భారత సాంస్కృతిక శాఖ మరియు బ్రహ్మ కుమారిస్ వారి అధ్వర్యంలో రాజస్థాన్ లో దాదాపు 275 మంది చిత్రకారులతో నాలుగు రోజులపాటు ఆర్ట్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్ లో చెన్నైకి చెందిన తెలుగు అమ్మాయి డయానా సతీష్ చిత్రించిన చేర్యాల పెయింటింగ్ కి కల్చర్ అండ్ హెరిటేజ్ విభాగంలో మూడవ బహుమతి పొందింది.
చెన్నైలో పుట్టిన డయానా, ఆంద్రప్రదేశ్‌లో పెరిగి, తెలంగాణా చేర్యాల జానపద కళాకారిణిగా గుర్తింపుపొందారు. సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీ, డ్రాయింగ్ మరియు పెయింటింగ్‌లో డిప్లొమా మరియు విజువల్ ఆర్ట్స్‌లో డిప్లొమా చేసి, చెన్నై కళాక్షేత్ర నుండి సిరామిక్స్‌లో ప్రత్యేక శిక్షణ పొందారు. చెన్నైలోని అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఉపాధ్యాయ వృత్తిని ప్రారంభించి, ప్రస్తుతం KIDS సెంట్రల్ హై కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఆర్ట్ బోధిస్తున్నారు. కళ ద్వారా అందరినీ ఏకం చేయచేయవచ్చని నమ్ముతుంది డయానా.