చిత్ర జగతిలో పున్నమి రేడు.. దామెర్ల

మచిలీపట్నంలో దామెర్ల రామారావు 130 వ జయంతి సభ
ముఖ్యఅతిథిగా కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కే. రాంజీ

ఆధునిక చిత్రకళ పేరు చెప్పగానే గుర్తొచ్చే పేరు కేరళకు చెందిన రాజా రవివర్మ అని ఆయనతో సమానమైన ప్రతిభ ఉన్న తెలుగు చిత్రకారుడు దామెర్ల రామారావు మాత్రమే నని కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాంజీ కొనియాడారు.

ఆంధ్ర శైలి చిత్రలేఖనానికి మార్గదర్శకుడైన దామెర్ల రామారావు 130 వ జయంతి, మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ (మా) 11వ వార్షికోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం(మార్చి 8) సాయంత్రం కృష్ణాజిల్లా మచిలీపట్నం సన్ స్టార్ స్కూల్లో ఒకరోజు ఆర్ట్ వర్క్ షాప్, జిల్లాస్థాయి చిత్రకళా పోటీలలో విజేతలైన బాల బాలికలకు బహుమతుల ప్రధానం, ప్రముఖ చిత్రకళాకారుల పెయింటింగ్స్ ప్రదర్శన ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కె.రాంజీ తొలుత ప్రసంగిస్తూ, చిత్రించిన ప్రతీది గొప్ప బొమ్మా కాదు, చిత్రించే ప్రతీవాడూ గొప్ప చిత్రకారుడు కాలేడన్నారు. కేవలం దామెర్ల రామారావు వంటి మహనీయులు చేసిన పని కాలానికి కట్టుపడనిదన్నారు. మనిషి మనసుకు శాంతినివ్వడానికి ఇవ్వబడినదని, మనిషి ఎల్లకాలం ఉండడు. గొప్ప కళ ఎప్పటికీ ఉంటుందన్నారు. ఆ కళ తనున్నంత కాలం తన సరసన ఆ మనిషి పేరును నిలిపి పెడుతుందన్నారు.

అనంతరం కడప యోగి వేమన యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ విభాగపు ప్రొఫెసర్ మృత్యుంజయరావు మాట్లాడుతూ, చిత్రకళావైభవానికి వన్నెతెచ్చిన చిత్రకారుడు దామెర్ల రామారావు జయంతి సభ ఘనంగా నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. తెలుగు జాతి చిత్రకళావైభవానికి వన్నెతెచ్చిన చిత్రకారుల్లో దామెర్ల రామారావు ఒకరని అంతటి కళాకారుడు జీవించింది 28 ఏళ్ల అతి కొద్ది కాలమైనా.. ఆ కొద్ది కాలంలోనే చిత్రకళకు ఆయన చేసిన సేవ మరువలేనిదన్నారు.

తర్వాత మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ (మా) సభ్యులు ప్రముఖ మ్యుజిషియన్ చిత్రకారులు కోసూరు మాధవ్ మాట్లాడుతూ, గత 11 ఏళ్లుగా తమ అకాడమీ కార్యదర్శి బి.ఎస్.వి రమేష్ తో కలసి పలు కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వర్ధమాన చిత్రకారులను ప్రోత్సాహించి వారి ప్రతిభను మరింతగా సానబట్టడమే తమ అకాడమీ ప్రధాన లక్ష్యమన్నారు

అనంతరం దామెర్ల రామారావు స్మారక అవార్డును మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ సభ్యులు కోసూరు మాధవ్ కు అందచేసి ఆయనను ఘనంగా సత్కరించారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మృత్యుంజయరావు, కృతివెన్ను జిల్లా పరిషత్ హై స్కూల్ ఉపాధ్యాయురాలు స్వర్ణలత, గూడూరు జడ్పీహెచ్ఎస్ టీచర్ అరుణ, తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో ఆర్ట్ డైరెక్టర్ చిత్రకారులు కోటి, రాజమండ్రికి చెందిన రిటైర్డ్ డ్రాయింగ్ టీచర్ కరణం నూకరాజు, కాకినాడ జిల్లా కిర్లంపూడికి చెందిన వైవిద్య వాష్ డ్రాయింగ్ చిత్రకారులు కె. నాగేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్ నందం రామారావు, సెన్సార్ బోర్డు మెంబర్ వడ్డీ ఓం ప్రకాష్, తులసి హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ చేస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ ఆ సంస్థ నిర్వాహకులు బొడ్డు తులసి రామ్ తదితరులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందచేశారు.

ఈ కార్యక్రమంలో క్రిష్ణా యూనివర్సిటీ రిజిస్ట్రర్ ఉషా, మచిలీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా న్యూస్ జర్నలిస్ట్ అసోసియేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ (పెన్ యూనియన్) రాష్ట్ర అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ బడే ప్రభాకరరావు, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వడ్డీ జితేంద్ర, నాగేశ్వరమ్మ లక్ష్మీ కుమారి ఉషా లక్ష్మి రాంబాబు సత్యదేవ్ నూకరాజు శర్మ మోహన ప్రియ తదితరులు పాల్గొన్నారు.

Share via
Copy link
Powered by Social Snap