తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరియు రాజీ రాజ్ మీడియా హౌస్ సంయుక్త ఆద్వర్యం లో కరోనా మహమ్మారి పై కార్టూనుల పోటీ, కార్టూనుల ప్రదర్శన మరియు పుస్తక ప్రచురణ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, రాజీ రాజ్ మీడియా హౌస్ ప్రతినిధి కళ్యాణం శ్రీనివాస్ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ప్రజలను చైతన్య పరిచే కార్టూన్ లను ఎంపిక చేసి ఒక సంకలనం తీసుకురావడం తో పాటు, ఉత్తమ కార్టూన్ లకు ప్రైజ్ మెనీ సాంస్కృతిక శాఖ ఇవ్వనున్నట్లు వారు తెలియజేశారు. మొదటి బహుమతి 5000 రూపాయలు, రెండవ బహుమతి 4000 రూపాయలు, మూడవ బహుమతి 3000 రూపాయలు, ఐదు ప్రోత్సాహక బహుమతులు 2000 రూపాయల చొప్పున ఇవ్వనున్నారు. అంతే కాకుండా ప్రతి ఒక్కరికి ప్రశంశా పత్రాలు కూడా అందజేయనున్నట్లు వారు వివరించారు. అలాగే వీలైతే ఇట్టి కార్టూనులను ఎక్సిబిషన్ కూడా నిర్వహించనున్నట్లు తెలియజేశారు.
తమ కార్టూనులు జూన్ నెల 6 వ తేదీ లోపు cartooncarona@gmail.com అనే మెయిల్ కు పంపించాలి అని వారు తెలియజేశారు. అవసరమైతే సవరణలు, సలహాలు సూచిస్తే అంగీకరించి సరిచేసి తిరిగి పంపించాల్సి ఉంటుంది.
వెడల్పు – 96 mm, ఎత్తు- 48 mm, 300 DPI లో బ్లాక్ అండ్ వైట్ ప్రింటింగ్ కి సపోర్ట్ చేసేట్లు కలర్లో చిత్రించి పంపించాలి. బ్లాక్ అండ్ వైట్ ప్రింటింగ్ కి సపోర్ట్ చేసేట్లు లైట్ కలర్స్ వాడాలని సూచన. రంగుల్లో పంపిన కార్టూనులు మాత్రమే ప్రదర్శనకు తీసుకోబడతాయి. కరోనా పై ప్రజల్లో చైతన్యం, బాధ్యత గల రంగాలకు కనివిప్పు కలిగిస్తూ మంచి హ్యూమర్ ఉన్న కార్టూనులు మాత్రమే సంకలనంలోకి అర్హత పొందుతాయి. భయాందోళనలు గురిచేసేట్లు లేదా ఒక వ్యక్తి ని, ఒక సమూహాన్ని, ఒక వ్యవస్థను కానీ కించపరిచే లేదా అవహేళన చేసే కార్టూనులు తిరస్కరించబడుతాయి. ఒక్కొక్కరు ఒక్కటి లేదా మూడు కార్టూనులు పంపుకోవచ్చు . విధిగా పూర్తి పేరు, మొబైల్ నెంబర్, ఫోటో పంపించాలి. పూర్తి వివరాలకు 9346273799 అనే నంబర్ కు సంప్రదించగలరు.
పై విధంగా మీ ఫోటో, పేరు, మొబైల్ నం., మరియు కార్టూన్ కంపోజ్ చేయబడుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని మీ మీ కార్టూన్లు డ్రా చేసి పంపించగలరు.