నిత్య బాలుడు ‘చొక్కాపు వేంకటరమణ’

బాల్యం ఒక వరం. ఏడు పదుల వయసులోనూ బాలునిగా, బాలలతో గడపడం ఒక అదృష్టం, అరుదైన అవకాశం కూడా! బహుశః అది ‘నూటిలో… కోటికో ఒక్కరికి దక్కే అరుదైన అవకాశం. ఆ ఏడు పదుల నిత్య బాలుడు బాల సాహితీమూర్తి, చైతన్య స్ఫూర్తి చొక్కాపు వేంకటరమణ. బాల రచయితగా రచనలు చేసి, ‘చందమామ’తో తన సాహిత్య జీవితాన్ని ప్రారంభించిన చొక్కాపు త్వరలో వేయి చంద్రోదయాలు చూడనున్నాడు. బాలల కథా రచయితగా, పత్రికా సంపాదకునిగా, బాలలకు నచ్చిన మెజీషియన్‌గా, కార్యక్రమాల రూపకర్తగా, మాట్లాడే బొమ్మ నేస్తంగా, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణునిగా, బాల సాహిత్య పరిషత్ సారధిగా అనేక రూపాల్లో తన కార్యక్షేత్రాన్ని విస్తరించుకుని ఇరవై నాలుగు గంటలు పని చేసే ఈ బాల సాహిత్య పెద్దకావు” నిత్య బాబుడు. నిరంతర చైతన్య శీలుడు, ఇవ్వాళ్ళ తెలంగాణలో కేవలం బాల సాహిత్య రచయితలుగానే కాక, బాల సాహిత్య వికాసం కోసం కృషి చేస్తున్న మణికొండ వేదకుమార్, దా.భూపాల్, గరి పెల్లి అశోర్, మాడభూషి లలితాదేవి, డా. వాసిరెడ్డి రమేశ్బబు, డా.వి.ఆర్. శర్మ, శాంతారావు వంటి కొందరిలో ఆయనొకరు.

పదవ తరగతి విద్యార్థిగా తొలిసారి మా ఉరు. సిరిసిల్లలో ఆయన ఇంద్రజాల ప్రదర్శన చూసి ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టిన వాణ్ణి. ఇవ్వాళ్ళు పడవ తరగతి చదువుతున్న మా అప్పాయి ఆయన ప్రదర్శనను ఆలాగే చూడడమే కాక, కొన్ని కొన్ని మెళకువులు నేర్చుకున్నాడు. నాలుగైదు దశాబ్దాలుగా అదే స్ఫూర్తి, చైతన్యంతో జీవించడం అందరికి సాధ్యమయ్యే పనికాదు. అదే చొక్కాపు నిత్య బాల్యంలోని రహస్యం ఏప్రిల్ 1, 1948న విజయవాడలో పుట్టిన చొక్కాపు తన ఏడున్నర పదుల జీవితంలో మూడు వంతుల కాలాన్ని హైదరాబాద్ లోనే గడిపారు. బాల్యం నుండే గేయాలు, ఇతర రచనలు చేసినప్పటికీ మోసం మొదటికే నాశనం’ పేరుతో రాసిన తొలికథ 1962లో ‘చంద్రభాను’ బాలల మాస పత్రికలో అచ్చయ్యింది. తరువాత ‘బాలానందం’, ‘జనత, విద్యార్థి మిత్ర’ వార, మాసపత్రికల్లో విరివిగా వీరి కథలు అచ్చుకాగా, ‘ప్రగతి’ వార పత్రికలో ‘అల్లరి సూర్యం నవల సీరియల్ గా వచ్చింది. తొలుత జయశ్రీ’ పత్రికలో పనిచేసిన చొక్కాపు విజయవాడలో చదువు పూర్తయ్యాక రాజధాని హైదరాబాదు వచ్చి కొంతకాలు ‘విపులు’, ‘చతుల పత్రికల్లో చేశారు. ఇదే సమయంలో అవకాశం రావడంతో ఆంధ్రప్రదేశ్ బాలల ఆకాడమి వారి ‘బాల చంద్రిలో పిల్లలపత్రికకు సంపాదకులుగా చేరారు. ఈ సమయంలోనే బుడ్డిగ సుబ్బరాయన్, శారదా అశోకవర్ధన్, వేదగిరి రాంబాబు వంటి బాల సాహితీవేత్తలతో కలిసి పనిచేసే అవకాశం కలగడమే కాక, బాలల అకాడమి తరుపున తన స్వీయ రచన, సంపాదకత్వం, సంకలనాలతో నూరుకు పైగా పిల్లల పుస్తకాలు ప్రచురించారు. దాదాపు పద్దెనిమిదేళ్ళు పనిచేసి 1988లో ‘ఊయల పేర తొలి వ్యక్తిత్వ వికాస మానపత్రికను ప్రారంభించారు.

బాల సాహితీవేత్తగా, వ్యక్తిత్వ వికాస నిపుణునిగా, పర్యావరణ ప్రేమికునిగా, బాలల కథాకారునిగా డెబ్బైకి పైగా వీది స్వీయ రచనలు అచ్చయ్యాయి. ఆంద్రజాలికునిగా దేశవ్యాప్తంగా దాదాపు 7000 ప్రదర్శనలిచ్చిన చొక్కాపు ‘మేజిక్ ఫన్ స్కూల్ స్థాపించి అవ్వాళ్ళ తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది వృత్తి ఇంద్రజాలికులుగా నిలబడేలా చేశారు. తన సంపాదనలోంచి పది శాతం ప్రతి నెలా నిరుద్యోగుల కోసం వెచ్చించే రమణ ప్రతి యేడు తన పుట్టినరోజులు ముందు, వెనకా ఒక విశేష కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కోవలోనే కవలల పండుగ’, త్రి ఎం ఫెస్టివల్, ‘బాల సాహిత్యోత్సవం’ వంటి అనేక కార్యక్రమాలు రూపొందించారు.

బాల సాహితీవేత్తగా కథలు రాయడం, మాస్టర్ స్టోరీ టెల్లర్ గా కథలు మాత్రమే చెప్పడమే గాదు. అనేక రంగాల్లో తనదైన ముద్రను వేసిన ప్రతిభామూర్తి చొక్కాపు. పర్యావరణ పరిరక్షణ, విలువలు, సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవం, మాతృ భాష తెలుగుకు పట్టం కట్టడం, వ్యక్తిత్వ వికాసం, విజ్ఞాన శాస్త్రం, పర్యాటకం, ఆట-పాటలు, మూఢనమ్మకాల నుంచి కనువిప్పు, పురాలు జ్ఞానం, కథలు చెప్పడం, చారిత్రక కథలు, అనువాదాలు అనేక విషయాలు, రంగాల్లో పిల్లల కోసం పని చేశారు. ఏడున్నర పదుల వయసులోనూ యువోత్సాహంతో చేస్తున్నారు. ‘మనిషి అందరికి నీడనిచ్చే చెట్టుగా మారాలి. పచ్చదనాన్ని కాపాడాలి’ అన్న ఆలోచనతో రాసిన ‘చెట్టు మీద పెట్టి, చెట్టు చెప్పిన కథలు’ వంటి పాఠ్యవరణ హిత రచనలు చేశారు. వీటిలోంచి దాన్ని గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వ పాఠ్య పుస్తకాలలో చేర్చబడ్డాయి. పాఠశాల అనేది పిల్లలకు చక్కని నైతిక విలువలు అందించే కేంద్రం అని, విలువలతో కూడిన విద్యాబోధనే నాగరిక సమాజాన్ని నిర్మిస్తుందని నమ్మిన వీరు విలువల విద్యకు ప్రాధాన్యతనిచ్చే ‘తాతబడి’, ‘బాల వికాస భగవద్గీత’, ‘పిల్లల ప్రవర్తన మార్చే మేలిమి రథలు’, ‘చక్కిలిగింతలు పెట్టి చక్కని నీతి కథలు’ వంటి రచనలు చేశారు.

మాతృభాష పట్ల చొక్కాపుడు అమితమైన ప్రేమ, ఇష్టం వేదికల పైన ఆయన కార్యక్రమాలు, ప్రసంగాలు చూసినవారికి ఆ విషయం తెలుసు. ఆయన చేసే ప్రతి మాకు మాతృభాషలో ముడి పెట్టి, దాని గొప్పతనాన్ని పిల్లలకు తెలియజేయడంలో ఆయన మాస్టర్ కూడా. ఆయన రచనల్లోనూ అది కనిపిస్తుంది. ‘అక్షరాలతో ఆటలు-పదాలతో పదనిసలు పేరుతో ఆయన రాసిన 250 పుటల పుస్తకం ఆయన మాతృభాషా భక్తికి నిదర్శనం. వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు, సంస్థలతో చొక్కాపు అనుబంధం విడదీయలేనిది. అనేక కార్యక్రమాల నిర్వహణతో పాటు పిల్లల్లో తొలినాళ్ళ నుండే ఆత్మవిశ్వాసం పెరిగి, ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు అవసరమని భావించి ‘నీవు చేయగలవు’, ‘గోరింక గొప్ప’, ‘అరుపులో మెరుపు, తేలు చేసిన మేలు’ వంటి మేలిమి రచనలు చేశారు.

