సక్సెస్ ఫుల్ డైరెక్టర్ – కొరటాల

ఎన్నో చిత్రాలకు కథా రచయితగా పనిచేసి, నాలుగు సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించి తన 5 వ సినిమాకే మెగాస్టార్ చిరంజీవి ని డైరెక్ట్ చేసే అవకాశం పొందారు. పలు బ్లాక్ బస్టర్ చిత్రాలకు రచయితగా పనిచేసి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘మిర్చి’ సినిమాతో దర్శకుడిగా మారారు కొరటాల శివ. తొలి సినిమా సూపర్ హిట్ కావడంతో కొరటాల శివకు దర్శకుడిగా మంచి డిమాండ్ ఏర్పడింది. రెండో చిత్రానికే సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో పనిచేసే అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ‘శ్రీమంతుడు’తో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కొరటాల శివ ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్తో ‘జనతాగ్యారేజ్’, మహేశ్ బాబుతో మళ్లీ ‘భరత్ అనే నేను’ సినిమాలను డైరెక్ట్ చేశారు. అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలను సాధించినవే కావడంతో కొరటాల సక్సెస్ ఫుల్ స్టార్ డైరెక్టర్ అయ్యారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య’ను డైరెక్ట్ చేస్తున్నారు. సక్సెస్ ఫుల్ రైటర్‌గా, డైరెక్టర్ గా రాణిస్తున్న కొరటాల శివ పుట్టినరోజు జూన్ 15.

కొరటాల శివ ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న ఆచార్య సినిమా నిర్మాత మెగాపవర్‌స్టార్ రామ్ కూడా ఆయనకు విష్ చేస్తూ ట్వీట్ చేశారు. “అర్థవంతమైన కథలను అన్వేషించే ఆయన దాహం – ఎప్పటికీ తీరదు.
గొప్ప మానవతావాది. మమ్మల్ని ఇలాగే అలరిస్తూ ఉండాలని కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్ డే” అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కూడా కొరటాలకు శుభాకాంక్షలు తెలియజేసారు.

బీటెక్ పూర్తిచేసిన శివ, 1998లో ఉద్యోగం చేసుకుంటూ తనకు బావ వరుసైన పోసాని కృష్ణ మురళి దగ్గర సహాయకుడిగా చేరాడు. ఒక్కడున్నాడు, మున్నా, బృందావనం, ఊసరవెల్లి వంటి సినిమాలకు మాటల రచయితగా పనిచేశాడు. 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి సినిమాతో దర్శకుడిగా మారి విజయాన్ని అందుకున్నాడు.

SA: