శ్రామిక ఉత్సవ్‌లో కార్టూన్ పోటీలు

శ్రామిక ఉత్సవ్‌లో ప్రదర్శన కోసం కార్టూన్ పోటీలు పోస్టర్ విడుదల
విశాఖపట్నంలో జరుగుతున్న సి.ఐ.టి.యు మహాసభల సందర్భంగా 2025 డిసెంబరు 27 నుండి 2 జనవరి 2026 వరకు శ్రామిక ఉత్సవ్ లో కార్టూన్ల ప్రదర్శన వుంటుంది. దీనికోసమై స్పాట్ కార్టూన్ల పోటీని విశాఖపట్నం లో డిసెంబరు 21 ఉదయం 10 గంటలకు అల్లూరి సీతారామరాజు విజన కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి గల కార్టూనిస్టులందరూ 10 సం నుండి 80 సం వయసు వరకు పాల్గొనవచ్చు. ముందే తెలిపిన టాపిక్ ల మీద కార్టూన్ ఐడియా లు ఆలోచించుకుని వచ్చి ఆ రోజు నిర్వాహకులు ఇచ్చిన పేపర్ మీద, తెచ్చుకున్న పెన్. పెన్సిల్, కలర్స్ తో ఎన్ని కార్టూన్లన్నా వేయొచ్చు. అన్ని టాపిక్ ల మీద కూడా అయితే వారిచ్చిన రెండు గంటల సమయంలోగా వేసి ఇవ్వాలి.

పోటీ అంశాలు (సృజనాత్మక వ్యంగ్యం తప్పకుండా ఉండాలి)

  1. శ్రామికుల డిజిటల్ యుగం సవాళ్లు
  2. మహిళా శ్రామికుల సాధికారత
  3. యువత ఉద్యోగాలు: కలలు vs. వాస్తవాలు
  4. గిగ్ ఎకానమీ: కార్మికులు
  5. శ్రామిక యూనియన్లు కార్పొరేట్ కంపెనీలు
  6. క్లైమేట్ చేంజ్: లేబర్ మార్కెట్ పై ప్రభావం
  7. ఆర్థిక అభివృద్ధిలో శ్రామికులు
  8. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ
  9. మత సామరస్యం-ఐక్యత.
    పాల్గొన్న అందరికీ సర్టిఫికెట్స్ ఇవ్వబడును. జూనియర్స్, సీనియర్స్, సూపర్ సీనియర్స్ కేటగిరీలలో వేసిన కార్టూన్లలో ఉత్తమమైన వాటికి బహుమతులుంటాయి.

బహుమతులను శ్రామిక ఉత్సవ్ లో డిసెంబరు 28 న సాయంత్రం 4 గంటలకు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. బాగా సీనియర్ కార్టూనిస్టులు, ఇతర ప్రాంతాల వారు, అక్కడికి రాలేని వారు ఈ టాపిక్ ల మీద రెండు కార్టూన్లను వేసి ఇమెయిల్ కి ramadevikvizag@gmail.com పంపించగలరు. వీటిని ప్రదర్శనలో పెడతారు. కాబట్టి A3 సైజ్ లో కలర్ లో jpg ఫార్మాట్ లో వేసి ఇమెయిల్ లో 24- 12-2025 లోగా పంపించాలి. వీటిలో ఎంపిక చేసిన ఉత్తమ కార్టూన్ల కు బహుమతులు ఉంటాయి. వచ్చిన వాటిని ప్రదర్శనలో ఉంచడం జరుగుతుంది. అయితే ప్రకటన లో ఇచ్చిన 9 టాపిక్ లలో దేనిమీదయిన వేయవచ్చును. ఇతర వివరాల కోసం 9866084124, 9247783307, 9492348428 సంప్రదించండి. ఈ కార్యక్రమంలో పీ.వి.రామశర్మ, కె. రాంబాబు, కార్టూన్ అసోసియేషన్, మాధవి జగన్మోహన్, ఎస్.రజని, ఎం. రాహుల్, బాల బయన్న పాల్గొన్నారు.

Share via
Copy link
Powered by Social Snap