింటి అంటే ఇష్టం. ఆ ఇష్టంతో పాఠశాల స్థాయిలోనే ఎన్నో బహుమతులు తెచ్చుకున్నారు. తల్లిదండ్రులు మొదట్లో వ్యతిరేకించినా, తర్వాత ప్రోత్సహించారు. ఆ తర్వాత డ్రాయింగ్ లోయ్యర్, హైయ్యర్ (చెన్నై) లో పూర్తి చేసారు. సోదరుడు, మరియు…

కృషితో ఉన్నతస్థాయిని సాధించవచ్చు – శిల్పి కాటూరి

కృషితో ఉన్నతస్థాయిని సాధించవచ్చు – శిల్పి కాటూరి

On

కాటూరి వెంకటేశ్వర రావు (58) గారు, కోకావారి స్ట్రీట్, నాజర్ పేట, తెనాలి. వీరి గురించి తెలుసుకునే ముందు…. అనాది కాలము నుండి మానవుడు తన జీవితమును సౌఖ్యానందం కోసం అనేక కృత్యములు ఆచరించేవారు. వీటిలో ఉపయోగదృష్ఠతో కొన్నయితే, సౌందర్య దృష్ఠితో మరికొన్ని. ప్రతిభా నైపుణ్యం కలిగినవి కళలుగా పేర్కొంటూ, వర్గీకరించి 64 కళలుగాను, అందులో లలితకళలను ప్రత్యేకంగా…

ఏ రంగంలోనయినా కష్టాలుంటాయి – దుర్గారావు

ఏ రంగంలోనయినా కష్టాలుంటాయి – దుర్గారావు

On

పద్మశాలీ దుర్గారావు (43) గారు, నివాసం కళ్యాణపురి, ఉప్పల్, హైదరాబాద్. వృత్తి పరంగా ప్రభుత్వ ఉద్యోగి. NGRI లో ల్యాబ్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. అయితేనేమి ప్రవృత్తి పరంగా కళాకారుడు. ఆర్టిస్టుగా ఎదగటానికి ఎన్నో కష్టాలతో, నష్టాలతో, ఇష్టంగా, గుర్తింపుతో ఎదిగానని చెప్పారు దుర్గారావు. చదువుకునే రోజులలో అంటే చిన్నప్పటి నుండి పేయింటింగ్స్ అంటే చాలా ఇష్టం….

ఫేస్ బుక్ లో లైక్ లు చూసుకొంటే సరిపోదు – చిన్న శ్రీపతి

ఫేస్ బుక్ లో లైక్ లు చూసుకొంటే సరిపోదు – చిన్న శ్రీపతి

On

శ్రీ చిన్న శ్రీపతి (48) గారు, నివాసం శ్రీనగర్ కాలనీ, అమీర్ పేట, హైదరాబాద్. వృత్తి-ప్రవృత్తి “చిత్రకళ”. కళ లోనే సర్వస్వం. తంజావూర్, కాన్వాస్ పేయింటింగ్స్, పెన్సిల్ మొదలగు మాద్యమాలతో సంపూర్ణంగా చిత్రించగల పనిమంతుడు. కళలో పట్టు, పరిపూర్ణత్వం కలిగిన కళాకారుడు. కేవలం పెన్సిల్ తోనే అద్భుత కళాఖండాలను తయారు చెయ్యవచ్చుంటున్నారు శ్రీపతి గారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో…

రంగులంటే ఇష్టం – శ్రీకాంత్

రంగులంటే ఇష్టం – శ్రీకాంత్

On

శ్రీకాంత్ కు రంగులంటే ఇష్టం. ఆ రంగులు బొమ్మలతో వుంటే ఇంకా ఇష్టం. ఆ బొమ్మలు తను వేసినవి అయితే ఎంతో తృప్తి. ఇంద్రధనుస్సులోని రంగులు, ప్రకృతిలోని పచ్చదనం, పూలల్లోని పరిమళం, పక్షులకున్న స్వేచ్చను ఎంతో ఇష్టపడతాడు. పై రంగులన్నీ, ఆలోచనల్ని కలగలిపి కుంచెతో చిత్రాల్ని ఆవిష్కరిస్తాడు. విశ్వనాథ శ్రీకాంతాచారి (33). నివాసం మదీనాగూడ, చందానగర్, హైదరాబాద్. పేయింటింగ్…