మొదటి బహుమతి హైదరాబాద్లో అందుకున్నాను – సుభాని

గత నాలుగు దశాబ్ధాలుగా కార్టూనిస్ట్గా సుదీర్గ ప్రయాణం, జాతీయ స్థాయిలో ప్రకాశిస్తున్న తెలుగు కార్టూనిస్ట్ సుభాని గారి స్వపరిచయం మీ కోసం…

సుభాని పేరుతో కార్టూన్లు గీస్తున్న నా పూర్తి పేరు షేక్ సుభాని నా జన్మస్థలం ప్రకాశం జిల్లా కారంచేడు, 1961లో పుట్టాను. 1978లో నేను ఇంటర్మీడియేట్ చదివే రోజుల్లో మా ఊల్లో ఉన్న లైబ్రరీకి ప్రతిరోజూ వెళ్లేవాడిని. వార, మాస పత్రికల్లోని శ్రీ బాపు, జయదేవ్, సత్యమూర్తి గారి కార్టూన్లు నన్నెంతగానో ఆకర్షించేవి. స్వతహాగా నాకు బొమ్మలు గీయటం ఇష్టం. స్కూల్ లో ఎన్నో బొమ్మలు గీసి స్కూల్ నోటీస్ బోర్డులో క్లాస్ రూముల్లో అంటించేవాడిని. క్లాస్ టీచర్స్, తోటి స్నేహితుల ప్రోత్సాహంతో కొన్ని కార్టూన్లు గీసి పత్రికలకు పంపాను. నేను ఊహించని విధంగా ఒకటి జ్యోతి మాసపత్రిక, మరొకటి ఆంధ్రభూమి దీపావళి ప్రత్యేక సంచికల్లో ప్రింట్ అయ్యాయి. ఆ పత్రికల నుంచి కాంప్లిమెంటరీ కాపీలు 15 రూపాయల రెమ్యూనరేషన్ వచ్చాయి. అలా నా మొదటి కార్టూన్స్ ఇంటర్ మొదటి సంవత్సరంలో వున్నప్పుడు ప్రింట్ అయ్యాయి. ఆ పత్రికల్లోని నా కార్టూన్స్ చూసి టీచర్స్ ఎంతో అభినందించారు. నాలోని ఉత్సాహం రెట్టింపు అయింది. తల్లిదండ్రులు ప్రోత్సాహం, మిత్రుల పొగడ్తలు నేను కార్టూన్స్ గీయటాన్ని ప్రేరేపించాయి. ఇంటర్ నుండి పి.జి. వరకు హాబీగా మాత్రమే కార్టూన్లు గీసేవాణ్ణి. ప్రతి నెల అన్ని పత్రికల్లో 10 కార్టూన్ల వరకూ ప్రచురితం అయ్యేవి. వచ్చిన రెమ్యూనిరేషన్ నా పాకెట్ మనీగా, పుస్తకాలకు ఉపయోగించేవాడిని. అప్పుడప్పుడూ పత్రికల వారు, అనేక ఆర్గనైజేషన్స్ నిర్వహించే కార్టూన్ పోటీలలో నాకు ఏదో ఒక బహుమతి వచ్చేది. అలా స్టూడెంట్ గా ఉన్న రోజుల్లో కార్టూన్స్ ద్వారా డబ్బు సంపాదిస్తుంటే నాలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది.
గ్రాడ్యుయేషన్ చీరాల కాలేజీలో జాయిన్ అయిన తర్వాత శ్రీధర్ (బాచి)తో పరిచయం అతని ద్వారా స్వర్ణ, కాటారి గార్లతో పరిచయంతో అందరం కలిసి చాలా కార్టూన్స్ గీసాము. 1981లో జరిగిన జ్యోతి మాసపత్రిక కార్టూన్ పోటీలలో ఒక సబ్జెక్ట్ మీద గీసిన నా కార్టూనకు ప్రథమ బహుమతి రావటం, ఈ పోటీకి శ్రీ బాపుగారు, ముళ్ళపూడి వెంకటరమణగారు మరియు శ్రీరమణ గార్లు న్యాయనిర్ణేతలుగా ఉండటము మరియు శంకు గారి క్రోక్విల్ అకాడెమీ, స్పోర్ట్స్ అధారిటీ పోటీలు నిర్వహించిన అన్ని విభాగాలలో బహుమతి రావటం నేను కార్టూనిస్టుగా నిలదొక్కోడానికి సహాయపడ్డాయి. బహుమతి అందుకోవడానికి మొదటిసారి హైదరాబాద్ వచ్చాను. బహుమతి ప్రధానోత్సవం తర్వాత అన్ని పత్రికల ఆఫీసులకు వెళ్లటం ఆయా ఎడిటర్లను కలవటం జరిగింది.
గుజరాత్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి పోటీ పరీక్షలు రాద్దామని హైద్రాబాద్ వచ్చాను. చదువుకుంటూ శంకుగారి ‘హాస్యప్రియ’లో కార్టూన్స్ మరియు తారా అడ్వర్ ట్రైగ్ ఏజెన్సీలో ఇలస్ట్రేషన్స్ గీస్తుండేవాడిని. జూనియర్ కాలజీలో లెక్చరర్ జాబ్ వదిలేసి, 1985 ఆంధ్రభూమి వీక్లీలో కార్టూనిస్టు, ఇలస్ట్రేటర్ గా జాయిన్ అయ్యాను. దాదాపు అప్పుడు పేరున్న అందరు రచయితల కథలకు, సీరియల్స్ ఇలస్ట్రేషన్స్ గీసాను. వారానికి ఒక రాజకీయ కార్టూన్ ఆంధ్రభూమి వీక్లీ రెండవ పేజీలో రావటం రాజకీయ కార్టూనిస్ట్ గా మారటానికి దోహదపడింది. ఆ సమయంలో 5,000 పైనే ఇలస్ట్రేషన్స్ గీయటం జరిగింది. ఉత్తమ్, కళా భాస్కర్, నేను గీసిన వాష్ టెక్నిక్ ఇలస్ట్రేషన్స్ చాలా పాపులర్ అయ్యాయి అప్పట్లో. ఈ అనుభవంతో ఆ తర్వాతి కాలంలో పొలిటికల్ కార్టూన్స్ ఎక్కువ డిటేల్స్ గా గీయటానికి దోహదపడింది.
తర్వాత 1988 నుండి 1990 వరకు ఆంధ్రభూమి దినపత్రికకు పొలిటికల్ కార్టూనిస్ట్ గా పనిచేసాను. 1990 నుండి ఇప్పటి వరకు (2020) డెక్కన్ క్రానికల్ గ్రూప్ లో కార్టూన్ ఎడిటర్ గా పనిచేస్తున్నాను. కార్టూన్ ఎడిటర్ డిజిగ్నేషన్ పొందిన మొట్టమొదటి ఇండియన్ కార్టూనిస్ట్ అవటం నా అదృష్టం. డెక్కన్ క్రానికల్ దక్షిణాది రాష్ట్రాలలో ఎడిషన్స్ తో పాటు,
జాతీయ, అంతర్జాతీయ దిన పత్రిక ‘THE ASIAN AGE’ లో ప్రతి రోజు క్రమం తప్పకుండా ఒక ఎడిటోరియల్ కార్టూన్, ఒక పాకెట్ కార్టూన్ వస్తున్నాయి. గత 30 సంవత్సరాలుగా ఒక్క రోజు కూడా నా కార్టూన్ మిస్ కాకుండా దిన పత్రికలో రావటం ఒక రికార్డు (ఆదివారం ఎడిషన్లో దాదాపు 6 Cartoons Full pledged Caricatures తో కలిపి).
నా కార్టూన్ పుస్తకాలు
‘THE DRIVE’ 150 కార్టూన్స్ పుస్తకం రోడ్ సేఫ్టీ మీద, ‘POINT-COUNTER POINT’ 350 కార్టూన్స్ పుస్తకం, Preview edition మా డెక్కన్ క్రానికల్ సంస్థ 2005లో ప్రచురించింది. అలాగే హైదరాబాద్ మీద నేను వెలువరించిన ‘ADAAB HYDERABAD’ 2012 టూరిజం అవార్డు గెలుపొందింది. అలాగే “హ్యూమర్ ఆన్ పోలీస్” అప్పటి తెలంగాణ పోలీస్ కమీషనర్ మురళీ కృష్ణ గారితో కలిసి ప్రచురించిన హ్యూమర్ పుస్తకంలో నావి 150 కార్టూన్స్ వారివి 10 Humor Stories ఉన్నాయి.

అవార్డులు-సత్కారాలు
• 2019 లో ‘తెలుగు కార్టూనిస్ట్స్ అసోసియషన్ ‘ విజయవాడ వారి ఆత్మీయసత్కారం.
• 2017లో ‘నవ తెలంగాణ’ దిన పత్రిక బెస్ట్ కార్టూనిస్ట్ అవార్డు మరియు JCI, అభినందన ఉగాది పురస్కారం.
• 2016లో CARTOON WATCH ‘LIFETIME ACHIEVEMENT’ AWARD.
• 2014 6 BHARAT PRAKASHAN TRUST ‘BEST CARTOONIST’ AWARD.
• 201356 LIONS CLUB INTERNATIONAL ‘LIFETIME ACHIEVEMENT’ AWARD.
• 2010లో ‘YODHVIR AWARD’ For the out standing contribution to cartoon journalist’ లక్ష రూపాయల నగదు బహుమతితో వెండి సైటేషన్‌ ఇచ్చే ఈ ప్రెస్టీజియస్ అవార్డు నన్ను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, శ్యాం బెనగల్, పండిట్ జవరాజ్, రామోజీరావు, సైనా నెహ్వాల్ వంటి దిగ్గజాల సరసన నిలబెట్టింది.
• 2009 DICACD, SEOUL, KOREA ‘HM’ PRIZE.
• 2006లో FIFA AND IRAN CARTOON HOUSE ‘PRIZE OF HONOUR.
• 2005లో TABRIZ INTERNATIONAL CARTOON FESTIVAL in ‘selected prize’ .
• 2004 Fow international Cartoon contestant ‘Gold medal +’success award’.
• 2003లో ‘knoke-heist’ belgium in public prize’ 2002లో Rodhas, Greece In ‘selected prize’.
• 2001లో AIDS CONTROL SOCIETY CARTOON CONTEST IN 1ST PRIZE.

ఇలా పలు బహుమతులు పొందటం నా అదృష్టం.

19 thoughts on “మొదటి బహుమతి హైదరాబాద్లో అందుకున్నాను – సుభాని

  1. బహుగొప్ప కార్టూనిస్టు.శుభాభినందనలు సుహాసిని గారూ.

    1. గొప్ప కార్టూనిస్ట్ అంతకు మించి ఆర్టిస్ట్ ! ఆయన శైైలి అద్వితీయం.నాకు మంచి స్నేహితులు.నేను అభిమానించే గొప్ప కార్టూనిస్టులలో ముందు వరుసలో ఉంటారు. వారికి పరిచయం చేసిన మీకు అభినందనలు !!

  2. కార్టూనిస్ట్ లు అందరూ గర్వించదగ్గ గొప్ప కార్టూనిస్ట్ సుభాని గారు. వారికి అభినందనలు.

  3. అద్భుతమైన రాజకీయ కార్టూన్లు,కారికేచర్స్ గీసే గొప్ప కార్టూనిస్ట్…

  4. Congrats, Subhaniji ..

    Your unstinted efforts for bringing Countrtpoint Cartoons for the last 28 years in DC without a break. I wish you to bring many more heartful laughs every morning through your excellent cartoons.

  5. నిగర్వి, అజాతశత్రువు, సూపర్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ సుభానీ గారికి అభినందనలు

  6. స్నేహశీలి, నిగర్వి, మిక్కిలి ప్రతిభావంతులు శ్రీ సుభాని గారిని పరిచయం చేసిన మిత్రులు కళాసాగర్ గారికి,64 కళలు డాట్ కామ్ వారికి అభినందనలు ….

  7. మంచి వ్యక్తి, గొప్ప ఆర్టిస్ట్, గొప్ప కార్టూనిస్ట్ సుభానీ గారికి అభినందనలు

  8. సుభాని గారికి అభినందనలు. ప్రతి కార్టూనిస్ట్ ని భుజం తట్టి ప్రోత్సహించడం ఆయనకే చెల్లుతుంది.. నేను కార్టూన్లగిసేందుకు సుభాని గారే స్ఫూర్తి..

  9. సుభానిగారి చిత్రాలు కార్టూనిస్ట్ లకు పాఠాలు వంటివి.. వారి వద్ద నేర్చుకోవాల్సింది చాలా ఉంది..

  10. నిగర్వి, అజాత శత్రువు , మనకున్న గొప్ప చిత్రకారుల లో అతి గొప్పగా కలం సేద్యం చేసేవాడు… కంగ్రాట్స్ సార్

  11. తెలుగు వారు గర్వించదగ్గ “నిగర్వి” సుభాని గారు. వారి పరిచయం చాలబాగుంది.

  12. ” ‘వ్యంగ్యాహాస్య’ చిత్రకళాకార ప్రపంచం ! ” [Cartoonists Art world]
    ఈ చిత్రకళాప్రపంచంలో మరోసాటిలేని అత్యున్నత శిఖర స్థాయికి చేరుకున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు ! తెలుగు పత్రికారంగంతో బాటుగా ఇతర భాషాపత్రికల్లో కూడా తలమానికంగా వెలుగుతూ ముందుకు సాగాలని మనస్పూర్తిగా ఆశిస్తూ….ఆశీర్వదిస్తున్న….
    ………..యస్పీచారి.

  13. శుభాని గారు వీక్లీ లో మీరు వేసిన చిత్రాలు అప్పటికి కొత్త రకం.పొలిటికల్ కార్టూన్లు చాలా బాగుంటాయి.పాకెట్ సైజ్ లో పెద్ద చిత్రం కనిపించేలా ఉంటుంది. వ్యాఖ్య చాలా చురుకుగా ఉంటుంది.నాకు చాలా ఇష్టం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap