తెలుగు సాహిత్యంలో ‘కరోనా’ కల్లోలం

‘కరోనా’ సాహిత్యం: కథ / కవిత / నవల / వ్యాసం తదితర వివరాల కోసం ప్రకటన

‘తెలుగు సాహిత్యంలో కరోనా కల్లోలం’ అనే అంశంపై కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ వారి నుండి సీనియర్ ఫెలోషిప్ కు ఎన్నికై, పరిశోధన చేస్తున్న కవి, రచయిత, పత్రికా సంపాదకుడు చలపాక ప్రకాష్ సాహితీమిత్రులకు సుపరిచితులే. అయితే ఈ అంశంపై ఆయనిప్పటికే కొన్ని పుస్తకాలను సేకరించి వున్నారు. ఆయన దృష్టికి రాని అనేక రచనలు ఉండివుండవచ్చు. ‘కరోనా’ విషమ కాలాన్ని రికార్డు పరిచి భవిష్యత్ తరాలకు అందించాలనే వారి లక్ష్యంతో కృషి చేస్తున్నారు కనుక దయచేసి కరోనా అంశంగా వివిధ పత్రికలలో మీరు రాసిన, మీరు చదివిన, మీ దృష్టికి వచ్చిన కథ/కవిత/నవల/వ్యాసం, ప్రత్యేక సంపుటాలు, సంకలనాలు తదితర వివరాలను చలపాక ప్రకాష్ గారి 9247475975 వాట్సాప్ నెంబరుకు తెలియచేయవలసిందిగా సాహితీవేత్తలందరినీ కోరుతున్నారు.

SA: