‘చిల్డ్రన్స్ డే’ చిత్రలేఖనం పోటీలు

నవంబర్ 14 ‘చిల్డ్రన్స్ డే’ సందర్భంగా చిన్నారులకు చిత్రలేఖనం పోటీలు

విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసి వారికి కళల పట్ల అవగాహన కల్పించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో “స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ”, “స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్” మరియు “64కళలు.కామ్” సంయుక్త ఆధ్వర్యంలో…”ఆర్టిజో ఫైన్ ఆర్ట్స్ స్టూడియో” సమర్పణలో 3వ తరగతి నుంచి డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు నవంబర్ 14వ తేదీ, శుక్రవారం ఉదయం 10-12 గంటల వరకు ఆర్ట్ కాంటెస్ట్ (Art Contest) విజయవాడ నగరంలో నిర్వహించడుతుంది.

కాంటెస్ట్ వివరాలు:-
గ్రూప్స్:సబ్ – జూనియర్స్” (3,4,5,6, తరగతులు),అంశం:- మై డ్రీమ్ వరల్డ్
జూనియర్స్” (7,8,9, 10 తరగతులు) అంశం:- వికసిత్ భారత్ @ 2047
సీనియర్స్” (ఇంటర్ మరియు డిగ్రీ)
అంశం:- భారత సంస్కృతిని, కళా నైపుణ్యాన్ని తెలియపరిచే కట్టడం.

వేదిక: స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ, విజయవాడ – 520010

ఆర్ట్ కాంటెస్ట్: ఉదయం: 10 – 12 గంటల వరకు
బహుమతి ప్రదానోత్సవం: మధ్యాహ్నం:12:45 నిముషాల నుండి…

విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకొనుటకు ఆఖరి తేదీ 12 నవంబర్ @ రాత్రి 8 గంటల వరకు ఈ వాట్సాప్ నెంబరు @ 70321 25135 లేదా ఈమెయిల్ ద్వారా heyartizo@gmail.com


నియమ నిబంధనలు:
1). 3వ తరగతి నుండి డిగ్రీ చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చు.
2). రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు తప్పనిసరిగా వారు చదువుతున్న స్కూల్/కాలేజీ నుంచి ధృవీకరణ పత్రం తీసుకురావలసి ఉంటుంది.
3). విద్యార్థులు వారికి నచ్చిన ఏ మీడియంలో నైనా చిత్రాలు గీయవచ్చు.
4). 1/4 సైజ్ (11″x14″) డ్రాయింగ్ షీట్ ఇవ్వబడుతుంది.
5). ప్యాడ్, కలర్స్ ఇంకా‌ ఇతర అవసరమైన వస్తువులు విద్యార్థులే తెచ్చుకోవాలి.
6). విద్యార్థులు డ్రాయింగ్ షీట్ వెనుక తమ‌ పేరు,తరగతి, స్కూల్ / కాలేజీ పేరు ,మొబైల్ నెంబర్ తప్పనిసరిగా రాయవలసి ఉంటుంది
7). మీకిచ్చిన అంశాల మీద మాత్రమే చిత్రాలు గీయవలసి ఉంటుంది.
8). మీరు అంశాన్ని చూపిన విధానానికి,బొమ్మ గీసిన పరిమాణానికి,రంగుల సమ్మేళనానికి, పరిశుభ్రత కి మార్కులు ఇవ్వబడతాయి.
9). సెలక్షన్ కమిటీ సభ్యులదే తుది నిర్ణయం.
10). కాంటెస్ట్ లో గీసిన చిత్రాలు తిరిగి వెనక్కి ఇవ్వబడవు.
11). ప్రతి ఒక్కరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అందజేయబడుతుంది.
12). ఈ మెయిల్ & WhatsApp – 70321 25135 , & heyartizo@gmail.com ద్వారా పేర్లు నమోదు చేసుకున్న వారు మాత్రమే అర్హులు.
13). పేర్లు నమోదు చేసుకునేందుకు ఆఖరు తేదీ @ 12 నవంబర్ 2025.
14). కాంటెస్ట్ జరిగే ప్రదేశంలోకి తల్లిదండ్రులకు,ఇతరులకు అనుమతి ఉండదు.
15). బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం సమయం లో మాత్రమే బహుమతులు ఇవ్వబడతాయి. తర్వాత ఎలాంటి సంప్రదింపులు జరుపబడవు.

Share via
Copy link
Powered by Social Snap