
డ్రీమ్ వర్క్స్ ఆర్ట్ గ్యాలరీ, విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్, జాతీయస్థాయి చిత్రకళా వర్క్ షాప్. సీజన్ 2
ప్రకృతి రక్షణ ధ్యేయంగా ప్రతీ మనిషి మెలగాలని రంగుల్లో రంగారిద్దాం.!!
తరలి రండి.. చిత్రకారులారా..! మన కుంచె తో సమాజాన్ని మేలుకొలుపుదాం..!
మన ప్రకృతిని మనం కాపాడుకుందాం.. ఇదే మన నినాదం..!
ప్రియమైన చిత్రకారులకు..
గత సంవత్సరం కేఎల్ యూనివర్సిటీలో మేము నిర్వహించిన జాతీయస్థాయి చిత్రకళా ప్రదర్శనలో మీరంతా పాల్గొని చిత్రాలు ప్రదర్శించగా ఎంతో వేడుకగా ఆ కార్యక్రమం విజయవంతమైంది.
ఈ సంవత్సరం చిత్రకారులకు మరింత ఉత్సాహం కలిగించేందుకు మా డ్రీమ్ వర్క్స్ ఆర్ట్ గ్యాలరీ వర్క్ షాప్ ను జాతీయస్థాయిలో నిర్వహించడానికి ముందుకు వచ్చింది. మరి మీరందరూఎంతో ఉత్సాహంగా ఆరోజు పాలోన్నట్లే, ఈ సంవత్సరం కూడా పాల్గొనేందుకు తరలి రావలసిందిగా ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం
తెలుపుతున్నాం..!
మన ప్రకృతిని మనం కాపాడుకుందాం..!
మానవుడు ప్రకృతిలో ఒక భాగం.ఈనాడు మనిషి తన మనుగడ కోసం ప్రకృతిలోని చెట్లని నరుకుతూ జంతువులను నిర్దాక్షిణ్యంగా నశింప చేయడమే కాక మన భూమిని, వాతావరణాన్ని కాలుష్యపు కోరలలోకి నెట్టి వేస్తున్నాడు. తెలిసి తెలిసి మానవుడు ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు.
కనుక మనం కుంచె ద్వారా సమాజాన్ని మేలుకొలిపే ప్రయత్నం చేద్దాం. సమాజం ఇప్పటికైనా మేలుకోకపోతే రేపటి తరాల పుట్టుకే ప్రశ్నార్థకం అవుతుంది. సమాజం మార్పు చెందితే రేపటి తరాలకు పచ్చని ప్రకృతిని అందించగలం.
కార్యక్రమము – ముఖ్యాంశాలు:
1) కార్యక్రమం తేదీ: 5 ఏప్రిల్ 2025.
2) సమయం: ఉదయం 10 గం. నుండి సాయంత్రం 4 గం. వరకూ.
3) వేదిక: స్కూల్ ఆఫ్ ప్లానింగ్, (SPA) విజయవాడ.
4) చిత్రించవలసిన అంశం: “మన ప్రకృతిని మనం కాపాడుకుందాం”.
5) ఈ కార్యక్రమంలో పాల్గొనే చిత్రకారుల చిత్రాలన్నీ ఒక కేటలాగు ప్రచురించడం జరుగుతుంది.
6) ఆసక్తి గల చిత్రకారులు మార్చి 15 వ తేదీ లోపు తమ పేరు, ఫోటో, సంక్షిప్త బయోడేటా ను వాట్సాప్ ద్వారా పంపించి రిజిస్టర్ చేయించుకోవలెను.
7) ఈ పోటీలో పాల్గొనేందుకు ఎటువంటి ప్రవేశ రుసుము చెల్లించనవసరం లేదు.
8) పాల్గొనే చిత్రకారులందరకు వాటర్ కలర్స్ A3 సైజ్ క్యాన్సన్ షీట్ మరియు ప్యాడ్ మా సంస్థ చే అందించబడును. చిత్రకారులు తమ బ్రష్ లను తామే తెచ్చుకోవలెను.
9) చిత్రకారులు నీటి రంగులు, పెన్సిల్, పెన్ మరియు ఇంకుతో మాత్రమే చిత్రాలు చిత్రించవలెను.
10) పాల్గొనే చిత్రకారులు అందరికీ మధ్యాహ్నం భోజనం, టీ వంటి ఏర్పాట్లు చేయబడును.
11) సాయంత్రం 4 గం.లకు వర్క్ షాప్ ముగించబడును. వెంటనే పాల్గొన్న చిత్రకారులందరినీ ఉచిత రీతిలో సర్టిఫికెట్, మొమెంటో లతో సత్కరించబడును.
మీ వివరాలు పంపాల్సిన వాట్స్ యాప్ నంబర్: 95029 44913 / 8096847152
పి.రమేష్, ఆర్టిస్ట్ & క్యూరేటర్
డైరెక్టర్, డ్రీమ్ ఆర్ట్ & ఆర్ట్ గ్యాలరీ,
విజయవాడ.