‘దానవీర శూర కర్ణ’ సినిమాకు ప్రేరణ మోదుకూరి జాన్సన్!

‘దానవీర శూర కర్ణ’ సినిమాకు ప్రేరణ మోదుకూరి జాన్సన్!

September 6, 2022

మోదుకూరి జయంతి నెల ఆగస్టులో జెండా పండుగ సంబరాలు ముగిశాక, విజయవాడ ఐ.ఎం.ఏ. హాలులో సంస్కరణ సభ ఆగస్ట్ 20 శనివారం సాయంత్రం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. ఇందులో పలువురు సాహితీ వేత్తలు పాల్గొని జాన్సన్ రచనల వైశిష్ట్యాన్ని కొనియాడారు. ‘విరసం’ రాష్ట్ర కార్యదర్శి అరసవిల్లి కృష్ణ మాట్లాడుతూ గ్రామీణ నేపధ్యం తెలిసిన రచయిత మాత్రమే, ‘రైతు లేనిదే…

బెంగాల్ చిత్రసీమ ఉత్తమ ఐడల్… ఉత్తమ్ కుమార్

బెంగాల్ చిత్రసీమ ఉత్తమ ఐడల్… ఉత్తమ్ కుమార్

September 3, 2022

(ఉత్తమ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం…) బెంగాలి బాబులకు అతడొక మహానాయకుడు. సినీ ప్రేమికులకు అతడొక మ్యాటినీ ఐడల్. సినీ నిర్మాతలకు అతడొక వసూల్ రాజా. సహనటులకు అతడొక మార్గదర్శి. ఇన్ని సుగుణాల కలబోత ప్రముఖ బెంగాలి, హిందీ సూపర్ స్టార్ ఉత్తమ్ కుమార్. అతడో విజ్ఞాన ఖని. మంచి నటుడు, నిర్మాత, స్క్రీ ప్లే…

‘సబల’ రాష్ట్రస్థాయి షార్ట్ ఫిల్మ్ పోటీలు

‘సబల’ రాష్ట్రస్థాయి షార్ట్ ఫిల్మ్ పోటీలు

August 30, 2022

ఏపీ మహిళాకమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాచరణ -2022లో భాగంగా ‘సబల’ లఘుచిత్ర( షార్ట్ ఫిల్మ్స్) రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తుంది. ఈమేరకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఈ విషయాన్ని మంగళవారం (30-08-22) ప్రకటించారు. క్షేత్రస్థాయిలో మహిళలకు సంబంధించిన అన్ని అంశాలపై ఫోకస్ పెట్టి ఔత్సాహిక దర్శకులు, సంస్థలు లఘుచిత్రాలు తీసి పంపాలని ఆమె…

అందం, అభినయాలను కలబోసిన లలన… జమున

అందం, అభినయాలను కలబోసిన లలన… జమున

August 30, 2022

(జమునగారి పుట్టినరోజు సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం…) తెలుగు చలనచిత్ర యవనికపై ఆమె వైభవ ప్రాభవాలు సినీచరిత్రలో సువర్ణ లిఖితాలు. ఆమె ఆత్మగౌరవ పోరాటాలు నేటితరం నటీమణులకు స్ఫూర్తిదాయకాలు. ఆమె ప్రతిభా సామర్థ్యాలు, రూపలావణ్యాలు ఉత్తమ కథానాయికలకు ప్రామాణికాలు. ఆమె పోషించిన పాత్రలు అనురాగానికి, అనుబంధానికి, ప్రేమకు, ఆర్ద్రతకు అద్దంపట్టినవే. ఆమె హావభావ విన్యాసం ముందు ఎన్నో క్లిష్టమైన…

తెలుగు చిత్రసీమ సీతాదేవి.. అంజలీదేవి

తెలుగు చిత్రసీమ సీతాదేవి.. అంజలీదేవి

August 24, 2022

(అంజలీదేవిగారి పుట్టినరోజు సంధర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం…) ఆమె మదన మనోహర సుందరనారి, రాజ మరాళి, నాట్యమయూరి, చుక్కలకన్న చక్కనైన సువర్ణ సుందరి, నెలరాజు వలచిన కలువ చెలి, అన్నిటికీ మించి అనురాగదేవత, కరుణామయి, మాతృత్వం మూర్తీభవించిన అమ్మ… నవరస నటనావాణి. అంజమ్మగా తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో జన్మమెత్తి, రంగస్థలాన అంజనీదేవిగా గజ్జెకట్టి, తెలుగు చలన చిత్ర…

ఔత్సాహికులకు ‘యాడ్ ఫిల్మ్స్ మేకింగ్ ‘లో వర్క షా ప్

ఔత్సాహికులకు ‘యాడ్ ఫిల్మ్స్ మేకింగ్ ‘లో వర్క షా ప్

August 21, 2022

హైదరాబాద్ రవీంద్రభారతి లో రెండు రోజులపాటు “యాడ్ ఫిల్మ్స్ మేకింగ్ వర్క షాప్” యాడ్ ఫిల్మ్స్ అంటేనే ఒక ఆకర్షణ, అవి సినిమాకు సమాంతరంగా ప్రచారం పొందుతున్నాయి. యాడ్ ఫిల్మ్స్ నిర్మాణంలో పాల్గొనే వారంతా కూడా ఇంటలెక్చువల్స్ అన్న భావం మీడియాలో ప్రచారంలో ఉంది. అయితే సినిమా రంగానికి ఆకర్షితులైనంతగా, యాడ్ ఫిల్మ్స్ కి ఆకర్షితులవ్వడంలేదు. యాడ్ ఫిల్మ్స్…

మర్యాదరాముడు… నవ్వులరేడు పద్మనాభుడు

మర్యాదరాముడు… నవ్వులరేడు పద్మనాభుడు

August 20, 2022

ప్రతి మనిషి జీవితంలోను సుఖదుఃఖాలుంటాయి, మిట్టపల్లాలూ వుంటాయి. వెండితెరమీద నవ్వులు పంచిన వారందరి జీవితాలూ పువ్వుల బాటలు కానేరవు. అందుకు అతని జీవితం మినహాయింపు కాదు. అతడు ఓ అద్భుత హాస్యనటుడు, రంగస్థల నటుడు, గాయకుడు, సంగీత ప్రియుడు, రచయిత, నిర్మాత, దర్శకుడు. ప్రముఖ సంగీత కళానిధి శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యాన్ని తెలుగు చిత్రసీమకు పరిచయం చేసిన అమృతమూర్తి….

తెలుగు సినిమాకు కొత్త ఊపిరి – ఆ రెండు సినిమాలు

తెలుగు సినిమాకు కొత్త ఊపిరి – ఆ రెండు సినిమాలు

August 18, 2022

అగ్ర కథానాయకుల చిత్రాలు సైతం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోవడం, చిన్న చిత్రాలు కనీస ప్రేక్షకాదరణకు నోచుకోకపోవడంతో గత కొంతకాలంగా నిర్మాతలకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. అదే సమయంలో ఎగ్జిబిటర్స్ ఖాళీగా ఉన్న థియేటర్లను చూసి కలత చెందడం మొదలెట్టారు. సినిమా టిక్కెట్ రేట్లను పెంచడం వల్లే జనాలు థియేటర్లకు రావడం లేదేమోననే సందేహంతో స్వచ్చందంగా…

డబ్బింగ్ చిత్రాల సిరి… రాజశ్రీ

డబ్బింగ్ చిత్రాల సిరి… రాజశ్రీ

August 16, 2022

డబ్బింగ్ సినిమాలకు మాటలు, పాటలు రాయడం ఒక అద్భుతమైన కళ. పాత్రధారుల పెదవుల కదలికలకు అనుగుణంగా, కథాగమనం దెబ్బతినకుండా మాటలు, పాటలలో వున్న సాహిత్యానికి అనుగుణంగా డబ్బింగ్ పాటలు రాయడం క్లిష్టతరమైన ప్రక్రియే. డబ్బింగ్ చిత్రాలకు తెలుగులో శ్రీశ్రీ ఆద్యుడు కాగా, తరవాతి కాలంలో ఆరుద్ర, పినిశెట్టి వంటి కవులు డబ్బింగ్ చిత్రాలకు మాటలు, పాటలు సమకూర్చారు. ఈ…

వినీలాకాశంలో ధ్రువతార… శ్రీదేవి

వినీలాకాశంలో ధ్రువతార… శ్రీదేవి

August 13, 2022

ఆమె సినీ వినీలాకాశంలో ఓ ధ్రువతార. నటనతో భారతీయ సినీ ప్రపంచంలోనే తొలి మహిళా సూపర్‌స్టార్‌గా ఎదిగిన అరుదైన నటీమణి. పాతికేళ్ల క్రితమే తెలుగు చిత్రసీమను విడచి బాలీవుడ్‌లో స్థిరపడినా, తెలుగు ప్రేక్షకుడు ఆమెను మరిచిపోయింది లేదు. ఆమే శ్రీదేవి. అందాల తారగా, అభినయంలో మేటిగా సినీ ప్రేక్షకులను అలరించిన శ్రీదేవి తారాపధానికి ఎదిగిన తీరు ఆద్యతం ఆసక్తికరం….