సెప్టెంబర్ 8న సినీ మహోత్సవం

తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ సినీ మహోత్సవం..
రథసారథుల రజతోత్సవం సెప్టెంబర్ 8న హైదరాబాద్ గచ్చిబోలి ఇండోర్ స్టేడియంలో అంగ‌రంగ వైభ‌వంగా జరగనుంది. ప్రొడక్షన్ మేనేజర్లంద‌రూ కలిసి చేస్తున్న ఈ సిల్వర్ జూబ్లీ ఈవెంట్ కర్టన్ రైజర్ ఈవెంట్ ప్రెస్‌మీట్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి క‌ళాబంధు టి. సుబ్బిరామి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సినీ ప్ర‌ముఖ‌లంద‌రూ ఈ వేడుక‌లో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా … క‌ళాబంధు టి.సుబ్బ‌రామి రెడ్డి మాట్లాడుతూ “హైదరాబాద్ నగరంలో సినీ ఆర్టిస్ట్‌లంద‌రూ క‌లిసి చాలా కాలం అయ్యింది. చాలా గ్యాప్ తరువాత ప్రొడక్షన్ మేనేజర్లు కలిసి సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసుకోవడం సంతోషంగా ఉంది. సెప్టెంబర్ 8న జరగబోయే ఈ ఫంక్షన్ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ ఈవెంట్ కు సపోర్ట్ చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు“ అన్నారు.

ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్స్ యూనియ‌న్ ప్రెసిడెంట్ అమ్మిరాజు మాట్లాడుతూ “మేం చేస్తున్న ప్ర‌య‌త్నానికి స‌హ‌క‌రిస్తున్న అంద‌రికీ ధన్యవాదాలు. కార్య‌క్ర‌మంలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే పెద్ద మనసుతో క్షమించాలి. స‌పోర్ట్ చేస్తోన్న జెమినీ కిర‌ణ్‌గానిరి థ్యాంక్స్‌. రు బాగా సపోర్ట్ చేస్తున్నారు, వారికి థాంక్స్. సుబ్బిరామి రెడ్డి గారు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. పేరు పేరున ఈ ఈవెంట్ సక్సెస్ చేసిన వారందరికి థాంక్స్ తెలుపుతున్నాను. సెప్టెంబర్ 8న జరగబోయే ఈ ఫంక్షన్‌కు ఇలాగే అందరి సహకారం కావాలని కోరుకుంటున్నాను“ అన్నారు.

మా వైస్ ప్రెసిడెంట్ డా. రాజశేఖర్ మాట్లాడుతూ “మేనేజర్లకు నేను ఎప్పుడు థాంక్స్ చెబుతాను. వారు లేనిది నేను లేను. వారందరూ కలిసి చేస్తున్న ఈ ఫంక్షన్ పెద్ద సక్సెస్ అవ్వాలి. అందుకోసం నేను నా వంతు కృషి చేస్తాను. మేనేజర్లు కలిసి ఎన్నో ఈవెంట్స్ సక్సెస్ చేశారు వారు చేస్తున్న ఈ ఈవెంట్ కు మనం ఖచ్చితంగా సపోర్ట్ చెయ్యాలి“అని తెలిపారు.

`మా` అధ్య‌క్షుడు వి.కె.నరేష్ మాట్లాడుతూ “చెన్నైలో ఇండస్ట్రీ హైదరాబాద్ తరలి వస్తున్న సమయంలో సినిమా పరిశ్రమ అభివృద్ధిలో ప్రొడక్షన్ మేనేజర్లు బాగా సహకరించారు, వారి సహాయ సహకారాలు మరువలేనిది. నిర్మాత అమ్మిరాజుగారు వారి టీమ్ ఆ సమయంలో బాగా కృషి చేసింది. సెప్టెంబర్ 8న రథసారధుల రథోత్సవం పెద్ద సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను“ అన్నారు.

శివ బాలాజీ మాట్లాడుతూ “ప్రొడక్షన్ మేనేజర్లు సినిమాకు బాగా బాగా హెల్ప్ అవుతారు, నేను ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆ విషయం నాకు తెలిసింది. అమ్మిరాజు గారు చేస్తున్న ఈ సినీ సారథుల రథోత్సవం ఫంక్షన్ గ్రాండ్ స‌క్సెస్ కావాలి“ అన్నారు.
హేమ మాట్లాడుతూ “ప్రొడక్షన్ మేనేజర్లు కలిసి చేస్తున్న ఈ ఈవెంట్ సక్సెస్ అవుతుంది. నేను నటిగా నిలబడడానికి మేనేజర్లు కారణం. వారు నాకు చిన్నా, పెద్దా అన్ని రకాల పాత్రలు చెయ్యమని చెప్పేవారు. ఈరోజు సినీ మహోత్సవం కర్ట‌న్ రైజర్ ఈవెంట్‌కు వచ్చి నా గత అనుభవాలు మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది“ అన్నారు.

రాజీవ్ కనకాల మాట్లాడుతూ “మేము ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి మేనేజర్ల కృషి ఎంతో ఉంది. ఈ ఫంక్షన్‌కు సినీ పరిశ్రమలోని అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మా అసోసియేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. అమ్మిరాజు గారు చేస్తున్న ఈ కార్యక్రమం పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న అన్నారు.

ఆర్టిస్ట్ రఘు మాట్లాడుతూ “ నేను మేనేజర్ల సహకారంతోనే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. అమ్మిరాజు గారు చేస్తున్న ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్రాను“ అన్నారు.

వెన్నెల కిషోర్ మాట్లాడుతూ “నాకు షూటింగ్ స‌మ‌యంలో, షూటింగ్ త‌ర్వాత సహకరిస్తున్న మేనేజర్స్‌కు ధన్యవాదాలు. సెప్టెంబర్ 8న జరగబోయే ఈ ఈవెంట్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఆర్టిస్ట్ సక్సెస్ అవ్వడానికి మేనేజర్ కష్టం చాలా ఉంటుంది. వారు చేస్తున్న ఈ ఫంక్షన్ కు మా సపోర్ట్ ఎపుడూ ఉంటుంది“ అన్నారు.

నిర్మాత అశోక్ మాట్లాడుతూ “ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్‌ సినిమా నిర్మాణంలో కీలక పాత్ర పోషించేవారు. సినిమాకు కావాల్సిన అనేక పనులు వారు చేసేవారు. నిర్మాతకు చేదోడు వాదోడుగా ఉండేవారు. వారు చేస్తున్న ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను. అమ్మిరాజుగారికి నిర్మాతల కష్టాలు తెలుసు అతను చేస్తున్న ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలి“ అన్నారు.

నిర్మాత ఎమ్.ఎల్.కుమార్ చౌదరి మాట్లాడుతూ “నేను చేస్తున్న అన్ని సినిమాలకు ఒకే మేనేజర్ ను పెట్టుకోవడం జరిగింది. నా సినిమా సక్సెస్ ప్లాప్‌కు సంభంధం లేకుండా వారు క‌లిసి పని చేశారు. ఎన్నో ఫంక్షన్స్ మేనేజర్లు కలిసి సక్సెస్ చేశారు. కానీ వారు చేస్తున్న ఈ ఫంక్షన్ కు మేము దగ్గరుండి సక్సెస్ చేస్తామని తెలియజేస్తున్నాను“ అన్నారు.

ఉత్తేజ్ మాట్లాడుతూ “ప్ర‌కృతి బ్రతకడానికి సూర్యుడు ఎంత ముఖ్యమో, సినిమా విజయవంతంగా పూర్తి అవ్వడానికి మేనేజర్స్ అంతే ముఖ్యం. నేను ఫస్ట్ టైమ్ ఫ్లైట్ ఎక్కడానికి, ట్రైన్ ఎక్కడానికి ఇండస్ట్రీలో అన్నం తినడానికి కారణం మేనేజర్స్. సో వారు చేస్తున్న ఈ ఈవెంట్ సక్సెస్ అవ్వాలి“ అన్నారు.

డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ “ప్రొడక్షన్ మేనేజర్స్‌ను సరిగ్గా గుర్తించరు కానీ సినిమా మేకింగ్‌లో వారి కృషి చాలా ఉంటుంది. అలాంటి వారు చేస్తున్న ఈ ఈవెంట్ పెద్ద సక్సెస్ అవ్వాలి“ అన్నారు.

సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ “నా సినిమాలు సక్సెస్ అవ్వడానికి మేనేజర్ల కృషి ఉంది. వారందరికీ ధన్యవాదాలు. మేము ఎప్పటికి మేనేజర్ల వెంటే ఉంటాం“ అన్నారు.

సి. కళ్యాణ్ మాట్లాడుతూ “ఈరోజు తెలుగు పరిశ్రమ మొత్తం కలిసి చేస్తున్న ఈ ఫంక్షన్ పెద్ద సక్సెస్ అవ్వాలి. మా మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ దీనికి సపోర్ట్ చేస్తుంది. మేనేజరు లేనిది సినిమా నిర్మాణం సంపూర్ణం కాదు. అలాంటి వారు చేస్తున్న ఈ కార్యక్రమం పెద్ద విజయం కావాలని కోరుకుందాం. ప్రతి ఆర్టిస్ట్, నిర్మాత దీనికి సహకరించాలి,రావాలి. జెమినీ టీవీ వారు ఈ కార్యక్రమం చెయ్యడానికి ముందుకు వచ్చారు, వారికి థాంక్స్“ అన్నారు.
బొమ్మరిల్లు భాస్కర్ మాట్లాడుతూ “నేను తీసిన సినిమాల్లో అనేక కష్టాలు ఎదురయ్యాయి. ఆ సమయంలో మేనేజర్స్ సహాయ సహకారాలు మర్చిపోలేనివి. వారు చేస్తున్న ఈ ఫంక్షన్ కు మేము అందరం వచ్చి సక్సెస్ చేస్తాం“ అన్నారు.

హీరోయిన్ ప్రగ్యా జస్వాల్ మాట్లాడుతూ “ప్రొడక్షన్ మేనేజర్ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసుకోవడం ఆనందంగా ఉంది. ఈ ఈవెంట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను“ అన్నారు

అల్లరి నరేష్ మాట్లాడుతూ “మేనేజర్స్‌తో నాకు మంచి మెమొరీస్ ఉన్నాయి. సినిమాను ముందుండి నడిపించేవారు మేనేజర్లు. వీరందరూ కలిసి చేస్తున్న ఈ ఈవెంట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను“ అన్నారు. హీరోయిన్ రెజీనా మాట్లాడుతూ “నా కెరీర్ లో నన్ను ఎంతోమంది సపోర్ట్ చేస్తూ వస్తున్నారు వారందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సినీ మహోత్సవం పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను“ అన్నారు.

సందీప్ కిషన్ మాట్లాడుతూ “మేనేజర్స్ మమ్మల్ని మేనేజ్ చేస్తారు. వారి దగ్గరి నుండి నేను చాలా నేర్చుకున్నాను. నాకు నా మేనేజర్స్ బిగినింగ్ నుండి బాగా సపోర్ట్ చేస్తున్నారు. వారు చేస్తున్న ఈ కార్యక్రమంలో నేను భాగం కావ‌డం సంతోషంగా ఉంది“ అన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap