భళారే బాహుబలి

కంప్లీట్ మేన్లీనెస్… ఎట్రాక్టివ్ హైట్…సూపర్బ్ డాన్స్ టాలెంట్…క్యూట్ క్యూట్ రొమాంటిక్ కాన్వర్వేషన్… స్టార్టింగ్ డేస్ లో యంగ్ రెబెల్ స్టార్ ఇమేజ్. ఎట్ ప్రజెంట్… వరల్డ్ స్క్రీన్ పై ‘ బాహుబలి’ టూపార్ట్స్ మూవీ సెన్సేషన్… దటీజ్ మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరో ప్రభాస్. ఒకప్పుడు టాలీవుడ్ కి మాత్రమే తెలిసిన ప్రభాస్ లేటెస్ట్ గా ఇంటర్నేషనల్ హీరో..
తన ఫాన్స్ ని ప్రేమగా ‘డార్లింగ్’ అని పిలిచే ఈ ‘మిర్చి’ కుర్రోడు అమ్మాయిల డ్రీమ్ స్టార్. లైట్లారిన థియేటర్లలో ప్రభాస్ కనిపిస్తే చాలు…. ఈలల ‘వర్షం’..! ఇంట్రావర్ట్ గా కనిపించే ప్రభాస్ అత్యంత మోమాటస్థుడు. సిగ్గరి. అలాంటి ఆయన కోట్లలో అభిమానులను సంపాదించుకొని వినోద పరిశ్రమలో ‘చక్రం’ తిప్పుతున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ మీదుగా ప్రపంచసినిమా వేదికను సైతం ఉర్రూత లూగిస్తున్న ప్రభాస్ అచ్చమైన తెలుగు తేజం.

కుటుంబ నేపథ్యం:
‘కృష్ణవేణి’, ‘భక్త కన్నప్ప’, ‘త్రిశూలం’ వంట బ్లాక్ బస్టర్స్ తీసిన ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు కుమారుడే ప్రభాస్. ప్రభాస్ తల్లి పేరు శివకుమారి. ప్రభాస్ కు ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు. ప్రభాస్ 1979 అక్టోబర్ 23న జన్మించారు. ఒకప్పటి ప్రముఖ హీరో కృష్ణంరాజు ప్రభాస్ కు బాబాయ్ అవుతారు. భీమవరం దగ్గర మొగల్తూరు ప్రభాస్ స్వస్థలం. హైదరాబాద్ లోని నలంద కాలేజ్ లో ఇంటర్ వరకు చదివిన ప్రభాస్ వైజాగ్ లోని సత్యానంద్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్‌లో నటనలో శిక్షణ తీసుకున్నా రు యంగ్ రెబెల్ స్టార్. ‘ఈశ్వర్’తో ఎంట్రీ జయంత్ సి పరాన్జీ, సిల్వర్ స్క్రీన్ పై ‘వన్ ఫోర్ త్రీ’ని అత్యంత ప్రతిభావంతంగా ఆవిష్కరించే సత్తా ఉన్న యూత్ ఫుల్ డైరక్టర్. ఆయన డైరక్షన్లో 2002లో ప్రభాస్ ‘ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసారు. 2003 లో “రాఘవేంద్ర’ సినిమాలో నటించిన ప్రభాస్ 2004 లో ‘వర్షం’, ‘అడవి రాముడు’ సినిమాలతో అలరించారు. 2005 లో కృష్ణవంశీ ‘చక్రం’, దర్శకధీరుడు రాజమౌళి ‘ఛత్రపతి’ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘ఛత్రపతి’ సినిమా ద్వారా ప్రభాస్ తన నటనతో ప్రేక్షకులకు మరింతగా చేరువయ్యారు. 54 సెంటర్లలో ఈ సినిమా శతదినోత్సవం జరుపుకుంది. ఆ తర్వాత వరుసగా ప్రభాస్ ‘పౌర్ణమి’, ‘యోగి’, ‘మున్నా’ తదితక సినిమాలలో నటించారు. ఈ చిత్రాల తర్వాత ‘బుజ్జిగాడు’ అనే యాక్షన్ కామేడి చిత్రంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆ పిమ్మట 2009లో ‘బిల్లా, ‘ఏక్ నిరంజన్’ అనే సినిమాలలో నటించారు. 2010 లో ‘డార్లింగ్’ అనే కుటుంబ కథా చిత్రంలో నటించారు. ఈ సినిమా తర్వాతే ప్రభాస్ ప్రేక్షకులకు ‘డార్లింగ్’ గా దగ్గరయ్యారు. ఈ సినిమా పాజిటీవ్ రివ్యూస్ దక్కించుకుంది. 2011లో ‘మిస్టర్ పర్ఫెక్ట్’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా ప్రేక్షకులకు బాగా చేరువయ్యింది. క్లీన్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల మనసు దోచుకుంది.

