ఘనంగా ‘బాలల దినోత్సవ’ చిత్రలేఖన పోటీలు

బాలల దినోత్సవము సందర్భముగా నవంబర్ 14 తేదీన డ్రీమ్ యంగ్ అండ్ చిల్డర్న్స్ ఆర్ట్ అకాడెమీ & అనంత్ డైమండ్స్ వారి ఆధ్వర్యములో విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ & ఆర్కిటెక్చర్ విజయవాడ సంయుక్తంగా NTR & కృష్ణా జిల్లాల, పాఠశాల, కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు.

ఈ చిత్రలేఖన పోటీలలో అన్ని గ్రూపుల నుండి 2200 పైగా విద్యార్థులు పాల్గొన్నారని. ఇంత మంచి ప్రోగ్రాం ను విశాలమైన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్చిటెక్చర్ విజయవాడ ప్రాంగణంలో నిర్వహించడం ఈ విజయానికి ప్రదాన కారణమని అనంత్ డైమండ్స్ ఫౌండర్ భాను ప్రకాష్ అన్నారు.
ఉదయం 10.30 నిమిషాలకు చిత్రలేఖన పోటీలను స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్చిటెక్చర్ డైరెక్టర్ డా. రమేష్ సిరికొండ రిబ్బన్ కట్ చేసి, వెంటనే రంగుల బెలూన్లను గాలిలో ఎగురవేసి ‘బాలల దినోత్సవ పండుగనూ ప్రారంభించారు.

డ్రీమ్ యంగ్ అండ్ చిల్డర్న్స్ ఆర్ట్ అకాడెమీ గత పది సంవత్సరాలుగా చిత్రకళా రంగంలో అనేక కార్యక్రమాల ద్వారా చిన్నారులలో కళాభినివేశాన్ని పెంపొందించేదుకు ఫౌండర్ ప్రసిడెంట్ గా పి. రమేష్ కృషిచేస్తున్నాడని జిజ్ఞాస ఇంటర్ ఫేస్ డైరెక్టర్ భార్గవ్ అన్నారు.

కళాసాగర్ (Editor: 64kalalu.com) అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మందపాటి శేషగిరిరావు (చైర్మేన్- ఏ.పి. గ్రంథాలయ సంస్థ) , డా. గుంటూరు వరుణ్ (డా. వరుణ్ కార్డియాక్ & న్యూరో సెంటర్), ఏ.వి.ఆర్. సుబ్బారావు, (Regional Manager-SBI-Vijayawada) జి. బాబురావు (Chief Manager-SBI Patamata Lanka Branch), జిజ్ఞాస ఇంటర్ ఫేస్ డైరెక్టర్ భార్గవ్, డా. ఎస్. వి. కృష్ణ కుమార్ (Dean student affairs, SPAV), సంతోష్ కుమార్ (Assistant Professor-SPAV), జాస్తి అనంత పద్మ శేఖర్, అనంత్ డైమండ్స్ ఫౌండర్ భాను ప్రకాష్, రమేష్ పి. (డైరెక్టర్- డ్రీమ్ యంగ్ అండ్ చిల్డర్న్స్ ఆర్ట్ అకాడెమీ), చిత్రకారులు టీవీ, జస్టిస్ వజ్రగిరి తదితరులను సత్కరించారు. అనంతరం చిత్రకారులు టీవీ, జస్టిస్ వజ్రగిరిలతో పాటు నగరంలోని మరికొంత మంది చిత్రకారులను సత్కరించారు.

-శివకుమార్

SA: