అక్షర చిత్రకళా ప్రేమికుడు – శీలావీ

అక్షర చిత్రకళా ప్రేమికుడు – శీలావీ

June 1, 2023

(జూన్ 1న శీలా వీర్రాజు గారి ప్రథమ వర్థంతి సందర్భంగా…) బహుముఖ ప్రజ్ఞాశాలురు అరుదుగా ఉంటారు. అటువంటివారిలో శీలా వీర్రాజు ఒకరు. ఆయన చిత్రకళ, సాహిత్యం రంగాలలో అద్భుతంగా రాణించారు. ఓ పత్రికలో సబ్- ఎడిటర్ కమ్ ఆర్టిస్ట్ గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన 1963 లో రాష్ట్రప్రభుత్వ సమాచార పౌర సంబంధాల శాఖలో అనువాదకుడుగా చేరారు….

‘నాగరాజు గంధం’ నాటకం నుండి సినిమా వరకూ

‘నాగరాజు గంధం’ నాటకం నుండి సినిమా వరకూ

May 31, 2023

నాగరాజు గంధం గారి జీవితం ఒక గొప్ప గ్రంథం. బతికింది తక్కువ కాలమే అయినా, సాహిత్యంలో శాశ్వత ముద్ర వేసి వెళ్ళిపోయాడు. గమ్యం, బాణం, గాయం – 2 లాంటి సినిమాలకు సంభాషణలు అందించిన రచయిత. చదువు, శేషార్ధం, ఓ క్రైం కథ లాంటి నాటికలు రాసిన గొప్ప రచయిత. నాగరాజు సాహిత్య విశిష్టతను గస్మరించుకుంటూ మిత్ర క్రియేషన్స్,…

తెలుగు కథకు పెద్దదిక్కు కేతు విశ్వనాథ రెడ్డి

తెలుగు కథకు పెద్దదిక్కు కేతు విశ్వనాథ రెడ్డి

May 31, 2023

కేతు విశ్వనాథ రెడ్డిగారు (22-05-23) భౌతికంగా మన నుంచి దూరమయ్యారు. ఒక ఆకు రాలినట్టు తన స్థానానికి సంబంధించిన స్పష్టమైన గుర్తును వదిలిపెడుతూ చప్పుడు చేయకుండా ప్రశాంతంగా వెళ్లిపోయాడు. ఎన్నో చిగురుటాకులకు మార్గదర్శకంగా నిలిచినవాడు, ఒక సంక్లిష్టమైన ప్రాంతీయతను సాహిత్యం చేసినవాడు నిశ్శబ్దంగా నిష్క్రమించాడు. కరువులు తాండవించే నేలల మీదుగా, కక్షల సుడిగాలులు చెలరేగే గ్రామాల వీధుల మీదుగా…

జర్నలిస్టుల డిమాండ్ల పరిష్కారానికి వినతిపత్రం

జర్నలిస్టుల డిమాండ్ల పరిష్కారానికి వినతిపత్రం

May 30, 2023

(ఐపిఆర్‌ కమిషనర్‌ కార్యాలయం వద్ద జర్నలిస్టుల నిరసన డిమాండ్ల పరిష్కారానికి వినతిపత్రం సమర్పణ..)ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ (ఎపిడబ్ల్యుజెఎఫ్‌), ఆంధ్రప్రదేశ్‌ బ్రాడ్‌కాస్ట్‌ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ (ఎపిబిజెఎ) ఆధ్వర్యాన సోమవారం(29-5-23) జర్నలిస్టుల డిమాండ్స్‌ డే జరిగింది. దీనిలో భాగంగా విజయవాడలోని ఆర్‌టిసి బస్టాండ్‌ కాంప్లెక్స్‌ సముదాయంలోని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం వద్ద జర్నలిస్టులు నిరసన వ్యక్తం…

తెలుగును అధికారభాషగా అమలు చేయాలి

తెలుగును అధికారభాషగా అమలు చేయాలి

May 18, 2023

1966 మే 14న తెలుగుభాషను అధికారభాషగా, పాలనా భాషగా, ప్రకటిస్తూ చట్టం వచ్చింది. దీన్ని పూర్తిగా పాటించడం పాలకుల విధి. ప్రభుత్వాన్ని కదిలించి పనిచేయించుకునే హక్కు ప్రజలకు ఉంది. ఇది ప్రభుత్వ వ్యతిరేక చర్య కాదు. ఇది రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కు అని తెలుగు భాసోధ్యమ సమాఖ్య గౌరవాధ్యక్షులు డా. సామల రమేష్ బాబు అన్నారు. విజయవాడలోని…

