
ప్రఖ్యాత చిత్రకారుడు దామెర్లరామారావు 100 వ వర్ధంతి విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ హాల్ లో ఫిబ్రవరి 6న గురువారం ఉదయం ఘనంగా జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథి ఎ.యం డి. ఇంతియాజ్ దామెర్ల చిత్ర పటానికి పూలమాలతో ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో గోళ్ళ నారాయణ రావు, కార్టూనిస్ట్ టి. వెంకటరావు, చిత్రకారులు టేకి మృత్యుంజయ్ రావు, 64కళలు ఎడిటర్ కళాసాగర్, డ్రీమ్ రమేష్, స్ఫూర్తి శ్రీనివాస్, గంథం దుర్గా ప్రసాద్, సునీల్ కుమార్, మురళీ కృష్ణ తదితరులు దామెర్ల గురించి మాట్లాడారు.
ఇంతియాజ్ గారు మాట్లాడుతూ దామెర్ల రామారావు గారు బతికున్నది కేవలం 28 ఏళ్లయినా, ఆయన మన మధ్య నుండి కనుమరుగై వందేళ్లయినా నేటికీ చిరంజీవులుగా వారి చిత్రాలు నిలబడ్డాయి అన్నారు. అలాంటి మహనీయుని చిత్రారాజాలను కాపాడుకోవడంలో మనం, మన ప్రభుత్వాలు చొరవ చూపాలన్నారు.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన చిత్రకారుని చిత్రాలు రాజమండ్రి దామెర్ల ఆర్ట్ గ్యాలరీలో నేడు అవసాన దశలో ఉన్నాయని, గ్యాలరీ కరెంట్ బిల్లులు కూడా చెల్లించలేని దుస్థితిలో నిర్వహణ వుందని కళాసాగర్ అన్నారు. ప్రస్తుతం స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారి నిర్వహణలో దామెర్ల ఆర్ట్ గ్యాలరీ వుందని, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే దామెర్ల చిత్రాలను కనుమరుగవుతాయని కళాసాగర్ అన్నారు. చిత్రకారుడు మృత్యుంజయ రావు దామెర్ల రామారావు బాల్యం, కళాజీవితాన్ని గురించి వివరించారు.