కొన్ని విషయాలను మనం విని నేర్చుకుంటాం. మరికొన్ని చూసి, అనుసరించి నేర్చుకుంటాం. ఇంకొన్ని విషయాలను చదివి నేర్చుకుంటాం. కానీ అనేక విషయాలు అనుభవపూర్వకంగా మనకు అర్థమవుతాయి. విజ్ఞాన శాస్త్రం ఈ కోవలోనిదే. హేతువు పట్ల పిల్లల్లో ఆలోచన కలిగించేలా చొక్కాపు రచనలు చేశారు. వాటిలో ‘గాలిలో గమ్మత్తు’, పిల్లల కోసం సైన్స్ కథలు’ వంటివి ఉన్నాయి. ఇవి సైన్స్ బోధిస్తున్నట్లు కాక ఒక్కో సూత్రాన్ని ఆధారం చేసుకుని, నిత్య జీవితానికి అన్వయిస్తూ రాశారు రచయిత స్థల పురాణ కథలు’, ‘చక్కనైన హైదరాబాద్’, ‘రోడ్డు దాటడం ఎలా? వంటి రచనలు చేసిన వెంకటరమణ ఆటపాటల గొప్పతనాన్ని తెలిపే పుస్తకాలు కూడా రాశారు. వ్యక్తి వికాసంలో, వ్యక్తిత్వ వికాసంలో మహనీయుల జీవితాలు, జీవిత చరిత్రల పాత్ర ఎంత గొప్పదో మనకు తెలుసు. హరిశ్చంద్రుని సత్యసంధత గాంధీని మహాత్మునిగా మలిచింది. ఈ కోవలోనే పిల్లల కోసం ప్రముఖుల జీవితాలను తన రచనలుగా మలిచారు. చొక్కాపు వెలుగు పాటలు’ అటువంటి గ్రంథమే.

Award receiving

ఇంద్రజాలం ద్వారా మూఢ నమ్మకాలపై అలుపెరుగని పోరాటం చేసి, పిల్లల్లో హేతువాద దృక్పథం పెంచేందుకు కృషిచేసిన చొక్కాపు ఆ దిశగా కేవలం ప్రదర్శనలు, కార్యక్రమాలతో సరిపెట్టలేదు. ‘హాం ఫటి, చంద్రుల కథలు’ పుస్తకాలు రాశారు. ఇరిహాసాలు, పురాణాలు, భారత, భాగవత, రామాయణాలు భారతీయ జీవన మూలాలలకు ఆధారాలు. వాటిని కూడా బాలల కోసం ఆసక్తికరంగా పరిచయం చేయడం తొక్కాపు చెల్లింది. వీరు రాసిన పురాణ పరిమళాలు’, దేవతల వాహనాల కథలు, త్రిమూర్తుల కథలు’ ఇటువంటివే. నిమిషానికి ఒక కథ చెప్పి, వంద నిమిషాల్లో వంద కథలు చెప్పి రికార్డు నెలకొల్పిన చొక్కాపు ఉపాధ్యాయుల కోసం క్లాస్ రూం స్టోరీ టెల్లింగ్ ఫర్ టీచర్స్’ పేరుతో కార్యశాలను కూడా నిర్వహించడం విశేషం. పిల్లలకు కథలు చెప్పే కళ పేరుతో పెద్ద పుస్తకాన్ని కూడా రాశారు. 1996లో నిర్వహించిన ‘ఆల్ ఇండియా నర్సరీ రైమ్స్’ కార్యశాలలో పాల్గొని ఆ సందర్భంగా రాసిన వాటిని పిల్లల కోసం పిల్లలు పాడుకునే చిట్టి పొట్టి పాటలు’ పేరుతో పుస్తకంగా తెచ్చారు. ‘పాటల పాటశాల’ వంటి రచనలు కూడా ప్రచురించారు. చరిత్రలో చిన్న కథలు’ వీరి చరిత్ర రచనా పుస్తకం. ఇవేతాళ నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా కోసం, ఇతర సంస్థల కోసం చాల సాహిత్యాన్ని అనువాదం కూడా చేశారు. బడి పూర్వదశ పిల్లలోకం, బడి పిల్లల కోసం, యువకుల కోసం రచనలు చేసిన చొక్కాపు వయోజనుల కోసం కూడా రాష్ట్ర వనరుల కేంద్రం కోసం రచనలు చేశారు. ‘లక్కు పిడతలు’ శీర్షికన వీరి అనేక వయోజన విద్యా పుస్తకాలు అచ్చయ్యాయి…

పిల్లలే నా ప్రపంచం” అని చాటి చెప్పి ఆ పిల్లల కోసం నిరంతరం చేసిన, చేస్తున్న కృషి చొక్కాప్పుడు అనేక పురస్కారాలు, అవార్డులు వచ్చాయి. వాటిలో డా.నన్నపనేని మంగాదేవి బాల సాహిత్య పురస్కారం, సమతారావు పురస్కారం, చక్రపాణి-కొలసాని పురస్కారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాతృభాషా పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు, డా.రామినేని విశిష్ట పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలం కీర్తి పురస్కారం (ఇంద్రజాలం), సాహిత్య పురస్కారం వంటివి ఉన్నాయి. చాల సాహిత్యం, బాలలే తన లోకంగా జీవించే చొక్కాపు వెంకటరమణకు జేజేలు.

పత్తిపాక మోహన్

SA: