‘కలర్స్ ఆఫ్ నెల్లూరు’ పేరుతో నెల్లూరుకు చెందిన 5 గురు చిత్రకారులు కలసి గ్రూప్ షో నిర్వహించారు. ఈ ప్రదర్శనలో చిత్రకారులు షేక్ అమీర్ జాన్, ఎన్. అన్నపూర్ణ, రమణ పేరం, సునీత రవి, సుందర బాబు పాల్గొన్నారు.
ఈ ప్రదర్శనను నెల్లూరు జిల్లా విద్యా శాఖాధికారి పి.రమేష్ గారు, అమరావతి కృష్ణా రెడ్డిగారు, శుభమస్తు భయ్య వాసు గారు నెల్లూరు టౌన్ హాల్ లో అక్టోబర్ 6వ తేదీన ప్రారంభించారు.
శ్రీమతి అన్నపూర్ణ గారు తంజావూరు శైలి చిత్రాలతో పాటు నైరూప్య చిత్రాలు, అమీర్ జాన్ ఉదయగిరి దుర్గం, లాండ్ స్కేప్స్, రమణ పేరం పౌరాణిక, ఐతిహాసిక చిత్రాలు, శ్రీమతి సునీత రవిగారు 3డి చిత్రాలు, సుందర బాబు పోట్రైట్స్, మోడరన్ చిత్రాలు ఈ ప్రదర్శనలో సందర్శకులను ఆకర్షించాయి.
ఈ ప్రదర్శన నాలుగు రోజుల పాటు విజయవంతంగా జరిగింది.