కరోనా కష్టాలు – కార్టూన్ నవ్వులు

కార్టూన్ అంతర్జాతీయ భాష, ఏదేశం వారికైనా, ఏభాష వారికైనా కార్టూన్ (కాప్షన్లెస్) అర్ధం అవుతుంది. రాత – గీతల దృశ్య చిత్రమే కార్టూన్. మిగతా చిత్రాలలాగే కార్టూన్ కూడా ఆలోచింపజేస్తుంది. ఆశ్చర్య పరుస్తుంది. ఆవేదన చెందేలా చేస్తుంది. తీర్వ ఉద్విగ్న సన్నివేశాన్నయినా హాస్యస్పోరకంగా అందించి జీవితంలోని హాస్యకోణాన్ని ఆవిష్కరిస్తుంది. “జీవితం-లాంగ్ షాట్లో కామెడి, క్లోజ్ షాట్లో ట్రాజెడీ ” అని చార్లీ చాప్లిన్ చెప్పినట్లు ” కార్టూన్ – రాతగీతల్లో కామెడి, విషయ వస్తువులో ట్రాజెడీ ” అనుకోవాలి.

గ్లోబలైజేషన్ ప్రభావంతో దేశాల సరిహద్దులు చెరిగిపోయి ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోయింది. దీని వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని సంబరపడుతున్న వేళ, నష్టమెంతుందో ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాం.
కరోనా తో గత పదిరోజులుగా లాక్ డౌన్లో వున్న మనం ప్రతిక్షణం అందోలనతో గడుపుతున్నాం. ఇలాంటి సమయంలో ఉపయోగపడుతుందనేమో ముళ్ళపూడి వారు ఇలా రాసారు….  ” మనిషన్నాక కూసింత కళాపోషణ వుండాలి, లేకపోతే మనిషికి గొడ్డికి తేడా యాటుంటది ” అని. అవును మనం మనుషులం… కష్టాల్లో కూడా మనసును తేలికపరచుకోవడానికి మనసారా నవ్వుకోవడం తప్ప మరోక మార్గమేముంది. అందుకనే మన కార్టూనిస్ట్ మిత్రులు కరోనా మహమ్మారిపై అటు ఫేస్బుక్లోనూ, ఇటు వాట్సాప్ లోనూ ఎన్నో కార్టూన్లు గీసి కేవలం వినోదపరచడమే కాకుండా ఆలోచింపచేస్తున్నారు.
వీరిలో సర్వశ్రీ జయదేవ్ బాబు, సరసి, శర్మ, రాజు, కృష్ణ, పైడి శ్రీనివాస్, అత్తలూరి, ఆకుండి సాయిరాం, పద్మ, నర్సిం, మృత్యుంజయ, గోపాలకృష్ణ, నాగిశెట్టి, వెంటపల్లి, వర్చస్వి, సాయిరాం, మోహన్ కుమార్, నాగ్రాజ్, వందన శ్రీనివాస్, వినోద్, పులిపాక, పెండేల, హరికృష్ణ, ఎం.రాము, ప్రసాద్ కాజ, రాంమోహన్, యువరాజ్, నూకాపతి, బుజ్జి తదితరులు గీసిన కార్టూన్లు ఇక్కడ ఇస్తున్నాం. చూసి నవ్వుకోండి….

 

1 thought on “కరోనా కష్టాలు – కార్టూన్ నవ్వులు

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap