ఎస్పీబీ పేరున లక్ష బహుమతి

తెలుగు సాహిత్యాన్ని మొబైల్ యాప్ ద్వారా శ్రవణ రూపంలో అందించే దాసుభాషితం సంస్థ, తెలుగు రాష్ట్రాల్లో పదవ తరగతి విద్యార్థులకు, ప్రతీ సంవత్సరం నవంబరు నెలలో శ్రీ C P బ్రౌన్ జయంతిని పురస్కరించుకుని తెలుగు పోటీని నిర్వహించి ‘దాసుభాషితం CPB బహుమతి’ పేరిట, ₹ 1 లక్ష నగదు బహుమతి అందిస్తూంది.

సెప్టెంబర్ లో దివంగతులైన శ్రీ S P బాలసుబ్రమణ్యం గౌరవార్ధం, ఈ సంవత్సరం నుంచి ఆ పోటీని, ‘CPB-SPB తెలుగు పోటీ’ గా నామకరణం చేసి, అదనంగా ఇంకొక లక్ష రూపాయలతో ‘దాసుభాషితం SPB బహుమతి’ ని ప్రకటించింది దాసుభాషితం సంస్థ.

ఈ మార్పును దాసుభాషితం వ్యవస్థాపకులు శ్రీ కొండూరు తులసీదాస్ ఇలా వివరించారు.

“గత సంవత్సరం నిర్వహించిన తెలుగు పోటీకి బాలు గారు ఒక వీడియో సందేశం ద్వారా, విద్యార్థులను, తెలుగు ఉపాధ్యాయులను ఉత్సాహపరిచారు. ఈ సారి బహుమతిని ఆయన చేతుల మీదుగా అందజేద్దామనుకున్నాము. కానీ అది సాధ్యపడదు. పిల్లల పోటీ నిర్వహిస్తున్నప్పుడు, పెద్దలు కూడా పోటీపై ఆసక్తి కనబరిచారు. ఈ పోటీని అందరికీ విస్తరించి, ఆయన పేరు మీద ఒక బహుమతి ద్వారా తెలుగు భాషపై స్పృహను పెంచడం, తెలుగు తల్లి ముద్దు బిడ్డయిన బాలు గారికి మేము ఇవ్వగల సరైన నివాళి అనిపించింది.”

పోటీలో తెలుగు భాష, సాహిత్యం, సమాజం పై 30 ప్రశ్నలుంటాయని, 2018, 2019 లో నిర్వహించిన పోటీల అనుభవంతో, నిపుణుల సహకారంతో ఈ సంవత్సరం ఇంకా ఆసక్తికరంగా పోటీని రూపొందిస్తున్నామని దాసుభాషితం CEO శ్రీ కొండూరు కిరణ్ కుమార్ అన్నారు.

పోటీ డిసెంబర్ 13, 2020 ఆదివారం పూర్తిగా ఆన్‌లైన్ లో నిర్వహింపబడుతుంది. ఇంటర్నెట్ ఉన్న స్మార్ట్‌ఫోన్ ద్వారా ఎవరైనా ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఫలితాలను డిసెంబర్ 20, 2020 ఆదివారం ప్రకటిస్తారు.

పోటీకి నమోదుకు ఆఖరు తేదీ డిసెంబర్ 10, 2020.

‘Telugu Potee’ అని 99520 29498 కు WhatsApp సందేశం పంపి గాని, www.dasubhashitam.com దర్శించి గాని పోటీకి నమోదు చేసుకోవచ్చు.


For more details: https://www.dasubhashitam.com/brown-spb-telugu-potee/about

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap