నృత్య పోటీల్లో పి.బి. సిద్ధార్థకు ప్రథమ, ద్వితీయ బహుమతులు.
జాషువా సాంస్కృతిక వేదిక విజయవాడ, ఎం.బి. భవన్లో నిర్వహించిన 10వ సాంస్కృతిక ఉత్సవాల్లో నృత్య విభాగంలో పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులు గరగలు నృత్యాంశంలో ప్రథమ బహుమతి, జానపద విభాగంలో ద్వితీయ బహుమతి సాధించడం పట్ల ప్రిన్సిపల్ డా. మేకా రమేష్, డైరెక్టర్ వేమూరి బాబూరావు, కల్చరల్ కోఆర్డినేటర్ పోసాని ప్రసాదరావు అధ్యాపకురాలు రత్నకుమారి అభినందనలు తెలిపారు. విద్యార్థులను అభినందించారు. గరగలు నృత్య ప్రదర్శనలో సిద్ధార్థ కళాశాల డిగ్రీ విద్యార్థులు వర్షిక, కె.విఘ్నేష్ కార్తికేయ, కె. ప్రేమ్ కుమార్, కె. పూజ, పి.పావని, వై. రమ్య, ఎన్. విలాసిని పాల్గొన్నారు. లంబాడీ నృత్య ప్రదర్శనలో పీబీ సిద్ధార్థ యూజీ మొదటి సంవత్సరం విద్యార్థులు హేమంతిక, నవ్య, వైష్ణవి, గీతిక, యషిత, పుష్పవతి, లక్ష్మీభవాని, జాస్మిన్, శశి మాధురి, హర్షిత, షమిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను వారు అభినందించారు. నిన్న రాష్ట్ర ప్రభుత్వం యూత్ సర్వీసెస్ జిల్లాస్థాయిలో నిర్వహించిన యువజనోత్సవాల్లో గరగల నృత్యాంశంలో పి.బి. సిద్ధార్థ విద్యార్థుల బృందం ప్రథమ బహుమతి సాధించినట్లు ప్రిన్సిపాల్ డా. మేకా రమేశ్ తెలిపారు.
