ఒక నర్తకి జీవితమే ‘నాట్యం ‘ సినిమా

ఈ నెల 22న శుక్రవారం విడుదల అవుతున్న నాట్యం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవుతున్న ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి “సంధ్యారాజు”.

తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ మందికి తెలుసు ఆమె ఒక మంచి కూచిపూడి నృత్యకారణి అని, తెలియని వారికి నాట్యం సినిమా ద్వారాపరిచయమవుతున్న నూతన హీరోయిన్.

ఈ కూచిపూడి నృత్యకారిణి బ్యాక్ గ్రౌండ్ గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యానికి గురి అవుతారు! ఆమె ఒక గొప్పింటి అమ్మాయి, మరో గొప్పింటి కోడలు పిల్ల…

సంధ్యారాజు హీరోయిన్ గా పరిచయం అవుతున్న నాట్యం సినిమా టీజర్ ను ఈ మధ్యన యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేయడం…
అలాగే సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి రామ్ చరణ్ ముఖ్య అతిధిగా రావడంతో అసలు ఈ సంధ్యారాజు.

ఎవరు? అనే ప్రశ్న చాలామందిలో తలెత్తే ఉంటుంది… అలాంటి వారి కోసం సంధ్యారాజు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు…

ప్రముఖ వ్యాపారవేత్త రామ్ కో గ్రూప్ చైర్మన్ పి.ఆర్.వెంకట్రామరాజాగారి కుమార్తె ఈ సంధ్యారాజు. అలాగే సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకులు బి.రామలింగరాజు గారి చిన్న కోడలే సంధ్యారాజు. (రామలింగరాజు గారి రెండో కుమారుడు రామరాజును సంధ్యారాజు 2007లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక బాబు వున్నాడు.)

సంధ్యారాజు కూచిపూడి డాన్సర్ గానే చాలామందికి తెలుసు. ఎందుకంటే ఈ కూచిపూడి ద్వారానే ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. కళాప్రపూర్ణ వెంపటి చిన సత్యం గారు సంధ్యారాజుకి కూచిపూడి నృత్యంలో గురువు.

సంధ్యారాజు నర్తించిన కృష్ణశబ్దం అనే వీడియో కు యూట్యూబ్ లో ఒక మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఒక కూచిపూడి నర్తకి వీడియోకి ఈ స్థాయిలో వ్యూస్ రావడం దేశంలోనే ప్రప్రథమం.

కూచిపూడి డాన్సర్ గానే కాకుండా టాలీవుడ్ లో కాస్ట్యూమ్స్ డిజైనర్ గా, ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేసిన సంధ్యారాజు… రెండు మూడు షార్ట్ ఫిలంస్ లో కూడా నటించారు. ఇప్పుడు తనలోని నటిని కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు.

కొత్త దర్శకుడు రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో రూపొందిన నాట్యం లో సంధ్యారాజు ప్రధానపాత్ర పోషించారు…

టైటిల్ కు తగ్గట్టుగానే ఇది శాస్త్రీయ నృత్యం నేపథ్యంలో సాగే సినిమా అయితే ఈ సినిమాలో కేవలం నృత్యం మాత్రమే ఉండదని… అంతకు మించిన బంధాలు, భావోద్వేగాలు ఉంటాయని చెప్పారు. ఒక విద్యార్థినికి, గురువుకి మధ్య ఉన్న అందమైన అనుబంధం…నర్తకి కావాలనే ఆమె తపన ఎదురైన అడ్డంకులు ఈ సినిమాలో చూపించామని సంధ్యారాజు చెప్పారు…

శాస్త్రీయ నృత్యం నేపథ్యంలో వచ్చిన సాగర్ సంగమం, స్వర్ణకమలం సినిమాల తర్వాత ‘నాట్యం సినిమా’… ఈ నెల 22వ తేది(శుక్రవారం) నాడు థియేటర్లోకి వచ్చింది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap