ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈవీవీ

తెలుగు సినీ ప్రేక్షకులు కామెడీ అంటే పడిచస్తారు. అందుకే ఏ పరిశ్రమలోనూ లేనంత మంది కమెడియన్లను టాలీవుడ్ ఆదరించింది. కొందరు దర్శకులైతే కామెడీ చిత్రాలతో బాగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో ఈవీవీ సత్యనారాయణ పేరు మొదటి వరుసలో ఉంటుంది. అంత మంచి పేరు సంపాదించిన ఈవీవీ సత్యనారాయణ 2011లో మనందరినీ విడిచి వెళ్లిపోయారు. జూన్ 10న ఆయన 63వ జయంతి. ఈ సందర్భంగా 64కళలు.కాం ప్రత్యేక కథనం…. ఈవీవీ సత్యనారాయణ పూర్తి పేరు ఈదర వీర వెంకట సత్యనారాయణ. సత్యనారాయణ పశ్చిమ గోదావరి జిల్లాలోని దొమ్మేరులో వ్యవసాయ కుటుంబంలో 1958 జూన్ 10 ఈవీవీ జన్మించారు. నాన్న వెంకటరావు, అమ్మ వెంకటరత్నం. ఈయన కుటుంబానికి దొమ్మేరులో 70 ఎకరాల పొలం ఉంDEది. బాల్యం నుండి సినిమాలంటే ఆసక్తితో కనీసం వారానికి రెండు సినిమాలైన చూసేవారు. ఇంటర్మీడియట్ వరకు బాగానే చదివినా, ఇంటరు నిడుదవోలు వెళ్ళిన సత్యనారాయణ కాలేజికి వెళ్ళకుండా రోజూ ఉదయం ఆట, మధ్యాహ్నం ఆట సినిమాలను చూడటంతో హాజరు తక్కువై ఇంటర్మీడియట్ తప్పారు. అప్పుడు సత్యనారాయణ తండ్రి ఆయన్ను కాలేజీకి పంపించి లాభం లేదని నిశ్చయించి తండ్రితో పాటు పొలం పనులు చూసుకోవటానికి నియమించారు. 19 యేళ్ళకే 1976లో సరస్వతి కుమారితో పెళ్ళైంది. తర్వాత ఇద్దరు కొడుకులు పుట్టారు. వీళ్ళకు రాజేష్, నరేష్ అని పేరు పెట్టారు. కొన్నాళ్ళకు వ్యవసాయంలో పెద్ద నష్టాలు రావడంతో పొలాలు అమ్మేయవలసిన పరిస్థితి కలిగింది. ఆ పరిస్థితుల్లో అక్కడ ఉండటానికి సత్యనారాయణ తెగ ఇబ్బంది పడి, ఎక్కడికైనా మరో ఊరికి కొన్నాళ్ళు వెళ్ళిపోవాలనుకున్నారు.

ఆయన తన స్నేహితుడు నిర్మాత నవతా కృష్ణంరాజు మేనల్లుడైన సుబ్బరాజును సంప్రదించి ఒక సిఫారుసు ఉత్తరం పట్టుకుని మొదటిసారి మద్రాసు వెళ్ళారు. కృష్ణంరాజును కలిసి ఉత్తరం ఇవ్వగా ఆయన సినీరంగంలో జీవితం అనుకున్నంత సులభం కాదని, తిరిగి సొంత ఊరికి వెళ్ళిపొమ్మని హితవు చెప్పారు. దాంతో పూర్తిగా నిరాశచెందిన సత్యనారాయణ, తిరిగి వెళ్ళినా చేసేదేమీ లేదనుకుని మద్రాసులోనే ఉండి వివిధ ప్రదేశాలు తిరుగుతుండేవారు. పాండీబజారుకు వెళ్ళి అక్కడ సహాయదర్శకులు చెప్పుకునే మాటలు వినేవారు. ప్రతి ఉదయం నవతా కృష్ణంరాజు కార్యాలయం గేటు వద్ద నుంచుని ఉండేవారు. ఒక నెలరోజుల తర్వాత ఈవీవీ పట్టుదలను చూసి ఏం చెయ్యగలవు అని అడిగారు. సహాయ దర్శకున్ని అవుతానని చెప్పిన ఈవీవీని కనకాల దేవదాసు వద్ద ఓ ఇంటి బాగోతం సినిమాకు సహాయ దర్శకుడిగా అవకాశం ఇప్పించారు. అలా సినీ జీవితం ప్రారంభించిన ఈవీవీ తర్వాత జంధ్యాల వద్ద శిష్యుడిగా చేరారు. జంధ్యాల శిష్యుడిగా అనేక సినిమాలకు పనిచేసిన ఈవీవీ.. 1990లో వచ్చి ‘చెవిలో పువ్వు‘ సినిమాతో దర్శకుడిగా మారారు. సుమారు 51 సినిమాలకు దర్శకత్వం వహించగా అందులో ఎక్కువ కామెడీ చిత్రాలే. ముఖ్యంగా ఆయన తెరకెక్కించిన ‘జంబ లకిడి పంబ’ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఓ పత్రికలో ప్రచురణ కోసం ఈవీవీ ఆ కథను రాసి పంపగా.. ఇదికూడా ఓ కథేనా అని వాళ్లు తిప్పి పంపించారట. కానీ ఆ కథే సినిమాగా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. ‘జంబలకిడి పంబ‘ 1993 జులై 12వ తేదీ సెకండ్ రిలీజ్ చేశారు. ఇలాంటి సినిమాను మిస్ చేసుకున్నామా అని ఫీలైన ప్రేక్షకులు థియేటర్కు క్యూ కట్టారు. రూ. 50లక్షల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా రూ.2 కోట్ల రాబట్టింది. విజయవాడ, కాకినాడల్లో 100 రోజులు ఆడింది. ముఖ్యంగా స్కూల్ నేపథ్యంలో వచ్చే కామెడీ సన్నివేశం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఈ సినిమా వచ్చి ఏళ్లు గడచిపోతున్నా ఇంకా నవ్వులు పూయిస్తూనే ఉంది. ఈవీవీ సినిమాలో హాస్యంతో పాటు అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఈవీవీ అనే శకంలో ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయి. హాస్యాన్ని కొత్త పుంతలు తొక్కించడంలో ఈవీవీ ముందు నిలిచారు. చిన్న సినిమాలతో మొదలై స్టార్ హీరోల వరకు అందరితోనూ పని చేశారు. అందరూ హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన ఘనత ఈవీవీది. ఆయన సినిమాలను, ఆయన పంచిన హాస్యాన్ని అందరూ గుర్తు చేనుకుంటూనే ఉంటారు.

ఈవీవీ గారి చిన్న కుమారుడు నరేష్ హీరో గా నిలదొక్కుకొన్నాడు. ఈవీవీ లేని లోటు కామెడి సినీమా అభిమానులకు తీరని లోటు.

-బీజీఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap