సాహితీ వేత్తలకు నేడే పురస్కార ప్రదానం

సాహితీ వేత్తలకు నేడే పురస్కార ప్రదానం

July 8, 2023

ముగ్గురూ ముగ్గురే… ఎవరి రంగంలో వారు నిష్ణాతులే.. సాహితీ దిగ్గజాలే..ఒకరు సైన్స్ రచయిత, ఇంకొకరు కవి, అనువాద బ్రహ్మ, మరొకరు ఆచార్యులు.ఈరోజు(8-7-23) శనివారం 10.30 గంటలకు హైదరాబాద్, రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాలులో…మల్లవరపు జాన్ స్మారక సాహితీ పురస్కారాల ప్రదానం జరుగుతుంది.‌ 2021, 2022, 2023సంవత్సరాలకు గాను డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, ముకుందరామారావు, ఆచార్య శిఖామణి గారికి పురస్కారాలను అందజేస్తారు….

కవిత్వ పరిభాష తెలిసిన కవి

కవిత్వ పరిభాష తెలిసిన కవి

July 4, 2023

“కవులేం చేస్తారుగోడలకు నోరిస్తారుచెట్లకు కళ్ళిస్తారు, గాలికి గొంతిస్తారు.ప్రభుత్వాల్ని ధిక్కరిస్తారుప్రజలకు చేతులిస్తారుతెల్ల కాయితానికి అనంత శక్తినిస్తారు” అని ప్రఖ్యాత కవి శివారెడ్డి గారు అంటారు. నిరంతర పఠనం, లేఖనం ఆయన స్వభావం. ఆయన కవులకు కవి. అంతకు మించిన మానవుడు. కవులను ఎంతగా ప్రేమిస్తారో మామూలు మనుషులను అంతగా ప్రేమిస్తారు. ఆయన ఒక కవిత్వం చెట్టు. ఎక్కడెక్కడి కవి ఖుక…

బహుముఖ ప్రజ్ఞాశాలి – సంజీవదేవ్

బహుముఖ ప్రజ్ఞాశాలి – సంజీవదేవ్

తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి. బహుముఖ ప్రజ్ఞాశాలిగా, బహుభాషాభిజ్ఞునిగా, లలితకళా విమర్శకునిగా ప్రఖ్యాతి పొందిన దార్శనికుడు, సమాచార సంబంధాలు అంత అంత మాత్రమే ఉన్న పురాతన కాలంలో కేవలం తన లేఖల ద్వారా దేశ , అంతర్జాతీయ చిత్రాకారులతో, సుప్రసిద్ద మేధావులతో కలం స్నేహం జరిపి ఎంతో జ్ఞానాన్ని, అనుభవాలను సంతరించుకున్న అరుదైన వ్యక్తిత్వం గల సూర్యదేవర సంజీవదేవ్…

‘చందమామ’పై అందుకున్న డాక్టరేట్

‘చందమామ’పై అందుకున్న డాక్టరేట్

July 1, 2023

‘చందమామ’పై పరిశోధించి పి.హెచ్డీ. సాధించడం నా కల! ఎందుకంటే నన్ను చందమామ రచయితను చేసింది. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు అందుకునేలా తీర్చిదిద్దింది. ఇన్నాళ్ళకు ఇన్నేళ్ళకు నా కల నెరవేరింది. 1975లో పదేళ్ళ వయసులో మొదటిసారి ‘చందమామ’ పుస్తకం చూశాను. అట్ట చినిగిపోయి, జీర్ణావస్థలో ఉన్న ఆ పుస్తకం రంగుల బొమ్మలతో మంచి మంచి కథలతో నన్ను చాలా…

రచయితలకు ఆహ్వానం- తెలుగు కథానిక

రచయితలకు ఆహ్వానం- తెలుగు కథానిక

July 1, 2023

ఉత్తర అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, సింగపూర్, దక్షిణ ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలు, ఐరోపా విదేశీ ప్రాంతాలలో స్థిరపడిన భారతీయ కథకుల రచనలని గుర్తిస్తూ గత ఏడాది వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వెలువరించిన “డయాస్పోరా తెలుగు కథానిక-16 వ సంకలనం” ప్రపంచవ్యాప్తంగా పాఠకుల, సాహితీవేత్తల, విశ్లేషకుల ఆదరణ పొందిన విషయం విదితమే.ఆ పరంపరను కొనసాగిస్తూ ఈ సంవత్సరం…

‘తానా’ కావ్య పోటీల్లో ‘లక్ష’ గెలుచుకున్న బులుసు

‘తానా’ కావ్య పోటీల్లో ‘లక్ష’ గెలుచుకున్న బులుసు

June 30, 2023

సిరివెన్నెల స్మృతిలో తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వహించిన లక్ష రూపాయల బహుమతితో కూడిన కావ్య పోటీలలో 91 మంది రచయితలు పాల్గొనడం విశేషం. లక్ష రూపాయల బహుమతి విజేత బులుసు వెంకటేశ్వర్లుకు, తానా ఈ పుస్తకంలో ప్రచురించడానికి అర్హత పొందిన 50 మంది కావ్య రచయితల వివరాలు ప్రకటించారు. ప్రముఖ సినీ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి…

మూగబోయిన తెలంగానం – సాయిచంద్

మూగబోయిన తెలంగానం – సాయిచంద్

June 30, 2023

ప్రజాయుద్ధ సంగీతం, నెత్తుటి చాళ్ళలో విత్తనమై మొలకెత్తిన పాటల వనం, అట్టడుగు ప్రజల కోసం గళమెత్తిన ప్రజా గాయకుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ వి. సాయిచంద్ జూన్ 29 న గుండెపోటుతో మరణించడం తెలంగాణ కళా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎంతో భవిష్యత్ ఉన్న ప్రజా నాయకుడు, పాట కవి ఇలా అకాల మృత్యువును పొందడం…

‘గీతా ప్రెస్’కు గాంధీ పురస్కారం

‘గీతా ప్రెస్’కు గాంధీ పురస్కారం

June 27, 2023

ఎంతో ప్రఖ్యాతి కలిగిన గోరఖ్ పూర్ ‘గీతా ప్రెస్’కు ప్రతిష్ఠాత్మకమైన ‘గాంధీ శాంతి పురస్కారం’ ప్రదానం కానుంది. ఈ దిశగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది.జాతిపిత మహాత్మాగాంధీ పేరిట ప్రతి ఏటా ఈ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోందన్న విషయం తెలిసిందే. గీతా ప్రెస్ స్థాపించి ఈ ఏటికి వందేళ్ళు పూర్తయ్యాయి. ఇటువంటి విశిష్ట సమయంలో…

శంకర నారాయణ డిక్షనరి కథ

శంకర నారాయణ డిక్షనరి కథ

June 13, 2023

ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు.ముందు వ్యాపారం చేయడానికి… తరువాత అధికారం చెలాయించడానికి….వాడి భాష మనకి రాదు…వాడు “గాడ్ ఈజ్ గుడ్” అనేవాడు. మనకి అది “గాడిదగుడ్డు” గా అర్థమైంది.మనం “రాజమహేంద్రి” అన్నాం… వాడికి “రాజమండ్రి”లా వినిపించింది.మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు… వాడి భాష మనకి బోధపడేది కాదు.వ్యాపారం, పరిపాలన వాళ్ల అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ…

తెలుగుజాతి వైతాళికుడు కొమఱ్ఱాజు శత వర్థంతి

తెలుగుజాతి వైతాళికుడు కొమఱ్ఱాజు శత వర్థంతి

June 10, 2023

తెలుగుజాతి వైతాళికుడు కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావుగారి శత వర్థంతి జీవితంలో అనుక్షణం పరిశోధనే ప్రాణంగా, భాషాచరిత్ర, సాహిత్యాలను మధించి, సజాతీయ విజాతీయ భాషా సాహిత్యాల లోతులను చూసి, సాదృశ్య వైదృశ్యాలను సమ్యక్ దృష్టితో తెలుగుజాతికి అందించిన, తెలుగువారిని ఆధునికయుగం వైపు నడిపించిన మహనీయుడు, తెలుగువారు విస్మరించిన వైతాళికుడు కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు గారు (1875-1923). చరిత్ర, శాసన పరిశోధనను…