ఎందరికో మార్గదర్శకుడు – దాసరి

దాసరి పుట్టినరోజు సందర్భంగా … వారితో  శివనాగేశ్వర రావు గారి అనుభవాలు….

ఆయన నా దృష్టిలో దర్శకుడే కాదు.. నాలాంటి ఎందరికో మార్గదర్శకుడు.. తొలి సినిమానే ఒక కమెడియన్ ని హీరోగా పెట్టి తీసాడు.. తర్వాత ఒక విలన్ ని హీరో గా పెట్టి తీసాడు.. ఒక హీరోయిన్ ని హీరోగా పెట్టి తీసాడు.. అడా మాగా కాని వేషం లో మాడాని పెట్టి తీసాడు.. ఒక డైలాగ్ ఆర్టిస్ట్ ని హీరో గాపెట్టి తీసాడు.. చిన్న హీరోలతో.. పెద్ద హీరోలతో..కొత్తవాళ్ళని హీరోలుగాపెట్టి సినిమాలు తీసాడు.. చివరికి తానే హీరో గా కూడా సినిమాలు తీసాడు… డిసెంబర్ 31 రాత్రి క్రమం తప్పకుండా తన ఇంట్లో అయ్యప్ప పూజ..వచ్చిన అందరికీ భోజనాలు.. 12 గంటలు కాగానే వచ్చిన అందరికీ ఒక కవర్లో 100 కొత్త నోటు ఉంచి దాని మీద అతని పేరు రాసి న్యూ ఇయర్ గ్రీటింగ్స్ రాసి ఇచ్చేవారు..నేను కూడా ప్రతి సంవత్సరం వెళ్ళేవాడిని.. నా పేరు రాసి నాకు కవర్ ఇచ్చేవాడు.. ఒక సంవత్సరం నేను ఆ కవర్ తీసుకుని..’ఇంకోటి ఇవ్వండి గురువుగారు’ అన్నాను..ఆశ్చర్యంగా చూసారు నా వైపు..’అవును గురువుగారు.. నేను అన్నది..మీరు విన్నది ఒకటే..ఇంకోటి ఇవ్వండి .. తరవాత చెబుతాను’.. అన్నాను.. నవ్వుతూ ఇంకో కవర్ మీద నా పేరు రాసి ఇచ్చారు.. అప్పుడు చెప్పాను.. ‘మీరు ప్రతి ఏడూ కవర్ ఇస్తున్నారు.. అది నేను మా ఆవిడ కి ఇస్తే తన బీరువాలో పట్టుచీరల మధ్యలో దాచిపెట్టుకుంటుంది.. కానీ వంద వండగానే ఉండిపోతుంది..ఇప్పుడు మీరు ఇచ్చిన ‘ఇంకోటి’ లో ‘కోటి’ ఉంది.. కాబట్టి ఖచ్చతం గా ఇది కోటి అవుతుందని నమ్మకంతో అలా అడిగాను..పెద్దగా నవ్వి.. ‘అందుకెనయ్యా నువ్వంటే ఇష్టం’ అన్నారు… తర్వాత మా అమ్మాయి పెండ్లి కార్డ్ ఫస్ట్ ఆయనకే ఇచ్చి.. గురువుగారు.. మొదటి కార్డ్ మీకే ఇస్తున్నాను.. మీరు తప్పక వస్తున్నారు.. అన్నాను..రాకుండా ఎలా ఉంటాను.. అని PA రామారావు ని పిలిచి డేట్ నోట్ చేసుకొని గుర్తు చేయమన్నాడు… పెళ్లిరోజు ఉదయం రామారావు ఫోన్ చేసి గురువుగారు ఎన్నింటికి రావొచ్చు అని అడిగాడు..8 నుండి 10 లోపు ఎప్పుడైనా రావొచ్చు అని చెప్పాను… కానీ ఆయన రాలేదు..వేకువజామున 3.45 కి ముహుర్థం..రాలేదు.. మరునాడు ఉదయం 11.30 కి రామారావు ఫోన్..గురువుగారు మాట్లాడతారు అని చెప్పాడు..నాగేశ్వరరావు అన్నాడు..నేను సైలెంట్ గా వున్నాను..కోపం వచ్చిందా అన్నారు..సైలెంట్ గానే వున్నాను..నాకు తెలుసయ్యా నీకు కోపం వస్తుందని.. తప్పులేదు.. కానీ రామారావు నీకు ఫోన్ చేసాక బాగా నీరసం గా ఉంది షుగర్ లెవల్స్ బాగా పెరిగాయి..ఎలాగైనా వద్దామనుకున్నాను.. క్రిందకి కూడా దిగలేదు.. సారీ నాగేశ్వర్రావు.. అన్నాడు..నాకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి..ఒకే సార్ పరవాలేదు.. అర్థం చేసుకున్నాను.. అన్నాను..మీ పనులన్నీ అయ్యాక లీషర్ గా అబ్బాయిని అమ్మాయిని ఒకసారి ఇంటికి తీసుకురా అన్నారు..చాలా హాయిగా అనిపించింది మనసుకు..అది ఆయన మనుషులకిచ్చే విలువ..అందుకే ఆయన ఇండస్ట్రీ కే గురువు అయ్యారు..
మే4న ఆయన బర్త్ డే… directors day సందర్భంగా ఆయన స్మరించుకుంటూ..
we love you sir..

– శివనాగేశ్వర రావు (సినీ దర్శకులు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap