హైదరాబాద్, మాదాపూర్ లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏప్రిల్ 16న, శనివారం ‘శ్రీప్రభాతాలు’ పేరిట ఏర్పాటు చేసిన డిజిటల్ పెయింటింగ్స్ చిత్ర ప్రదర్శనను ప్రముఖ హాస్య నటుడు, హాస్యబ్రహ్మ, పద్మశ్రీ బ్రహ్మానందం ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం చిత్రకారుడు ప్రభాకర్ తో కలిసి ప్రదర్శనలోని చిత్రాలను తిలకించారు.
ఆర్టిస్ట్ అనుపోజు ప్రభాకర్ గారు ఛయనిక పేరుతో స్టూడియోను నిర్వహిస్తూ పెయింటింగ్ ఆర్టిస్ట్, లెటరింగ్ ఆర్టిస్ట్ గా, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ గా, క్రియేటివ్ గ్రాఫిక్ డిజైనర్ గా, డిజిటల్ పోర్ట్రైట్ ఆర్టిస్ట్ గా గత మూడు దశాబ్దాలుగా హైదరాబాద్ నగరంలో అటు సినిమా రంగంలోనూ, ఇటు పత్రికా రంగంలోనూ రాణిస్తూ, టెక్నాలజీ పరంగా వచ్చిన మార్పులను అందిపుచ్చుకుంటూ ఇటీవల తను రూపొందించిన 50 డిజిటల్ చిత్రాలతో ఈ ప్రదర్శన నిర్వహించారు. ఇదో కొత్త సాంప్రదాయం. మూడు రోజుల పాటు కొనసాగిన ఈ ప్రదర్శన ఏప్రిల్ 18వ తేదీన ముగిసింది. ప్రదర్శనలో ఆకట్టుకునే రీతిలో డిజిటల్ చిత్రాలు సందర్శనార్థం ఉంచినట్లు, ప్రతి ఒక్కరిని తప్పకుండా ఆకట్టుకుంటాయని చిత్రకారుడు ప్రభాకర్ తెలిపారు. ఈ ప్రదర్శనను సందర్శించిన వారిలో దర్శకుడు వి.ఎన్. ఆదిత్య, ప్రముఖ నటులు మురళి మోహన్ లాంటి ఎందరో ప్రముఖులు, చిత్రకారులు, కళాభిమానులు వున్నారు.
చాలా మంచి కార్యక్రమం…