విజయవాడలో ‘జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు’

నవంబర్ 22 నుంచి విజయవాడలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సహకారంతో మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ ఆధ్వర్యంలో విజయవాడలో రెండు రోజులపాటు జాతీయ సాంస్కృతికోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ కలిమిశ్రీ తెలిపారు. నవంబర్ 22, 23 తేదీలలో సాహిత్య సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచంలోని తెలుగు వారంతా ఉచితంగా పాల్గొనవచ్చని ఆహ్వానిస్తున్నారు.

ప్రత్యేక సాహితీ సదస్సులు, కవి సమ్మేళనాలు, పుస్తకావిష్కరణలు, కవులు, రచయితలు, కళాకారులకు ప్రత్యేక సత్కారాలు, నృత్య ప్రదర్శనలు, మినీ స్కిట్స్, ఏకపాత్రాభినయాలు తదితర కార్యక్రమాల రూపకల్పన జరుగుతోంది. ఆసక్తిగల వారు ముందస్తు పేర్లు నమోదు చేసుకోవాలి. నచ్చిన కవితలు చదవొచ్చు! పద్యం, గేయం గజల్స్ పాడవచ్చు! సత్కారం అందుకోవచ్చు! సమకాలీన అంశాలపై మాత్రమే ఉండాలి. ముందస్తు అనుమతి తప్పనిసరి.

నాలుగు నిముషాలు మించని స్కిట్స్ ప్రదర్శించవచ్చు. ఏకపాత్రాభినయాలు చేయవచ్చు. ఈలపాటలు, పల్లె పాటలు పాడవచ్చు. అయితే రాత ప్రతులను ముందుగా నిర్వాహకులకు పంపించాలి. వివాదాలకు, విమర్శలకు తావు లేదు. ఆసక్తిగల వారు కవితను లేదా ప్రదర్శనకు సంబంధించిన అంశంతో పాటు బయోడేటా కూడా ముందుగా పంపించాలని మల్లెతీగ పత్రిక సంపాదకులు కలిమిశ్రీ వివరించారు.

ఎంపికైన వారి వివరాలను నవంబర్ 1వ తేదీ ప్రకటిస్తారు. ఎవరి ప్రయాణ ఏర్పాట్లు వారు చేసుకోవచ్చు. నిర్వాహకులు వేదిక మాత్రమే కల్పిస్తారు. సత్కరించి ప్రోత్సహిస్తారు. ఉత్సవాలు తిలకించాలనుకునే వారు నేరుగా ఉచితంగా పాల్గొనవచ్చు.

మల్లెతీగ కథలు, కవితల పోటీ మొత్తం 75,000/- నగదు బహుమతులు

మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ నిర్వహణలో కథలు, కవితల పోటీ నిర్వహిస్తున్నారు. ఈ పోటీకి సమకాలీన సామాజిక సమస్యల్ని, మానవతా విలువల్ని స్పృశిస్తూ, తెలుగువారి జీవన సంస్కృతిని ప్రతిబింబించే భిన్నమైన కథల్ని, కవితల్ని ఆహ్వానిస్తున్నారు. తెలుగు కవులు, రచయితలందరూ ఈ పోటీలో పాల్గొనవచ్చు. కథలు, కవితలు డీటీపీ చేసి లేదా యూనికోడ్ ఫాంట్ లో పంపించాలి. రాత ప్రతులు పరిశీలించబడవు. కథలు 3 నుండి 5 పేజీలకు, కవితలు నలభై లైన్లకు మించకూడదు.

ఉత్తమ కథకు రూ.5,000/- చొప్పున 8 ఉత్తమ కథలు, రూ. 1,000/-ల చొప్పున 10 కన్సొలేషన్ కథలను, ఉత్తమ కవితకు రూ.2,500/-ల చొప్పున 8 ఉత్తమ కవితలు, రూ.500/- ల చొప్పున 10 కన్సొలేషన్ కవితలను ఎంపిక చేస్తారు.

కథలు, కవితలు అక్టోబరు 15వ తేదీలోగా malleteega.sss@gmail.com ఈమెయిల్ కు పంపించాలి.

కార్టూన్ల పోటీలు:

పర్యావరణం, సోషల్ మీడియా, ధూమపానం, డ్రగ్స్ అంశాలపై కార్టూన్ల పోటీలు నిర్వహిస్తున్నారు.
కార్టూన్లు A 4 సైజు లో ఉండాలి. 300 డి.పి.ఐ. లో స్కాన్ చేసి పంపాలి. కలర్ లేదా బ్లాక్ & వైట్లో పంపవచ్చు.

పోటీలో ఎంపికైన కార్టూన్లను జాతీయ సాంస్కృతిక ఉత్సవాల సందర్భంగా వెలువడే ప్రత్యేక సంచికలో గానీ, నవమల్లెతీగ మాసపత్రికలో గానీ ప్రచురణకు స్వీకరించేందుకు వీలుగా మీ అంగీకారం తెలియజేయాలి.
ఒక్కొక్కరూ 4 కార్టూన్ల వరకు పంపవచ్చు. కార్టూన్లు ప్రకటనలో ఇచ్చిన ఈమెయిల్ కు మాత్రమే పంపాలి. వాట్సప్ లో వచ్చిన కార్టూన్లు పరిశీలించబడవు.
జాతీయ సాంస్కృతిక ఉత్సవాల వేదికపై నగదు బహుమతితో పాటు కార్టూనిస్టుకు సత్కారం వుంటుంది. పది బెస్ట్ కార్టూన్లకు ఒక్కొక్కరికి 2500 రూపాయలు మొత్తం 25 వేల రూపాయల నగదు బహుమతులు అందిస్తారు. కార్టూన్లు చేరేందుకు అఖరు తేదీ 15 అక్టోబర్ 2025.

బహుమతి పొందిన కధలు, కవితలు, కార్టూన్లతో ప్రత్యేక సంచిక వెలువడుతుంది

ప్రతినిధులుగా మీ పేరు నమోదు చేసుకోండి.

పోటీకి కవులు, కథకులు, కార్టూనిస్టులు తమ రచనలు పంపుతున్నారు. చాలా సంతోషం. కానీ పోటీకే పరిమితమా? లేక ఈ ఉత్సవాల్లో కూడా ప్రతినిధిగా పాల్గొంటారా? అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలి.

ప్రతినిధిగా ముందుగా పేరు నమోదు చేసుకున్న వారికి మాత్రమే వేదిక మీద షీల్డ్, శాలువాతో సత్కారం వుంటుంది.

అలాగే బహుమతులు పొందిన వారికి నగదు బహుమతులతో పాటు షీల్డ్, శాలువా, సత్కారం వుంటుంది.

ఒకే వ్యక్తి మూడు పోటీల్లో పాల్గొన్నట్టయితే బహుమతులు పొందినప్పటికీ ఆ మూడు విభాగాలకు కలిపి ఒక్కసారే సత్కారం వుంటుంది. అయితే నగదు బహుమతులు మాత్రం మూడు విభాగాలకు కలిపి వుంటాయి.

ప్రతినిధులుగా పేర్లు నమోదు చేసుకోవటం ఎలా?

నవంబరు 22, 23 తేదీలలో రెండు రోజులపాటు విజయవాడలో జరిగే ఈ ఉత్సవాలలో ప్రతినిధిగా పాల్గొని కవిత/గజల్/ మరే సాహిత్య ప్రక్రియలోనైనా కవిత చదవాలనుకుంటున్నాను అంటూ మీ పేరు, చిరునామా తెలియజేస్తూ malleteega.sss@gmail.com ఈమెయిల్ కు వివరాలు పంపండి! మీరు చదవాలనుకుంటున్న కవిత కాపీని కూడా ఈమెయిల్ కు ముందుగానే పంపాలి. ప్రత్యేకంగా కవితాంశం అంటూ ఏమీ లేదు.
పేర్ల నమోదుకు అఖరు తేదీ 25 అక్టోబర్ 2025.

కలిమిశ్రీ (అధ్యక్షులు) 92464 15050

Share via
Copy link
Powered by Social Snap