విజయవాడలో ఒక రోజు ‘ఆర్ట్ ఫెస్ట్’

జిజ్ఞాస కలిగిన వర్ధమాన చిత్రకారులకు, చిత్రకారులకు, చిత్రకళా ఉపాధ్యాయులకు వివిధ విభాగాల్లోని ప్రతిభ కలవారిని ప్రోత్సహిస్తూ పెయింటింగ్ మరియు డ్రాయింగ్ పోటీలను క్రమానుగతంగా డ్రీం యంగ్ అండ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడెమి, విజయవాడలో గత పదేళ్ళుగా నిర్వహిస్తుంది.

డ్రీం వర్క్స్ ఆర్ట్ గేలరీ, అనంత డైమండ్స్ మరియు కె. ఎల్. యూనివర్సిటి సంయుక్తంగా మార్చి 2 వ తేదీన నిర్వహిస్తున్న “వన్ డే ఆర్ట్ ఫెస్ట్ ఆఫ్ ఇండియా” ఎగ్జిబిషన్-కమ్‌ వర్క్‌షాప్ జాతీయ ఖ్యాతి గడించిన ప్రముఖ మరియు ప్రఖ్యాత కళాకారుల మార్గదర్శకాలతో రూపొందించబడింది. ఈ ప్రత్యేకమైన జాతీయ స్థాయి ఆర్ట్ ఎగ్జిబిషన్-కమ్-వర్క్‌షాప్‌లో పాల్గొనడానికి మేము 250-300 మంది కళాకారులను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము. వారిలో ప్రసిద్ధ కళాకారులు, శిల్పులు, కార్టూనిస్టులు, డిజిటల్ కళాకారులు మరియు ఫోటోగ్రాఫర్లు ను కూడా ఆహ్వానిస్తున్నాం.

ముఖ్య సూచనలు:
-వర్క్‌షాప్ లో పాల్గొనే కళాకారులెవరు ఏవిధమైన ఎంట్రీ ఫీ (No entry Fee) చెల్లించనవసరం లేదు.

-పాల్గొనే కళాకారులందరూ తమ చిత్రాలను/కార్టూన్లను/ శిల్పాలను తమ వెంట తెచ్చుకొని ప్రదర్శించవచ్చు.

-వర్క్‌షాప్ లో పాల్గొనే కళాకారులందరికీ వాటర్ కలర్స్, A-3 సైజ్ కేన్సన్ డ్రాయింగ్ షీట్ (A-3 size Drawing sheet), పాడ్ అందజేయబడతాయి. బ్రష్ తదితర మెటీరియల్ మీరే తెచ్చుకోవాలి.

-తమకు నచ్చిన చిత్రాన్ని (Your own drawing/painting/cartoon) ఇచ్చిన డ్రాయింగ్ షీట్ పై పెయింట్ చేయాలి.

-చిత్రకళా ప్రదర్శనలో/వర్క్‌షాప్ లో పాల్గొన్న కళాకారులకు ఏవిధమైన వసతి, ప్రయాణ ఖర్చులు ఇవ్వబడదు.

-వర్క్‌షాప్ లో పాల్గొనాలనేకున్నవారు ఫిబ్రవరి 20 తేదీలోపు వాట్స్ యాప్ (9502944913) నంబరుకు మీ వివరాలు పంపండి.

ఆశక్తి కలవారు డ్రీం వర్క్స్ ఆర్ట్ గేలరీ ఫౌండర్ రమేష్ ని (Contact: 95029 44913) సంప్రదించండి.
———————————————————————————————-

“వన్ డే ఆర్ట్ ఫెస్ట్”(Art Fest) జరుగు తేదీ: మార్చి 2, 2024
వేదిక: కె. ఎల్. యూనివర్సిటి క్యాంపస్, వడ్డేశ్వరం, గుంటూరు జిల్లా
సమయం: ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు

SA:

View Comments (1)