కనువిందు చేసిన ‘జలవర్ణ చిత్ర’ ప్రదర్శన

కనువిందు చేసిన ‘జలవర్ణ చిత్ర’ ప్రదర్శన

May 15, 2023

–ఘనంగా విజయవాడ ఆర్ట్ సొసైటీ 8వ వార్షికోత్సవ వేడుకలు-చిత్రకారులు వాసుదేవ్ కామత్ గారికి ‘చిత్రకళా తపస్వీ’ బిరుదు ప్రదానం–64 నీటిరంగుల చిత్రాలతో జాతీయ స్థాయి చిత్ర ప్రదర్శన…………………………………………………………………………………………………. చిత్రకళా సాధన ఒక తపస్సు లాంటిదని, నిరంతర సాధనతోనే కళాకారుడు పరిణితి సాధించగలడని ప్రముఖ చిత్రకారుడు వాసుదేవ్ కామత్ అన్నారు. విజయవాడ ఆర్ట్ సొసైటీ, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్…

విజయవాడ జాతీయస్థాయి చిత్రకళా ప్రదర్శన

విజయవాడ జాతీయస్థాయి చిత్రకళా ప్రదర్శన

May 12, 2023

-మే నెల 12 న విజయవాడ ఆర్ట్ సొసైటీ 8 వ వార్షికోత్సవం వేడుకలు-ముఖ్యఅథిదిగా ప్రఖ్యాత భారతీయ చిత్రకారులు వాసుదేవ్ కామత్ విజయవాడ ఆర్ట్ సొసైటీ 8 వ వార్షికోత్సవం సందర్భంగా స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజీ వారి సంయుక్త నిర్వహణలో జాతీయ స్థాయి పెయింటింగ్ పోటీ మరియు చిత్రకళా ప్రదర్శన 14-5-2023 న ఆదివారం…

కోటి రూపాయల శ్రీశ్రీ సాహిత్యం

కోటి రూపాయల శ్రీశ్రీ సాహిత్యం

April 30, 2023

అతని పేరు కొంచెం ! అతని ఊరు ప్రపంచం ! అతడే శ్రీశ్రీ !! ‘కష్టజీవికి ఇరువైపులా నిలబడ్డవాడే కవి’ అన్న వాడు, తన జీవితాంతం అలా నిలబడి ఉన్నవాడు. అతడి కసీ కృషీ-అతడి కన్నూ, పెన్నూ, గన్నూ-అతడి గేయం, ధ్యేయం, న్యాయం, శ్రమవాదం, సామ్యవాదం, మానవతావాదం. సమానవతావాదం ! సామ్రాజ్యవాదాన్ని పాతరవేసే శ్రమరాజ్యవాదం ఎజెండా అతడు. గ్లోబల్…

అక్షరంలో దాగిన ఆకలి జ్వాల – శ్రీశ్రీ

అక్షరంలో దాగిన ఆకలి జ్వాల – శ్రీశ్రీ

April 30, 2023

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…

తెలుగింటి ‘బాలి’ బొమ్మ‌

తెలుగింటి ‘బాలి’ బొమ్మ‌

April 19, 2023

(బెందాళం క్రిష్ణారావు గారు 29-4-2018 న ప్రజాశక్తి దినపత్రికలో చేసిన ఇంటర్ వ్యూ) బాలి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దాదాపు ఐదు దశాబ్దాలుగా అవిశ్రాంత చిత్రకారుడాయన. దేశవిదేశాల్లోని తెలుగువాళ్లందరికీ, గీతల్ని, రాతల్ని ప్రేమించేవారందరికీ ఇష్టమైన పేరది. లక్షల చిత్రాలు గీసిన లక్షణమైన చిత్రకారునిగా, కార్టూనిస్టుగా, కథారచయితగా తన జీవితాన్నే చిత్రంగా మలచుకుని పయనం సాగిస్తున్న కళాకారుడు…