రైటర్స్ అకాడమి ఆధ్వర్యంలో ‘దాసరి’ తెలుగు షార్ట్ ఫిలిమ్స్ కాంపిటేషన్ -2026
రైటర్స్ అకాడమి, విశాఖపట్నం ఆధ్వర్యంలో జరగనున్న దాసరి నారాయణరావు తెలుగు షార్ట్ ఫిల్మ్ కాంపిటేషన్-2026కు ఆహ్వానం పలుకుతోంది.
2026 జనవరి 1 వ తేదీ నుంచి మార్చి 31 వ తేదీ మధ్యలో నిర్మించిన షార్ట్ ఫిల్మ్ కు మాత్రమే ఈ పోటీలో పాల్గొనుటకు అర్హులు. పోటీకి పంపించిన ఏ షార్ట్ ఫిల్మ్ నైన యూట్యూబ్ ( సోషల్ మీడియా)లో అప్లోడ్ చేసి ఉండరాదు. అశ్లీలత లేకుండా ఏదయినా కధా వస్తువును తీసుకోవచ్చు.
- తెలుగు లఘు చిత్రం ఒక నిమిషం నుంచి 10 నిమిషాల నిడివి మాత్రమే ఉండాలి.
- తెలుగులోనే మాటలు (సంభాషణలు) ఉండాలి.
- ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ వేసుకోవచ్చు. కానీ ఇది తప్పనిసరి కాదు.
- ప్రపంచంలో ఎక్కడ నుండైనా ఈ పోటీలో పాల్గొనవచ్చు.
- ఇతర భాషలో తీసి, తెలుగు భాషలోకి డబ్ చేసిన షార్ట్ ఫిలిమ్స్ స్వీకరించబడవు.
- ఏప్రిల్ 20న విజేతలను ప్రకటించడం జరుగుతుంది.
- మే 4న దాసరి జయంతి సందర్భంగా విశాఖపట్నంలో విజేతలకు అవార్డ్స్ అందివ్వడం జరుగుతుంది.
అవార్డుల వివరాలు:
ప్రథమ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ రూ. 50,000/-
ద్వితీయ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ రూ. 25,000/-
తృతీయ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ :రూ. 15000/-
మూడు ప్రోత్సాహక బెస్ట్ షార్ట్ ఫిల్మ్ లు : ఒక్కొక్కటి రూ. 10,000/-
బెస్ట్ స్టోరీ : రూ.5000/-
బెస్ట్ యాక్టర్ : రూ. 5000/-
బెస్ట్ యాక్ట్రెస్ :రూ. 5000/-
బెస్ట్ కెమెడియన్ :రూ. 5000/-
బెస్ట్ చైల్డ్ యాక్టర్: రూ. 5000/-
బెస్ట్ డైరెక్టర్ : రూ. 5000/-
జ్యూరీ స్పెషల్ అవార్డు : రూ. 5,000/-
షార్ట్ ఫిల్మ్ లు పంపాల్సిన ఆఖరి తేదీ :31-03-2026
E-Mail address: dasarifilmfestival2026@gmail., రిజిస్ట్రేషన్ ఫీజు: రు. 1000/-
ఈ ఫోన్ పే నెంబర్ (9348550909) కు పంపి దీని స్క్రీన్ షాట్ను మీ షార్ట్ ఫిల్మ్ సబ్మిషన్ తో పాటు జతచేసి పైన తెలిపిన ఈ- మెయిల్ కు పంపాలి. అవార్డు పొందిన షార్ట్ ఫిలిమ్స్ ను రైటర్స్ అకాడమీ, ‘లీడర్’ టీవీలో ప్రసారం చేసుకునే హక్కులకు అభ్యంతరం ఉండరాదు.
ఇతర వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు: 9441344365, 9676040165
