పెయింటింగ్ పోటీ- లక్ష రూ. బహుమతులు!

డ్రాయింగ్ & పెయింటింగ్ (Drawing and Painting) పోటీల్లో అక్షరాల లక్ష రూపాయలు నగదు బహుమతులు…!

విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో డా.కేకేఆర్ హ్యాపీ వ్యాలీ స్కూల్ ఆధ్వర్యంలో స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ మరియు 64కళలు.కామ్ నిర్వహణలో 4 నుంచి 10 తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈనెల 23వ తేదీ, ఆదివారం ఉదయం 10-12:30 గంటల వరకు రాష్ట్ర స్థాయిలో ఆర్ట్ కాంటెస్ట్ నిర్వహించడుతుంది. ఈ కాంటెస్ట్ కి సంబంధించిన పోస్టర్ ను నిర్వాహకులు కేకేఆర్, స్ఫూర్తి శ్రీనివాస్,కళాసాగర్ లు ఆవిష్కరించారు.

విజయవాడ సిటీలో నాలుగు ముఖ్యమైన కూడళ్ళ నుంచి పార్టిసిపెంట్స్ కి ఉచిత బస్ సౌకర్యం… పార్టిసిపేట్ చేస్తున్న విధ్యార్థితో పాటు మరొకరికి ఉచిత భోజనం ఏర్పాట్లు…. ఆంధ్రప్రదేశ్ చిత్రకళా రంగంలో కనీ వినీ ఎరుగని రీతిలో జరుగబోతున్న ఈ ఆర్ట్ ఈవెంట్ కి సంబంధించిన వివరాలు ప్రతి ఒక్కరూ మీ చుట్టుపక్కల ఉన్న చిన్నారులకు చేరేలా చూసి మీరూ భాగస్వామ్యలు అవ్వండి.

తేదీ: 23 ఫిబ్రవరి 2025, ఆదివారం
ఉదయం: గం॥ 10 నుండి 12.30 ని॥ వరకు ఆర్ట్ కాంటెస్ట్.
జూనియర్స్ (Juniors) : (4,5, 6, 7 తరగతులు)
అంశం: మన సంస్కృతి-మన పండుగలు
_______________________________________

సీనియర్స్(Seniors) : (8, 9, 10 తరగతులు)
అంశం: సేవ్ నేచర్ ఫర్ ఫ్యూచర్
______________________________
వేదిక: డా. కే.కే.ఆర్. హ్యాపీ వ్యాలీ స్కూల్, తాడేపల్లి, ఆగిరిపల్లి, ఆంధ్రప్రదేశ్.
కాంటెస్ట్లో పాల్గొనేవారు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు
ఆఖరు తేదీ: 22 ఫిబ్రవరి 2025, ఉదయం 10 గంటల వరకు.

లక్ష రూపాయలు నగదు బహుమతులు:
ప్రధమ బహుమతి (First prize): రూ. 10,000/-
ద్వితీయ బహుమతి (Second prize): రూ. 7,500/-
తృతీయ బహుమతి (Third prize) : రూ. 5,000/-
ప్రోత్సాహక బహుమతులు : రూ. 2,500/- (10 మందికి)
(జూనియర్స్, సీనియర్స్ గ్రూపులకు వేర్వేరుగా బహుమతులు ఇవ్వబడును.)
పార్టిసిపేషన్ సర్టిఫికెట్: పోటీలో పాల్గొన్న వారందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇవ్వబడును.

లంచ్ బ్రేక్ : మ॥ గం॥ 12-45 నుండి 1-45 (పార్టిసిపెంట్స్ కి, వారితో పాటు ఒకరికి అక్కడే భోజనం ఏర్పాటు చేయబడును).
బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం : మధ్యాహ్నం గం॥ 2.30 ని॥ల నుండి.
విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకొనుటకు ఆఖరి తేదీ 22 ఫిబ్రవరి, 2025 ఉదయం 10 గంటల వరకు ఈ వాట్సాప్ నెంబరు 7981435393 లేదా QR Code link ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ప్రయాణం : విజయవాడలో (నాలుగు ప్రాంతాల నుండి) డా. కే.కే.ఆర్. హ్యాపీ వ్యాలీ స్కూల్(Dr. KKR Happy Valley School), ఆగిరిపల్లి కి నిర్వాహకులచే ఉచిత బస్ ఏర్పాటు చేయబడును.

Bus Pick up & Dropping points: Ramavarappadu Ring, Autonagar Gate, Benz Circle and Eluru Road (Hotel Swarna Palace).
Bus starting time: 8.30 am, Reporting time: 8.20 am.

పూర్తి వివరాలకు: ఈవెంట్ ఆర్గనైజర్స్:-స్ఫూర్తి శ్రీనివాస్: 99858 57599, కళాసాగర్: 98852 89995
ఈవెంట్ కోఆర్డినేటర్స్ :- షేక్ నదియా: 8919457055, మేడా సింధూశ్రీ: 7981578363, హేమంత్ : 8688048584.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap