
దామెర్ల రామారావు గారి ప్రముఖ చిత్రాలు-నకలు చిత్రీకరణ – చిత్రకారులకు ఆహ్వానం.
ఉద్దేశం: 1954 లో ఆచార్య వరదా వెంకటరత్నంగారు గేలరి నిర్మించి తెలుగు జాతికి దామెర్ల రామారావుగారి చిత్రాలను తెలుగుజాతికి వరంగా ప్రసాదించారు. నేడు రాజమహేంద్రవరంలోని దామెర్ల రామారావు గారి ఆర్ట్ గ్యాలరీ లోని చిత్రాలు వాతావరణ కాలుష్యానికి గురై వర్ణాలు కోల్పోయి రూపురేఖలు మారిపోయినాయి. ఈ చిత్రాలను పరిరక్షించాలని ప్రభుత్వానికి గత సంవత్సరాలుగా ఎన్నిసార్లు విన్నపం చేసినా ప్రయోజనం లేని సందర్భంలో శత వర్థంతి సభలో ఫిబ్రవరి 6వ తేదీన సమావేశమైన పలు చిత్రకారులు ముందుగా రామారావు గారి చిత్రాలకు నకలు తయారుచేసి ప్రదర్శించడం ద్వార భావితరాలకు దామెర్ల వారి అద్భుత చిత్రరూపాలను అందించాలి అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది.
నీటి రంగుల్లో వాష్ టెక్నిక్ లో ప్రత్యేక శైలిలో అపురూప రేఖా లావణ్యంతో సుందర దృశ్యాలను, తెలుగు వారి నిత్యజీవన ఘట్టాలను రమ్యంగా చిత్రించిన దామెర్ల వారి చిత్రాలను యథా తథంగా తయారుచేయడం కష్టమైన విషయమే అయినా మన ప్రతిభావంతులైన చిత్రకారులు తదేక కృషితో కొందరైనా నకలు తయారుచేయగలరు అనే నమ్మకంతో ఈ ప్రకటన చేస్తున్నాము.
చిత్రకారులు తమ కళా సాధనపై నమ్మకంతో ఒక సవాలుగా ఈ విషయాన్ని స్వీకరించి ఏ మాత్రం తేడా లేని విధంగా 100 శాతం దామెర్ల వారి చిత్రాలను చిత్రించడానికి ముందుకు రావలసినదిగా కోరుతున్నాము.
అలా చిత్రించగలిగిన చిత్రకారులు కళాజగతికి గొప్ప మేలు చేసినవారు అవుతారు.
నియమ నిబంధనలు:
- కేవలం దామెర్ల రామారావు గారి చిత్రాలు మాత్రమే చిత్రించాలి.
- రామారావుగారి ఏ చిత్రమైనా చిత్రించ వచ్చును.
- పూర్తి చిత్రం కాకపోయినా రామారావు గారి చిత్రంలోని ఏదైనా మీకు నచ్చిన కొంత భాగాన్ని కూడా చిత్రించవచ్చును.
- చిత్రాన్ని కాగితం పైననే నీటి రంగుల్లోనే 12″×18′ సైజ్ తగ్గకుండా చిత్రించాలి.
- చిత్రాన్ని మార్పు చేయరాదు.
- చిత్ర నిర్మాణం 100 శాతం రావడం కోసం మీరు ఏ విధమైన సులువు మార్గాన్నయినా అవలంబింపవచ్చును. ఉదాహరణకు చిత్రం ట్రేస్ తీసుకోవడం..వంటివి.
- మీరు చిత్రించిన చిత్రాలను వాట్సాప్ ద్వారక్రింద ఇవ్వబడిన ఫోన్ నంబర్స్ కు ఫిబ్రవరి 28 తేదీ నాటికి అందేలా పంపాలి.
- మాకు పంపబడిన చిత్రాలలో 100 శాతం చిత్రించ గలిగిన చిత్రాలను ఎంపిక చేయడం జరుగుతుంది.
- ఎంపిక కాబడిన చిత్రాల చిత్రకారుల వివరాలను మార్చి 1 వ తేదీన అన్ని వాట్సాప్ గ్రూపులలోనూ ప్రకటింప బడుతాయి. ఎంపిక కాబడిన చిత్రకారులు వెంటనే తమ బిఓదాట ను కూడా అదే ఫోన్ నెంబర్ కు పంపవలెను. ఎంపిక కాబడిన చిత్రాలు, ఫోటోతో పాటు చిత్రకారుల వివరాలతో కేటలాగ్ ప్రింట్ చేయబడుతుంది.
- ఆ విధంగా ఎంపిక కాబడిన చిత్రకారులు తమ ఒరిజినల్ చిత్రాలు తీసుకుని గ్యాలరీకి మార్చి 8 వ తేదీన ఉదయం 9 గం.లకు చేరుకుని చిత్రాలను ప్రదర్శనలో ఉంచాలి.
- ఎంపిక కాబడిన చిత్రకారులు తదుపరి రామారావు గారి చిత్రాలన్నిటికీ నకలులు తయారుచేసే మహాయజ్ఞంలో పాల్గొనే అర్హత పొందుతారు. తదుపరి కార్యక్రమానికి చిత్రాన్ని పది కాలాల పాటు నిలిపి ఉంచగలిగే విదేశీ నాణ్యమైన రంగులు, watercolour sheets ఇవ్వబడతాయి.
- ఎంపిక కాబడిన చిత్రకారులను మార్చ్ 8 వ తేదీన నాటి జయంతి సభలో సాయంత్రం 4 గం.లకు సర్టిఫికెట్, జ్ఞాపిక లతో సత్కరింపబడును.
- ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం ఒక సేవగా భావించవలసి ఉంది.
- చిత్రకారులకు ఎటువంటి దారి ఖర్చులు ఇవ్వలేము.
- జయంతి సభ రోజున మధ్యాహ్నం భోజన సదుపాయం కలదు. సాయంత్రం టీ, బిస్కెట్స్ అందించబడును.
- ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఎటువంటి ప్రవేశ రుసుమూ లేదు.
- ఈ కార్యక్రమంలో పాల్గొని రామారావు గారి చిత్రాలను జాతికి అందించడమే గాక గొప్ప కళాభిమానాన్ని చాటుకోగలరు.
- సహకరించబోయే చిత్రకారులకు మా కళాభినందనలు.
” కళాకారుని ద్వారా కళ..కళ ద్వారా కళాకారుడు ఎన్నటికీ జీవించే ఉంటారు.”
వివరాలకు మరియు మీ చిత్రాల పోటోగ్రాఫ్స్ పంపుటకు ఫోన్ నంబర్స్:
శ్రీ తారా నగేష్, ఆర్టిస్ట్:
93811 46563.
శ్రీ మాదేటి రవిప్రకాష్,
సెక్రటరీ : మాదేటి రాజాజీ ఆర్ట్ అకాడమీ,
93933 89458.
ఆసక్తి గలవారికి రామారావు గారి చిత్రాలు వాట్సాప్ చేయబడును. లేదా గ్రూప్స్ లో పోస్ట్ చేయబడును.
ఇట్లు
మాదేటి రాజాజీ ఆర్ట్ అకాడమీ,
రాజమహేంద్రవరం.
Good 👍
మహాత్కార్యక్రమం చేపట్టినారు అభినందనలు 💐💐💐💐
చిత్రకారులు తమ ప్రతిభను ఉదారత ను చాటుకొనే గొప్ప అవకాశం.