విజయవాడలో జాతీయ బాలల-యువ చిత్రకళా ప్రదర్శన

డ్రీం యంగ్ అండ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడెమి వారి 9 వ జాతీయ బాలల – యువ చిత్రకళా ప్రదర్శన-బహుమతి ప్రదానోత్సవం

విజయవాడకు చెందిన డ్రీం యంగ్ అండ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడెమి గత ఎనిమిది సంవత్సరాలుగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో చిత్రకళా ప్రదర్శనలు, పోటీలు నిర్వహిస్తూ భావిచిత్రకారులను ప్రోత్సహిస్తూ చిత్రకళారంగంలో పేరుపొందిన సంస్థగా గుర్తింపు పొందింది.

ఏప్రిల్ 9న, శనివారం ఉదయం 10 గంటలకు విజయవాడ బాలోత్సవ్ భవన్ రెండవ అంతస్థులో జరుగనున్న ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటున్నారు. ఉదయం 10 గంటలకు చిత్రకళా ప్రదర్శనను గోళ్ళ నారాయణరావు ప్రారంభిస్తారు.

ఈ పోటీలో సుమారు 60 పాఠశాలల నుండి రెండువేల మంది పాల్గొన్నట్లు, విజేతలకు బహుమతులు అదే రోజు అందజేయబడతాయని డ్రీం యంగ్ అండ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడెమి ఫౌండర్ పి. రమేష్ తెలిపారు.


SA:

View Comments (5)

  • నైస్ ....డ్రీం చిల్డ్రన్ ఆర్ట్ అకాడమీ వారికి అభినందనలు .శుభాకాంక్షలు

  • మంచి programme . అందరూ ఇటువంటి వాటిని ఎంకరేజ్ చెయ్యాలి. పిల్లలని మంచి పౌరులుగా తీర్చి దిద్దడానికి ఈ కళలు చాలా దోహదం చేస్తాయి.

  • మంచి programme . అందరూ ఇటువంటి వాటిని ఎంకరేజ్ చెయ్యాలి. పిల్లలని మంచి పౌరులుగా తీర్చి దిద్దడానికి ఈ కళలు చాలా దోహదం చేస్తాయి.

    • ఆర్ట్అ కాడమీల నిర్వాహకులు ఇదే విధంగా
      భావి చిత్రకారులను ప్రోత్సాహిస్తూ కార్యక్రమములు నిర్వహించడం ముదావహం.
      డ్రీం రమేష్ కు అభినందనలు.

  • ఆర్ట్అ కాడమీల నిర్వాహకులు ఇదే విధంగా
    భావి చిత్రకారులను ప్రోత్సాహిస్తూ కార్యక్రమములు నిర్వహించడం ముదావహం.
    డ్రీం రమేష్ కు అభినందనలు.