తెలుగు సినిమా రంగంలో అతడో సునామి. ఎవడి బతుకు వాడే బతకాలన్న ఫిలాసఫీ. అతడో ట్రెండ్ సెట్టర్. భావుకుడు. రచయిత. ఫిలాసఫర్ అన్నిటికంటే ఎలాంటి కల్మషం లేని వ్యక్తి. అతడే దమ్మున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్. రామ్ గోపాల్ వర్మ టీమ్ లో ఒకడు. గుండెల్లో గునపాలు దించినట్టు ఉంటాయి అతడి డైలాగ్స్. పూరి అంటేనే ఓ బ్రాండ్. ఓ సెన్సేషన్. తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్న ఆయన టాప్ పొజిషన్ కు చేరుకున్నారు. అనుకోని పరిస్థితుల్లో కిందకు జారారు. సంపాదించుకున్న కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నాడు. ఒకానొక సమయంలో తాను ఒంటరివాడై పోయాడు. కానీ కష్ట కాలంలో ఏ మాత్రం ధైర్యం కోల్పోలేదు. అన్నీ కోల్పోయినా ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తీసి మరో బ్లాక్ బ్లస్టర్ మూవీతో తిరిగి తన పవర్ ఏమిటో రుచి చూపించాడు.
స్మూత్ కేరక్టర్ కే పరిమితమై పోయిన రామ్ పోతినేనిని ఈ సినిమాలో డిఫరెంట్ గా పూర్తి భిన్నంగా చూపించాడు. పూరీ అంటేనే మినిమమ్ గ్యారెంటీ వున్న డైరెక్టర్ గా పేరుంది. ఆయన తీసిన ప్రతి సినిమాలో హీరో కు ఓ స్పెషాలిటీ ఉంటుంది. అంతకంటే ఎక్కువగా ఐడెంటిటీ ఉంటుంది. మూస ధోరణితో సాగుతున్న టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ తో తీసిన బద్రి బిగ్ హిట్. ప్రిన్స్ మహేష్ బాబు తో తీసిన పోకిరి వసూళ్లను తిరుగ రాసింది. రవితేజతో తీసిన అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సక్సెస్ ఫుల్ గా ఆడింది. ఇదే నటుడితో తీసిన ఇడియట్ ఇరగ దీసింది. ఇండస్ట్రీలో బంపర్ హిట్ గా నిలిచింది. మరోసారి మహేష్ బాబు తో తీసిన బిజినెస్ మెన్ సినిమా కోట్లు కుమ్మరించేలా చేసింది. 2009వ సంవత్సరంలో నేనింతే సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. పూరి జగన్నాథ్ కు ఉత్తమ మాటల రచయితగా ఈ సినిమాకు నంది అవార్డు లభించింది.
శివమణి, చిరుత, టెంపర్ తదితర చిత్రాలు విజయవంతం అయ్యాయి. ఆంధ్రావాలా, 143 , సూపర్, దేశముదురు, హలో ప్రేమిస్తారా, బుజ్జిగాడు, ఏక్ నిరంజన్, గోలీమార్, నేను నా రాక్షసి, దేవుడు చేసిన మనుషులు, కెమెరామెన్ గంగతో రాంబాబు, ఇద్దరమ్మాయిలతో, జ్యోతిలక్ష్మీ ,ఇజం, పైసా వసూల్ , రోగ్ , మెహబూబా సినిమాలు తీశాడు పూరి జగన్నాథ్. నిర్మాతగా పోకిరి, పూరి టాకీస్ బ్యానర్ మీద హార్ట్ ఎటాక్ అనే చిత్రాన్ని నిర్మించాడు. యువ దర్శకులని ప్రోత్సహించేదుకు షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ద్వారా ఎంతో మంది లో స్ఫూర్తి నింపారు. తెలుగు చిత్రాలతో పాటు హిందీ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ తో బుడ్డా హోగ తేరా బాప్, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ని సినిమా రంగానికి పరిచయం చేస్తూ అప్పు లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాల్ని తీశారు.
Very good director.