పర్యావరణ మిత్రుడు మట్టి వినాయకుడు

పార్వతిపుత్రుడు – పర్యావరణ మిత్రుడు
పత్రితో పూజించిన చాలు పరవశించి
వరములిచ్చుదైవం… వరసిద్ధి వినాయకుడు
దివిలో వేల్పులూ కొలిచే వేలుపు
భువిలో ‘తొలి పూజలందుకునే… ఇలవేలుపు గజాననుడు ఘనుడు!
భక్తితో ‘పచ్చిక’ సమర్పించిన చాలు
మచ్చికయ్యే బొజ్జగణపయ్య ప్రాకృతికదైవం
తన పూజకు గరికనూ ఇష్టపడే ఈ గిరిజాతనయుడు హరిత ప్రేమికుడు.
మామిడి, జిల్లేడు, నేరేడు, మారేడు, నెలవంక, గన్నేరు
వంటి పత్రితో ప్రసన్నమయ్యే ప్రత్యేకగుణమున్న దైవం గణపతి
ఆరోగ్యం కోసం “ఆసుపత్రి”తో
పనిలేని ఆ…సుపత్రి”తోనే
మనకు ఆయురారోగ్యాలనందించే మనం సృష్టించే మృణ్మయదేహంలోనూ
కొలువుండే దైవం ఈ లంబోదరుడు!
విశిష్ట దైవం -వినాయకుడు
ఆకులతో ఆరాధన – జనానికి ఆరోగ్యసాధన గణపతి పూజ భావనః
పంచభూతాలలో ఒకటైనట్టి మట్టి వినాయక విగ్రహం – మనకు మంచిది.
పంచభూతాలకు చెందని రంగులు-రసాయనాలు “ప్రపంచభూతాలు”
కృత్రిమ విగ్రహాలుమాని, ప్రాకృతికమైనట్టి మట్టి విగ్రహాలు చేయాలి.
మనకు ఆ దేవుని అనుగ్రహానికి, మన భూగ్రహానికీ
నేడు మట్టి వినాయకుడే.. మంచి వినాయకుడు.

బి.ఎం.పి.సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap