అద్భుత నటీమణి జి. వరలక్ష్మి

అద్భుత నటీమణి జి. వరలక్ష్మి

November 30, 2023

(నవంబర్ 25న జి. వరలక్ష్మి 15 వ వర్ధంతి సందర్భంగా) జి. వరలక్ష్మి (గరికపాటి వరలక్ష్మి) పుట్టింది సెప్టెంబరు 27, 1926 న ఒంగోలు మాతామహుల ఇంటిలో. తండ్రి జి.ఎస్. నాయుడు పేరు విజయవాడలో తెలియనివారు వుండేవారు కాదు. కారణం ఆయన ప్రముఖ మల్లయోధుడు కోడి రామమూర్తి సహచరుడు. పైగా మంచి వస్తాదు కూడా. ఆరోజుల్లో కోడి రామమూర్తికి…

బహుభాషా సంగీత కోవిదుడు… రమేష్ నాయుడు

బహుభాషా సంగీత కోవిదుడు… రమేష్ నాయుడు

November 30, 2023

“మనదైన మంచి సంగీతం దూరమౌతుందని, మనకు అపారమైన జానపద సంగీతం సజీవంగానే వుందని, దాని జాడలో వెళితే స్వరార్ణవాన్ని సృష్టించవచ్చ”ని తెలుగు చిత్రసీమకు పరిచయమైన కొత్తల్లోనే చెప్పాడు ఈ సంగీత కళానిధి రమేష్ నాయుడు. చెప్పడమే కాదు తెలుగు చిత్రసీమలో అడుగిడకముందే మరాఠీ, గుజరాతీ, బెంగాలీ భాషల్లో సమకూర్చిన సంగీతానికి జానపదులు సహకరించాయని అక్షరాలా రుజువు చేశాడీ సంగీత…

తెలుగింటి అత్తగారు – ఒక జ్ఞాపకం

తెలుగింటి అత్తగారు – ఒక జ్ఞాపకం

November 20, 2023

దారిపొడవునా తమిళం బోర్డులు కనిపించగానే హమ్మయ్య చెన్నై వచ్చేశాను అనుకున్నాను. మొదటిసారిగా చెన్నై నగరంలో అడుగుపెట్టాను. పచ్చని చెట్లతో విశాలమైన రహదారులతో వున్న తమిళ నగరాన్ని ఆ క్షణాన్నే ప్రేమించేశాను. 5 నవంబర్,2023 ఆదివారం సాయంత్రం 6 గంటలకు టి. నగర్లోని విజయరాఘవ రోడ్ లోని సమావేశ స్థలానికి వెళ్ళగానే మనసంతా నూతనోత్సాహం కలిగింది. అలవాటు ప్రకారం ఆలస్యంగా…

తెలుగు సినీ రాకుమారుడు… కత్తి కాంతారావు

తెలుగు సినీ రాకుమారుడు… కత్తి కాంతారావు

November 16, 2023

(కాంతారావు జయంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి ప్రత్యేక వ్యాసం) తెలుగు చలనచిత్ర పితామహులుగా కీర్తించబడే హెచ్. ఎం. రెడ్డి చేతులమీదుగా చలనచిత్ర రంగప్రవేశం చేసి, స్వయంకృషితో జానపద, పౌరాణిక, సాంఘిక, క్రైమ్ చిత్రాలలో హీరోగా, క్యారక్టర్ నటుడుగా తనదైన శైలిలో రాణించిన అద్వితీయ నటుడు కత్తి కాంతారావు గా పిలిపించుకున్న తాడేపల్లి లక్ష్మీకాంతారావు. రాజభోగాలతోబాటు విషాద సంఘటనలు, చెడు…

సాహస హీరోకు కన్నీటి వర్ధంతి

సాహస హీరోకు కన్నీటి వర్ధంతి

November 15, 2023

అతడొక అసాధ్యుడు. అసాధ్యుడే కాదు అఖండుడు కూడా. ఉంగరాలజుట్టుతో, ఊరించే కన్నులతో బుర్రిపాలెం అనే కుగ్రామం అందించిన నూటొక్క జిల్లాలకి అందగాడు. హేమాహేమీలుగా వున్న ఎన్టీఆర్, ఏయన్నార్ లు చలనచిత్ర రంగాన్ని ఏలుతున్న సమయంలో అడుగుపెట్టి, సాహసమే ఊపిరిగా, పట్టుదలే సోపానంగా, ఓటమే విజయానికి పునాదిగా నమ్మి అంచలంచలుగా సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన సుకుమారుడు సుందరాంగుడు, నటశేఖరుడు,…

లక్షాధికారికి షష్టిపూర్తి

లక్షాధికారికి షష్టిపూర్తి

November 15, 2023

తెలుగు చలనచిత్ర పరిశ్రమ నాటి మద్రాసు మహానగరంలో త్యాగరాయ నగర్, పాండీబజారు లకు పరిమితమైన రోజుల్లో, హైదరాబాదులో చిత్రపరిశ్రమను అబివృద్ధి చేయాలని తన మకాం మార్చిన అక్కినేని నాగేశ్వరరావుకి చేదోడువాదోడుగా శ్రీ సారథీ స్టూడియో నిర్వహణా బాధ్యతను తలకెత్తుకొని, అందులో తెలుగు చిత్రాలను నిర్మించేందుకు శ్రమించిన తెలుగు సినీ కృషీవలుడు తమ్మారెడ్డి కృష్ణమూర్తి అనే గోపాల కృష్ణమూర్తి. అన్నపూర్ణ,…

ఖరీదైన ఫ్లాప్ చిత్రం… ప్రపంచం (1953)

ఖరీదైన ఫ్లాప్ చిత్రం… ప్రపంచం (1953)

November 13, 2023

‘ప్రపంచం’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించబడింది. తమిళంలో ఈ సినిమా పేరు ‘ఉలగం’. ఈ సినిమా 10 జూలై 1953 న విడుదలైంది. తెలుగు వర్షన్ లో నాగయ్య, ఈలపాట రఘురామయ్య, రామశర్మ, జి. వరలక్ష్మి, లక్ష్మీకాంత, లలిత, పద్మిని, కమలకుమారి, ఎస్.జానకి, కాంచన, ఛాయాదేవి, కనకం మొదలగువారు ముఖ్య తారాగణం. ఈ సినిమా నిర్మాత…

సినీ పాటల పుస్తకాల ఆవిష్కరణ

సినీ పాటల పుస్తకాల ఆవిష్కరణ

November 3, 2023

(నవంబర్ 6 వ తేదీన, హైదరాబాద్ లో 14 పుస్తకాల ఆవిష్కరణ) చరిత్ర మనుషుల్ని సృష్టించదు. కొందరు మాత్రమే చరిత్రను సృష్టిస్తారు. వాళ్ళు సామాన్యంగా కనబడే అసామాన్యులు. ఒక అశోకుడు దారికిరువైపులా చెట్లు నాటించాడు. బావులు తవ్వించాడు. అక్కడక్కడ విశ్రాంతి కోసం విశ్రాంతి గృహాలు కట్టించాడు. గొప్ప చక్రవర్తిగా చరిత్రలో నిలిచిపోయాడు!అయితే ఎలా? ఎందుకూ? అని ప్రశ్నిస్తే, జవాబు…

సహజ నటనాభినేత్రి సావిత్రి

సహజ నటనాభినేత్రి సావిత్రి

October 31, 2023

ఆమె ఓ అద్భుతంఆమె ఓ అపూర్వంఆమె ఓ అలౌకికఆమె ఓ ప్రేమికఆమె అందం ప్రసూన గంధంఆమె హృదయం కరుణాసాగరంపెదవి విరుపులో, కొనచూపుతోలాస్యాన్ని, హాస్యాన్ని, మోదాన్ని,మౌనభాష్యాన్ని, విషాద కావ్యాలను రచించిన మహానటి…ఏనాటికీ ప్రేక్షక హృదయాల్లో చెరగని తేనె సంతకం సావిత్రి…మహానటి సావిత్రి గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఆవిడ నటించిన సినిమాలు చాలావరకు ఆణిముత్యాలే అని చెెప్పవచ్చు. నాలుగు…

వెండితెర ఇంద్రజాలికుడు – విఠలాచార్య

వెండితెర ఇంద్రజాలికుడు – విఠలాచార్య

October 29, 2023

సాధారణంగా సాహిత్యంలో పాతవాటికి ఆదరణ, సాంకేతికత రంగంలో కొత్తవాటికి ఆకర్షణ ఎక్కువ అని నానుడి. కానీ ఆయనకి ఈ నానుడి వర్తించదు. ఎందుకంటే ఆయన ఎప్పుడో సినిమాలు తీసినా ఇప్పటికీ ఆ సినిమాలకి ఆదరణ తగ్గలేదు.ఆయన తీసినవి అద్భుత కథలేమీ కావు – కానీ అద్భుతంగా తీసాడు.ఆయన తీసినవి అజరామరాలేమీ కాదు – కానీ ఆశేష సినీ ప్రేక్షకులని…