2012లో లారెన్స్ దర్శకత్వంలో ‘రెబల్‘ గా ప్రభాస్ ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈ చిత్రాన్ని కూడా ఆడియన్స్ ఎంతగానో ఆదరించారు. మంచువిష్ణు, హన్సికా జంటగా నటించిన ‘దేనికైనా రెడీ’ సినిమాలో ఒక చిన్నపాత్రకు తన డబ్బింగ్ చెప్పారు.
2013 లో ‘మిర్చి‘ సినిమా క్లాస్, మాస్ అభిమానులకు ఎంతగానో నచ్చింది. మన ప్యాన్ ఇండియా స్టార్ 2014లోని ‘యాక్షన్ – జాక్సన్’ అనే హిందీ సినిమాలో ఐటెం నెంబర్ పంజాబీ మస్త్ లో అతిథిగా కనిపించారు. ప్రభాస్ హిందీ డెబ్యూ ఇదే. ‘బాహుబలి’తో ఎల్లలు లేని ఖ్యాతి 2015లో ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ రెండుభాగాల సినిమాలలో శివుడు, మహేంద్ర బాహుబలి పాత్రల్ని పోషించారు. ప్రభాస్. ‘బాహుబలి ద బిగినింగ్’ సినిమా అత్యధికంగా వసూళ్ళు చేసిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. వాస్తవానికి ఈ సినిమాతోనే చిత్రపరిశ్రమలో ప్యాన్ ఇండియా సినిమాల సరికొత్త అధ్యాయం ఆరంభమైంది. ‘బాహుబలి ద కంక్లూజన్’ కూడా పదిరోజుల్లోనే… విడుదలయిన అన్ని భాషలలోనూ అత్యధిక వసూళ్ళు రాబట్టింది. ‘బాహుబలి’ పాత్ర కోసం ప్రభాస్ 105 కేజీల బరువు పెరిగారు. 2019లో సుజిత్ దర్శకత్వం వహించిన ‘సాహో’ చిత్రంలో నటించారు. రివ్యూస్ ఆశించిన స్థాయిలో రానప్పటికీ ప్రేక్షకుల మనసులు దోచుకోవడంలో, వసూళ్ళు రాబట్టడంలో ఈ సినిమా విజయం సాధించిందని విశ్లేషకుల అభిప్రాయం.

ప్రస్తుత సినిమాలు:
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. అవి ‘ రాధే శ్యామ్‘, ‘సాలార్’, ‘ఆది పురుష్‘, ప్రాజెక్టు కె, ఇంకా స్పిరిట్ మొదలయిన చిత్రాలు చేస్తున్నారు. పురస్కారాలు 2010 లో ‘ డార్లింగ్’ చిత్రానికి క్రిటిక్స్ ఛాయిస్ యాక్టర్‌గా సినీ మా పురస్కారాన్ని అందుకున్నారు. 2004లో వసూళ్ళ వర్షం కురిపించినందుకుగానూ ‘వరం’ సినిమాకి బెస్ట్ యంగ్ పెర్ఫార్మర్ గా సంతోషం సినీ పురస్కారం అందుకున్నారు. 2019 లో ‘సాహె’ చిత్రానికి గానూ ఈటిసీ బాలివుడ్ బిజినెస్ అవార్డ్స్ నుంచి హైయెస్ట్ గ్రాసింగ్ డెబ్యూ యాక్టర్‌గా పురస్కారాన్ని దక్కించుకున్నారు. 2013 లో ‘మిర్చి’ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా నంది అవార్డ్ తీసుకున్నారు. ఆ తర్వాత ‘బాహుబలి ద బిగినింగ్ సినిమాకి బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు. 2017లో ‘బాహుబలి 2: ద కంక్లూజన్’ కి గానూ బెస్ట్ యాక్టర్ పురస్కారాన్ని సౌత్ ఇండియన్ ఇంటర్ నేషనల్ మూవీ అవార్డ్స్ నుంచి దక్కించుకున్నారు. ఇలా తన నటనతో ప్రేక్షకుల మనసును, అలాగే ఎన్నో పురస్కారాలను గెలుచుకుని ఇంకా మున్ముందుకు సాగిపోతున్నారు మన ప్రభాస్. ఇలాగే, మరిన్ని మంచి ప్రాజెక్ట్ లో అలరించాలని, మరిన్ని విజయాలు సాధించాలని ఫాన్స్ అభిలషిస్తున్నారు.

-నాగసాయి రమ్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap