డ్రీమ్ యంగ్ &చిల్డ్రన్స్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో 10 వ వార్షిక ఆల్ ఇండియా చిడ్రన్ అండ్ యూత్ ఆర్ట్ ఎగ్జిబిషన్ మార్చి 26 వ తేదీన ఉదయం విజయవాడలో జరుగనుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల నుండి ఈ పోటీల్లో పాల్గొన్న బాల, బాలికలకు, చిత్రకారులకు బహుమతులను అందజేస్తారు.
విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రం లో ఆదివారం జరుగనున్న ఈ ఉత్సవానికి వందలాది మంది చిన్నారులు, చిత్రకారులు హాజరుకానున్నారని డ్రీమ్ యంగ్ &చిల్డ్రన్స్ ఆర్ట్ అకాడమీ డైరెక్టర్ రమేష్ తెలియజేశారు.
ముందుగా చిత్రకళా ప్రదర్శనను A.Md. ఇంతియాజ్(Director, Ministry Welfare, Additional Secretary A.P. State Land Survey & Administration) ప్రారంభించనున్నారు. కళాసాగర్ అధ్యక్షతన జరిగే ఈ సభలో ముఖ్య అతిథులుగా కూరపాటి అజయ్ కుమార్-రిటైర్డ్ ప్రిన్సిపల్ కమీషనర్ ఆఫ్ ఇంకం టాక్స్, మొండెపు ప్రసాద్-ప్రిన్సిపల్ కమీషనర్ ఆఫ్ ఇంకం టాక్స్, గుంటూరు,, కె. హేమ చంద్రారెడ్డి(Chairman APS Higher Education), కె. రంగరాజన్(Deputy General Manager-SBI), డి. దేవానంద రెడ్డి(Director-APS Examinations), జి.రాజేశ్వర్(Asst. Commissioner, GST-Vijayawada), ఎం. ప్రభాకర్(OSD to Government Chiefwip, AP Assembly) అరవేటి నిర్మల(Chairman-AVOPA AP Mahila Vibhag) గార్లు పాల్గొంటారు.
Nice information sir