కరోనా కార్టూన్లతో వీడియో డాక్యుమెంటరీ..

కరోనా కార్టూన్లతో వీడియో ఆవిష్కరణ…

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిపై మన తెలుగు కార్టూనిస్టులు అందరూ చాలా చక్కటి కార్టూన్లు గీస్తున్నారు. వీటన్నిటిని ఒక చోట చేర్చి ఒక వీడియో రూపొందిస్తే ఎలా వుంటుందో చేసి చూపించారు తెలంగాణ కార్టూనిస్టుల సంక్షేమ సంఘం వారు. ఈ వీడియో కరోనా విషయంలో ప్రజల్ని చైతన్యవంతులను చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వీడియోను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర బీ.సీ. కమిషన్ చైర్మన్ శ్రీ బీయస్ రాములు అన్నారు. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్ గారి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు శ్రీ కేవీ రమణాచారి గారి, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ గారి అమూల్యమైన వీడియో సందేశాలను చేర్చటం అభినందిచ దగ్గ ప్రయత్నం.
తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ కార్టూనిస్టుల సంక్షేమ సంఘం వారు మంచి ప్రయత్నం చేసారు.

క్రింది వీడియో కార్టూన్లు చూడండి….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap