కృష్ణ జిల్లా కలెక్టర్ కు-కరోన వారియర్ అవార్డ్

విశ్వగురు అంతర్జాతీయ కరోన వారియర్ అవార్డ్ – కృష్ణ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజెస్ట్రేట్ ఎ.యమ్.డి ఇంతియాజ్ గారికి ప్రధానం చేసిన సత్యవోలు రాంబాబు.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంక్లిష్ట సమయంలో కలెక్టర్ ఇంతియాజ్ కృష్ణ జిల్లా వారికి ఆ జిల్లాలో ఉన్న ప్రజలకు, వలస కార్మికులకు, కరోనా బాధితులకు కరోనా కుటుంబాలకు వారు అందించిన సేవలను గుర్తించి హైదరాబాదుకు చెందిన విశ్వ గురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ కరోనా వారియర్ అంతర్జాతీయ అవార్డు శనివారం సాయంత్రం విజయవాడలో ఉన్న కలెక్టర్ గారి కేంపు కార్యాలయంలో అందించడం జరిగింది అవార్డును ఆ సంస్థ ఫౌండర్ మరియు సి.ఎం.డి రాంబాబు మరియు ఆ సంస్థ కమిటీ సభ్యులు యాదయ్య గౌడ్, సుందరపల్లి గోపాలకృష్ణ కృష్ణా జిల్లా కో- ఆర్డినేటర్ కళ్యాణి కలసి అందించారు.

కరోన విపత్కర పరిస్థితులలో జిల్లా ప్రజాప్రతినిధులను, జిల్లా అధికారులను, ప్రజలను సమన్వయంతో చైతన్య పరుస్తూ వారిలో తాను మమేకమై క్షేత్రస్థాయిలో పర్యటించి కరోనా బాధితులకు, వారి కుటుంబాలకు ఆపద సమయంలో నేనున్నానని వారికి మనోధైర్యం కల్పించి సేవలందించడం వలన ఈ అవార్డును అందించడం జరిగిందని సత్యవోలు రాంబాబు తెలిపారు. కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ ఈ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉందని నన్ను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు విశ్వగురు సంస్థకు ధన్యవాదములు తెలిపినారు ఈ అవార్డ్ ను పొందినందుకు ప్రజలకు మరింత సేవ చేయడానికి పునరంకితం అవుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డి ఆర్.డి.ఇ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు శ్రీధర్ సుధీర్ రమణ సురేష్ మరియు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link